పోలవరంపై ‘అఖిలపక్షం’ పెట్టండి: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై కాలయాపన చేయకుండా తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, కార్యాచరణ ప్రకటించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుందో తెలపాలన్నారు.
సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కింద మంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకునేందుకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.