హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు మార్పు అంశాన్ని కేంద్ర దృష్టికి తీసుకువెళ్లాలని తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సూచించారు. ఈ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన పొంగులేటి.. ప్రాజెక్టు ఆథారిటీలో తెలంగాణకు చెందిన వారిని లేకుండా చేసారని మండిపడ్డారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ప్రజలు నలిగిపోతున్నారన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య పలు అంశాల వివాదాలు పరిష్కారం కాకపోవడంతో కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. 180 రోజుల పాటు కేసీఆర్ పాలనలో 18 అంశాలు మాత్రమే అరకొరగా అమలయ్యాయన్నారు.