'పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం బాధాకరం'
పార్లమెంట్లో పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం పోందటం బాధాకరమని తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్లో జానారెడ్డి మాట్లాడుతూ... ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానికత అంశంలో సెటిలర్లకు నష్టం జరగదని అన్నారు.
పోలీసు భద్రత కల్పించైనా ఆర్డీఎస్కు మరమ్మతులను పూర్తి చేయాలని జానారెడ్డి ఏపీ సర్కార్కు హితవు పలికారు. పోలవరం ఆర్డినెన్స్ ఈ రోజు పార్లమెంట్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.