- కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచడానికి ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ కేంద్ర జలసంఘం, గోదావరి నదీ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే పోలవరం ఎత్తును పెంచడానికి ఏపీ ప్రభుత్వం జీఓను విడుదల చేసిందన్నారు. పోలవరం ఎత్తు పెంచడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, ఎత్తు పెంచకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.