
ఫిరాయింపులు సిగ్గుచేటు: జానారెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం సిగ్గుమాలిన చర్య అని తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి దుయ్యబట్టారు. ఫిరాయింపుల అంశంలో స్పీకర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
గతంలో కూడా ఫిరాయింపులను తాను ఖండించానని గుర్తుచేశారు. భవిష్యత్ లో కాంగ్రెస్ ఎటువంటి ఫిరాయింపులు ప్రోత్సహించదని చెప్పారు. పార్టీ ఫిరాయింపులు అసెంబ్లీ గౌరవానికి భంగకరమన్నారు. ఫిరాయింపుదారులపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.