టోక్యో: జపాన్ పార్లమెంట్‌లోని శక్తిమంతమైన దిగువ సభకు ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికార పక్షం మెజారిటీకి గండిపడింది. 465 సీట్లకు గాను మెజారిటీకి 233 సీట్లు అవసరం. చివరి ఫలితాలు అందేటప్పటికీ అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ, మిత్రపక్షం కొమెయిటో కలిపి 211 సీట్లు గెలుచుకున్నాయి. ఈ సంఖ్య కొంత పెరిగేలా ఉన్నా అధికార పక్షానికి మెజారిటీ కష్టమేనని భావిస్తున్నారు.
ప్రతిపక్షం, ఇతరులు కలిసి 224 వరకు స్థానాలను దక్కించుకున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసి, విజయం సాధించిన తమ వారిని కూడా కలుపుకుంటే అధికార పక్షం బలం పెరగొచ్చు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో వారిని చేర్చుకునేందుకు ఎల్‌డీపీ సిద్ధంగా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలోని మరో పార్టీ సాయంతో ప్రధానమంత్రి షిగెరు ఇషిబా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment