తెలంగాణలోని ఏడు మండలాలను ఒదులుకొనేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్సష్టం చేశారు. పాలవరం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, పువ్వాడ అజేయ్, రామిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... పోలవరం ఆర్డినెన్స్పై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. పోలవరంపై ఆంధ్రప్రదేశ్ న్యాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వాటిని ఎదుర్కొంటామని వారు స్పష్టం చేశారు. లోక్సభలో శుక్రవారం పోలవరం ఆర్డినెన్స్ బిల్లు... తెలంగాణ ఎంపీలు నిరసనల మధ్య ఆమోదం పొందింది. పోలవరం ఆర్డినెన్స్ బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజుకు అన్ని పార్టీలు బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.