హైదరాబాద్: కేసీఆర్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీనియర్ నాయకులు హాజరుకాలేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కె. జానారెడ్డి సహా పలువురు నేతలు ఈ కార్యక్రమానికి రాలేదు. టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వక విలువలు పాటించలేదని కాంగ్రెస్ నేతల అసంతృప్తి వ్యక్తం చేశారు.
అందరి మాదిరిగానే కాంగ్రెస్ నాయకులకు ఆహ్వాన పత్రాలు అందాయి. అయితే ఫోన్‌చేసి పిలవడం సంప్రదాయమని సీనియర్ నేతలు అంటున్నారు. ఈ సంప్రదాయాన్ని పాటించనందువల్లే తాము కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు.
ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ నేతల డుమ్మా
Published Mon, Jun 2 2014 11:37 AM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM
Advertisement
Advertisement