
'పార్టీ కష్టకాలంలో ఉంది'
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యాలు సరికాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదంతోనే పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ నియమితులయ్యారని గుర్తు చేశారు. ఉత్తమ్ నియామకాన్ని తప్పుబట్టడమంటే హైకమాండ్ ను వేలెత్తిచూపడమేనని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉందని, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని హితవు పలికారు.
టీపీసీసీకి సారథిగా పొన్నాల లక్ష్మయ్య కంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపిక వరస్ట్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉత్తమ్ పై బహిరంగంగా విమర్శలు చేసినందుకు పీసీసీ క్రమశిక్షణా సంఘం ఆదివారం కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.