కేసీఆర్‌ మార్కులు నాకెందుకు?: జానా | janareddy fired on cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ మార్కులు నాకెందుకు?: జానా

Published Sat, Mar 11 2017 2:54 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

కేసీఆర్‌ మార్కులు నాకెందుకు?: జానా - Sakshi

కేసీఆర్‌ మార్కులు నాకెందుకు?: జానా

సాక్షి, హైదరాబాద్‌: ‘‘నా నియోజకవర్గంలో నాకు సానుకూల పరిస్థితులున్నాయి. కేసీఆర్‌ వేసే మార్కులు నాకు అవసరం లేదు. ఇలాంటి సర్వేలపై ఆధారపడి కాదు... ప్రజలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నా’’అని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్‌ ప్రసంగం తర్వాత తన చాంబర్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేలపై, వాస్తవ పరిస్థితులపై మీడియా కూడా సరైన విశ్లేషణలను అందించడం లేదన్నారు.

ప్రజల సొమ్ముతో ప్రభుత్వం సర్వేలను చేయించడం దుబారా ఖర్చన్నా రు. ‘‘నేను ఓడిపోతానని పోటీ చేసిన ప్రతీ సారి సర్వేలు చేసి చెప్పారు. అయినా అన్నిసార్లు గెలిచాను. ఈ సర్వేలు కేవలం చదువుకోవడానికే. ఎవరో సీఎం అవుతారని అనగానే అయిపోము. దానికి చాలా సమీకరణాలుంటాయి’ అన్నారు. తాను సీఎం అవుతానని ఏనాడూ, ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement