ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత అధికార పార్టీదే | jana reddy fired on trs party | Sakshi
Sakshi News home page

ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత అధికార పార్టీదే

Published Wed, Jun 1 2016 2:42 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత అధికార పార్టీదే

ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత అధికార పార్టీదే

సీఎల్పీ నేత జానారెడ్డి

 సాక్షి, హైదరాబాద్: త్యాగా లు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజ ల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీదేనని సీఎల్పీ నేత కె. జానారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. రాష్ట్ర ప్రజల ఆందోళన, ఆకాంక్షలను గమనించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. చారిత్రాకమైన సోనియా నిర్ణయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని జానా పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాల్లో అవకాశాల పెంపు, సాగు నీరు, వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి మొదలైనవి సాధించడం ద్వారా సమతౌల్యతతో కూడిన రాష్ట్రాభివృద్ధి జరగాలని జానా ఆకాం క్షించారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన వారికి అభినందనలు తెలిపిన జానా... అమరవీరులకు శ్రద్ధాంజలి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement