expectation
-
వ్యక్తం... అవ్యక్తం
పైకి పచ్చగా కనిపించే చెట్టు ఎంత విస్తరించి ఉన్నదో అంత కన్న ఎక్కువగా దాని వేళ్ళు నేలలో పాతుకుని పోయి ఉంటాయి. చెట్టు అంటే పైకి కనిపించే కొమ్మలు, ఆకులు, పూలు, పళ్ళు మాత్రమే అనుకుంటే ఎంత పొరపాటో తెలుస్తోంది కదా. అదే విధంగా మనకి పైకి కనిపించే ప్రపంచం వెనుక ఎంతో ప్రయత్నం ఉంది. కనపడేది ఒక వంతు మాత్రమే... మూలమైనది మూడు వంతులు అని మన ఋషులు దర్శించి తెలియ చేశారు. ఒక వైద్యుడి దగ్గరకి వెళ్లినప్పుడు ఆయన నాలుగు మాటలు చకచక రాయటం చూసి, ఈ మాత్రానికే రూ. 500 తీసుకున్నాడు అని వాపోతారు. కాని, ఆ నాలుగు మాటలు, అంటే మందుల పేర్లు రాయటానికి ఆయన ఎంత కాలం కృషి చేసి ఉంటారో . ఒకసారి ఒక యంత్రం హఠాత్తుగా ఆగిపోయిందట. అందరూ రకరకాలుగా ప్రయత్నం చేశారు కానీ అది మొండికేసింది. ఒక ఇంజినీర్ని పిలిచారు. ఆయన వచ్చి అటు ఇటు పరిశీలించి సుత్తి తీసుకుని సున్నితంగా ఒక దెబ్బ వెయ్యగానే అది పని చెయ్యటం మొదలు పెట్టింది. తన ఫీజు అడగగానే ఒక సుత్తిదెబ్బ ఇంత ఖరీదా? అని అడిగాడట యజమాని. దానికి ఆ ఇంజినీరు సుత్తి దెబ్బకి ఒక రూపాయే. కానీ ఎక్కడ కొట్టాలో, ఎట్లా కొట్టాలో తెలుసుకున్నందుకు మిగిలినది అన్నాడట. నిజమే కదా. సుత్తిదెబ్బ అయితే ఎవరైనా కొట్టి ఉండ వచ్చుగా. ఇంజినీరు ని పిలవటం ఎందుకు? పైకి కనిపించే పని వెనక ఉన్న కృషే పనిలో నైపుణ్యానికి కారణం. ‘‘పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతమ్ దివి’’ అంది పురుష సూక్తం. అది అర్థం కావటానికి మానవుడు స్వయంగా ఇతర ప్రమేయం లేకుండా తయారు చెయ్యగల ఒకే ఒక్కమాట ని ఉదాహరణగా తీసుకోవచ్చు.‘‘త్రీణి నిహితా గుహాని తాని విదుర్ర్బాహ్మణా మనీషిణః నేంగయన్తి తురీయమ్ వాచో మనుష్యా వదంతి’’పరా, పశ్యంతి, మాధ్య మా అనే మూడుస్థాయుల ప్రయత్నం తరువాత వైఖరి అనబడే అందరికి వినపడే వాక్కు వెలువడుతుంది. మనకి తెలియకుండానే ఇంత ప్రయత్నం జరిగిపోతోంది. ఇది అర్థం చేసుకోగలిగితే సృష్టి రహస్యం చాలా వరకు తెలిసినట్టే. దృశ్యమాన జగత్తుకి కారణమైన అదృశ్యంగా ఉన్న దానిని కనీసం ఊహించగలుగుతాం. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక నాటక ప్రదర్శననో, చలనచిత్రాన్నో చూడండి. రంగస్థలం మీద ఒక గంటో, రెండుగంటలో ప్రదర్శించే నాటకానికి పూర్వరంగం అంటే ముందు చేసే ప్రయత్నం ఎంతో. తెరమీద కనపడే ఒక దృశ్యాన్ని చిత్రీకరించటానికి ఎంతమంది ఎన్నిరోజులు శ్రమించి ఉంటారో ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం చేస్తూనే ఉన్నారుగా. ఒక గంట పాట కచేరీకి ఇన్ని వేలా? అని ప్రశ్నించే వారికి సమాధానం అది ఆ గంట కచేరీకి కాదు, దానికి ముందు చేసిన సాధనకి అని. ఒక మేథావి ఇచ్చిన గంట ఉపన్యాసం వింటే వంద గ్రంథాలు చదివినట్టే అనేది అందుకనే. ఒక్క గంట మాట్లాడటానికి వాళ్ళు అప్పటికి కొన్ని గ్రంథాలు చదువుతారు. అంతకుముందే ఎన్నో గ్రంథాలు చదివి ఉంటారు. దానికి వారి అనుభవం, విశ్లేషణ జోడించబడతాయి. ఈ దృష్టి అలవరచుకుంటే వ్యక్తం నుండి అవ్యక్తానికి ప్రస్థానం ప్రారంభమైనట్టే. ఒక చెట్టుని కొట్టటానికి గంట పట్టింది. ఎంత తేలిగ్గా అయిపోయిందో అని చూసే వాళ్ళు అనుకుంటారు. కాని, గంట సమయంలో కొట్టటానికి గాను గొడ్డలికి తగినంత పదును పెట్టటానికి కనీసం పది గంటలు పట్టి ఉంటుంది. కనపడే పని వెనక కనపడకుండా ఉన్న సంసిద్ధత కోసం చేసిన ప్రయత్నం ఎంత ఉంటుందో అర్థం చేసుకుంటే పని సమయాన్ని సరిగా అంచనా వేసినట్టు అవుతుంది. చాలా సందర్భాలలో చేసే పని విలువని సరిగా అంచనా వెయ్యలేకపోవటానికి ఇటువంటి అవగాహనాలోపమే కారణం. – డా. ఎన్.అనంత లక్ష్మి -
పేరుకే ఫ్రీక్వెన్సీ! తప్పని నిరీక్షణ
సాక్షి,హైదరాబాద్: నగరంలో రద్దీ వేళల్లో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి నాలుగైదు నిమిషాలకోసారి మెట్రో రైలు నడుపుతామన్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో 8 నుంచి 10 నిమిషాల పాటు నిరీక్షణ తప్పడంలేదని చెబుతున్నారు. కొన్నిసార్లు ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం మూడు మెట్రో కారిడార్ల పరిధిలోని 54 మెట్రో మెట్రో స్టేషన్లకు చేరుతున్న ప్రయాణికులు ప్లాట్‌ఫారాలపై కిక్కిరిసిపోతున్నారు. రైలులోకి ప్రవేశించే సమయంలోనూ తోపులాట తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బోగీల్లోనూ బయటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏసీని పెంచడం లేదా తగ్గించడం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ.. మధ్యాహ్నం వేళల్లో బోగీల్లో ఉక్కపోతతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు విలవిల్లాడుతున్నారు. మెట్రో అధికారుల పర్యవేక్షణ లోపంతోనే తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. క్రమంగా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య.. కోవిడ్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో నగరంలో మెట్రో రైళ్లలో రద్దీ క్రమంగా పెరుగుతోందని మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సాధారణ రోజుల్లో మూడు కారిడార్లతో కలిపి రద్దీ 3 నుంచి 3.5 లక్షలుకాగా.. సెలవు రోజుల్లో రద్దీ నాలుగు లక్షలకు చేరువవుతోందని పేర్కొన్నాయి. సాధారణ రోజుల్లో అత్యధికంగా ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో నిత్యం సరాసరిన సుమారు 1.75 లక్షల మంది జర్నీ చేస్తున్నారని.. ఆతర్వాత నాగోల్– రాయదుర్గం మార్గంలో 1.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారని.. ఇక జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో రద్దీ 25 వేలుగా ఉంటుందని తెలిపాయి. నగరంలో అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాలు, కార్లను పార్కింగ్ చేసుకునే అవకాశం లేకపోవడం, పార్కింగ్ ఉన్న చోట చార్జీల బాదుడు షరామామూలే. సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ఇటీవలి కాలంలో పలు మెట్రో స్టేషన్లలో మధ్యభాగం (కాన్కోర్స్)వద్ద చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు నిర్మాణ సంస్థ అవకాశం ఇచి్చంది. ఈ ప్రాంతంలో నిత్యావసరాల దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో రైలు దిగిన వెంటనే సిటీజన్లు వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. (చదవండి: మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో హైటెన్షన్) -
USA: గ్రీన్‌కార్డు నిరీక్షణకు తెరపడేనా!
గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న భారతీయుల నిరీక్షణకు తెరపడేదెన్నడు? కంట్రీ కోటా పరిమితి 7 శాతాన్ని ఎత్తేస్తే భారతీయులకి ఏ మేరకు ప్రయోజనం కలుగుతుంది? కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాదిగా అమెరికా రాకపోకలపై ఆంక్షలతో గ్రీన్ కార్డులు మంజూరు కాకపోవడం మన దేశానికి కలిసి వస్తుందా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు మంజూరులో పెద్ద దేశం, చిన్నదేశం అన్న తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో 20వ శతాబ్దం మధ్యలో దేశాలకు పరిమితి విధించారు. ప్రతీ ఏడాది జారీ చేసే గ్రీన్‌కార్డుల్లో ఏ ఒక్క దేశానికీ ఏడు శాతానికి మించి జారీచేయకూడదని పరిమితి విధించారు. ఇప్పుడవే భారతీయ టెక్కీలకు శాపంగా మారాయి. అగ్రరాజ్యంలో పర్మనెంట్ రెసిడెంట్ హోదా పొందాలంటే జీవిత కాలం వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి వచ్చాక దేశాల పరిమితిని ఎత్తేయడం కోసం రెండు బిల్లుల్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టడంతో భారతీయుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆ రెండు బిల్లుల్లో ఏది ఆమోదం పొందినా భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభిస్తుంది. భారత్ నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన టెక్కీలు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నా... గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. చిన్న దేశాల నుంచి తక్కువ సంఖ్యలో వెళ్లేవారికి వెనువెంటనే గ్రీన్ కార్డు రావడం అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. ఏ దేశం నుంచి వచ్చారు అన్నది కాకుండా అమెరికాకు ఎంతవరకు వారి సేవలు ఉపయోగపడతాయి అన్నదే ఆధారంగా గ్రీన్ కార్డులు మంజూరు చేయాలని డెమొక్రాటిక్ ప్రజాప్రతినిధి లోప్గ్రెన్ అభిప్రాయపడ్డారు. నైపుణ్యం కలిగిన వారే దేశంలో స్థిరపడితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు అండదండగా ఉంటారని, అందుకే కాలం చెల్లిన కంట్రీ క్యాప్‌ను తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అదే జరిగితే భారత్, చైనా దేశాలకే అత్యధికంగా గ్రీన్ కార్డులు మంజూరు అవుతాయి. ప్రతినిధుల సభలో బిల్లులు ► ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్‌కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈగల్) చట్టం–2021ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో 7 శాతంగా ఉన్న కంట్రీ క్యాప్‌ను ఎత్తేయడం, కుటుంబ వీసాల పరిమితిని ఏడు నుంచి 15 శాతానికి పెంచడం ఉన్నాయి. దీని ప్రకారం ఉద్యోగంలో అత్యంత ప్రతిభను చూపిస్తూ, అధిక జీతం తీసుకుంటున్న వారికి తొలుత గ్రీన్ కార్డులు మంజూరు చేస్తారు. ఇది ప్రతినిధుల సభ ఆమోదం పొంది, సెనేట్‌లో పాసైతే... బైడెన్ సంతకంతో చట్టం అవుతుంది. ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల సమయంలో అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పిస్తానన్న హామీని నెరవేర్చుకోవడానికి అమెరికా పౌరసత్వ చట్టం 2021ను ఇప్పటికే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఇందు లో కూడా గ్రీన్‌కార్డులకు సంబంధించి కంట్రీ కోటాను ఎత్తేయాలని ఉంది. ఈ బిల్లు ప్రకారం ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే ముందు గ్రీన్ కార్డు మంజూరు చేయాలి. గ్రీన్‌కార్డు మంజూరైన తర్వాత అయిదేళ్లకి అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చునన్న ప్రస్తుత నిబంధనల్ని మూడేళ్లకి తగ్గించారు. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్), 2020 గణాంకాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తులు – 12 లక్షలు పైగా పెండింగ్‌లో ఉన్న భారతీయుల దరఖాస్తులు – 8 లక్షలు (66%) ప్రతీ ఏడాది జారీ చేసే గ్రీన్ కార్డులు – 3,66,000 (ఇందులో రెండు కేటగిరీలు ఉంటాయి) కుటుంబాలకు ఇచ్చే గ్రీన్ కార్డులు – 2,26,000 ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులు – 1,40,000 ఈ గ్రీన్‌కార్డుల్లో భారతీయులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే ఈబీ–2, ఈబీ–3 కేటగిరీ కింద ఏడాదికి 40,040 గ్రీన్ కార్డుల జారీ కంట్రీ కోటా కారణంగా నష్టపోతున్న దేశాలు: భారత్, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ – నేషనల్ డెస్క్, సాక్షి -
పిల్లలే ఫ్యూచర్
ఇవాళ సత్యార్థి బర్త్‌డే. బాలల ఆకాంక్షలకు స్వేచ్ఛనివ్వడమే ఆయనకు మనం పంపే బర్త్‌డే గ్రీటింగ్! మనిషి పరుగులు ఎవరి కోసం? సంపాదన కోసం. సంపాదన ఎవరి కోసం? పిల్లల కోసం. లోకం.. పిల్లల చుట్టూ తిరుగుతోంది. పిల్లలే లోకంగా అవిశ్రాంతంగా శ్రమిస్తోంది. సూక్ష్మంగా చూస్తే సైన్స్అండ్ టెక్నాలజీ, సోషియాలజీ, పాలనా నిర్ణయాలు.. అన్నీ.. పిల్లల కోసమే. పిల్లలే ప్రపంచ భవిష్యత్తు కాబట్టి. అయితే.. పిల్లల చుట్టూ పరిభ్రమిస్తున్న మనిషి గానీ, పాలనా యంత్రాంగాలు కానీ పిల్ల రక్షణను, సంరక్షణకు అవసరమైన శ్రద్ధను చూపడం లేదు. సమాలోచనలు చేయడం లేదు. పిల్లల కోసం చేసిన చట్టాలు సక్రమంగా అమలవుతున్నదీ లేనిదీ చూడడం లేదు! బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి.. ట్రెయినీ కలెక్టర్లతో ముచ్చటించేందుకు ప్రత్యేక ఆహ్వానంపై మంగళవారం హైదరాబాద్ వచ్చినప్పుడు ఇదే విషయమై ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. బాలల కోసం కలెక్టర్లుగా వాళ్లేం చేయవలసిందీ చెప్పారు. సత్యార్థి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కూడా. స్కూల్‌కు వెళ్లడం కోసం ఉగ్రవాదుల ఆక్షలను సైతం ఉల్లంఘించిన మలాలాకు, సత్యార్థికి కలిపి 2014లో ఆ అవార్డు వచ్చింది. ప్రపంచ జనాభాలో ఆరు కోట్ల మంది బాలలకు చదువుకునే భాగ్యం లేదు. నాలుగు కోట్ల మంది బాలకార్మికులుగా నలిగిపోతున్నారు. నిమిషానికి ఒక చిన్నారి చొప్పున కనిపించకుండా పోతున్నారు! ఆ తర్వాత అక్రమ రవాణా అవుతున్నారు. ఇవన్నీ చెబుతూ, ‘కలెక్టర్లు దృష్టి పెడితే ఈ పరిస్థితి మారుతుందని సత్యార్థి అన్నారు.బాలల కోసం సత్యార్థి.. డ్రీమ్, డిస్కవరీ, డు.. అనే త్రీడీ ఫార్ములా ప్లాన్ చేశారు. భవిష్యత్తు గురించి కలలు కనడం, భవిష్యత్తు అవకాశాలను కనుగొనడం, అందుకు అనుగుణంగా ముందుకు సాగడం.. అనే ఈ తీడ్రీ ఫార్ములాతో పిల్లలు స్వేచ్ఛగా ఎదిగేలా చూడడం, వారికి చట్టపరంగా జరగవలసిన న్యాయాన్ని అందించడం కలెక్టర్ల ప్రధాన కర్తవ్యం కావాలని సత్యార్థి కోరారు. సత్యార్థి కూడా ఒక కల కంటున్నారు. పిల్లలంతా సంతోషంగా కళకళలాడుతూ ఉండే ప్రపంచాన్ని ఆయన ఆకాంక్షిస్తున్నారు. పిల్లలే పెద్దల ప్రపంచం కావడం ఒక్కటే కాదు, ఈ ప్రపంచం పిల్లలది అయ్యేలా చూడ్డం ప్రతి తల్లీ తండ్రీ బాధ్యత. అలాగే ప్రభుత్వాలదీ. గ్లోబల్ రిపోర్ట్ ►6 కోట్లు... బడి భాగ్యం లేని పిల్లల సంఖ్య ►4 కోట్లు... బాల కార్మికుల సంఖ్య ►నిమిషానికొకరు అదృశ్యం ►80 శాతం చిన్నారులపై పరిచయస్తుల లైంగిక అఘాయిత్యాలు -
బడ్జెట్‌పై శివసేన స్పందన
ముంబై: 2017-18 ఆర్థిక బడ్జెట్ పై శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్ పై స్పందించిన బీజేపీ సోదర సంస్థ శివసేన అధినేత ఉధ్దవ్ థాకరే మరోసారి మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఈ ఆర్థిక బడ్జెట్ లో ప్రజల ఆకాంక్షలను కేంద్రం అందుకోలేకపోయిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినపుడు అచ్ఛే దిన్ తీసుకొస్తామని వాగ్దానం చేశారని.. కానీ. ఎక్కడ ఆ అచ్ఛే దిన్ అని థాకరే ప్రశ్నించారు. చ్ఛే దిన్ గురించి ప్రభుత్వం ఇపుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజలకు అనేక కష్టాలనెదుర్కొన్నారని థాకరే మండిపడ్డారు. డీమానిటైజేషన్ తరువాత ఉగ్రదాడులు తగ్గుముఖం పడతాయని కేంద్రం చెప్పిందనీ, అయితే టెర్రరిస్టుల దాడులు తగ్గకపోగా ..మరింత పెరిగాయని ఆయన ఆరోపించారు. అలాగే కేంద్ర మంత్రి మనోహరి పారికర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించిన థాకరే వాస్తవాలను వాస్తవాలుగానే చూడాలన్నారు. ఏ రుజువు లేకుండా ఎవరూ అలాంటి విషయాలను చెప్పరని వ్యాఖ్యానించారు. బుధవారం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. -
వెయిటింగ్!
పాలమూరు : రవాణా శాఖలో నూతన స్లాట్ల కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాల విభజన జరిగి 12 రోజులు గడిచినా అధికారుల పర్యవేక్షణ లోపంతో వాహనదారులకు నిరీక్షణ తప్పడంలేదు. గతంలో ఆర్టీఓ కార్యాలయాల్లోనే ట్రాన్స్‌ఫోర్టుకు సంబంధించిన లావాదేవీలు జరిగేవి. ఇతర నాన్ట్రాన్స్పోర్టుకు సంబంధించిన లావాదేవీలు ప్రాంతీయ రవాణా అధికారుల కార్యాలయంలో నిర్వహించేవారు. అయితే ఈనెల 11నుంచి జిల్లాల విభజన నేపథ్యంలో నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో అన్ని రకాల లావాదేవీలు ఎక్కడికక్కడే జరపాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ జిల్లాల విభజన జరిగి 12రోజులు గడుస్తున్నా చిన్నపాటి స్లాట్ల మార్పు ప్రక్రియను మార్చకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఆగిన మీ సేవ మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ విభజన ప్రభావం పూర్తిగా మీ సేవ కేంద్రాలపై పడింది. దీంతో ఆన్లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆన్లైన్ ద్వారా వివిధ రకాల పనులు చేసుకోవాల్సిన ఆర్టీఏ వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మీ సేవ కేంద్రాల ద్వారా ఆర్టీఏ విభాగంలో 52రకాల సేవలు వాహనదారులు వినియోగించుకుంటున్నారు. ప్రతి స్లాట్ ఇక్కడి నుంచే బుక్ చేసుకోవాల్సి ఉండగా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో వాహనదారులకు వేరే మార్గం లేక ఇబ్బంది పడుతున్నారు. స్లాట్ల కేటాయింపు ఇలా.. ప్రతి జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి నాన్ ట్రాన్స్‌ఫోర్టు, ట్రాన్స్‌పోర్టు విభాగాలకు స్లాట్లు కేటాయిస్తారు. ఇందులో లెర్నింగ్ లెసైన్స్, లెసైన్సుకు సంబంధించిన లావాదేవీలు కొంత వరకు స్లాట్లు ఉన్నా మిగతా అన్ని రకాల లావాదేవీలకు స్లాట్లు లభించడం లేదు. లెసైన్స్‌కు సంబంధించిన 50వరకు స్లాట్లు ఉంటే మిగతా సామర్థ్య పరీక్షలకు, పర్మిట్లకు యాజమాన్య పేరు మార్పిడితో పాటు ఇతర అన్ని రకాల లావాదేవీలకు 50వరకు స్లాట్లు ఉన్నాయి. దీంతో రోజుల తరబడి నిరీక్షణ చేయాల్సి వస్తోంది. కేవలం ఆన్లైన్లో స్లాట్ల సంఖ్య పెంచితే సరిపోతుంది. మొదటి వారం వరకు అవకాశం ఉమ్మడి జిల్లాలో స్లాట్స్ బుక్ చేసుకున్న ప్రతి వాహనదారుడికి నవంబర్ మొదటి వారం వరకు అవకాశం కల్పించాం. ఈ సమయంలో ఎప్పుడు వచ్చిన వారి పని చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. కొత్త స్లాట్ బుక్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. - మమత ప్రసాద్, డీటీసీ శాఖలో మధ్యవర్తులకు చెక్ పెట్టడంతో పాటు ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించడానికి అధికారులు అన్ని రకాల లావాదేవీలను ఆన్లైన్ చేశారు. దీంతో రవాణా శాఖలో ఎటువంటి లావాదేవీలను జరపాలన్నా మొదట ఆన్లైన్లో వివరాలు సమర్పించిన అనంతరం ఒక తేదీని కేటాయిస్తారు. ఆ తేదీన సంబంధిత డీటీఓ కార్యాలయానికి వెళితే పని అయిపోతుంది. అయితే గతంలో దరఖాస్తు చేసుకుంటే రెండు మూడు రోజుల్లో తేదీని కేటాయించేవారు. ఇబ్బందులుండేవి కావు. ఇప్పు డు జిల్లాలో విజభనతో అన్ని రకాల లావాదేవీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి 20రోజుల తర్వాత స్లాట్ వస్తుంది. దీంతో లావాదేవీలు మధ్యలోనే ఆగిపోయేలా ఉన్నాయి. అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు లేకపోవడంతో వాహనదారులకు జరిమానాలు తప్పేలా లేవు. -
ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత అధికార పార్టీదే
సీఎల్పీ నేత జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: త్యాగా లు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజ ల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీదేనని సీఎల్పీ నేత కె. జానారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. రాష్ట్ర ప్రజల ఆందోళన, ఆకాంక్షలను గమనించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. చారిత్రాకమైన సోనియా నిర్ణయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని జానా పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాల్లో అవకాశాల పెంపు, సాగు నీరు, వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి మొదలైనవి సాధించడం ద్వారా సమతౌల్యతతో కూడిన రాష్ట్రాభివృద్ధి జరగాలని జానా ఆకాం క్షించారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన వారికి అభినందనలు తెలిపిన జానా... అమరవీరులకు శ్రద్ధాంజలి తెలిపారు. -
మెట్రో శ్రీధరన్ వెయిటింగ్
సాదాసీదాగా చిన్నకారులో వచ్చిన వైనం గెస్ట్‌హౌస్‌లో గది కోసం నిరీక్షణ విజయవాడ బ్యూరో : రాష్ట్రంలోని మెట్రో రైలు ప్రాజెక్టుల సలహాదారు, డీఎంఆర్సీ మాజీ ఎండీ శ్రీధరన్ బుధవారం సాయంత్రం స్టేట్ గెస్ట్ హౌస్‌లో గది కోసం నిరీక్షించాల్సివచ్చింది. బుధవారం రాత్రి 7.30 గంటలకు శ్రీధరన్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎస్.డి.శర్మ స్టేట్ గెస్ట్ హౌస్‌కు వచ్చారు. వారి కోసం ముందే రెండు వీఐపీ గదులు బుక్ చేశారు. అయితే వారు వచ్చే సమయానికి ఆ గదులకు తాళం వేసి ఉంది. గెస్ట్‌హౌస్ ఉద్యోగి ఒకరు తాళం వేసుకుని బయటకు వెళ్లినట్లు సమాధానం రావడంతో కొద్దిసేపు వారిద్దరూ ఆ గది బయటే నుంచున్నారు. ఈలోపు మరో ఉద్యోగి వచ్చి వేరే గదిలో కొంతసేపు వేచి ఉంటే బుక్ చేసిన వీఐపీ గదుల తాళాలు తెప్పిస్తానని చెప్పడంతో శ్రీధరన్ అందులో కొద్దిసేపు కూర్చున్నారు. ఈలోపు బుక్ చేసిన గదుల తాళాలు రావడంతో అందులోకి వెళ్లారు. రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సీఆర్డీఏ ఉన్నతాధికారులంతా సింగపూర్ పర్యటనలో ఉండడంతో మిగిలిన అధికారులు ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రొటోకాల్ బాధ్యతలు చూసే రెవెన్యూ అధికారులు కూడా ఆయన్ను పట్టించుకోలేదు. దీంతో ఇక్కడ డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న డీఎంఆర్సీ అధికారే హడావుడి పడాల్సివచ్చింది. మరోవైపు గెస్ట్హౌస్ట్కు కిందిస్థాయి అధికారులు ఇన్నోవా, ఇతర మోడల్ కార్లలో వస్తుంటే శ్రీధరన్, ఎస్.డి.శర్మ అద్దెకు తీసుకున్న ఇండికా విస్టా కారులో చాలా సాదాసీదాగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నేడు కారిడార్ల పరిశీలన బుధవారం రాత్రి డీపీఆర్ రూపకల్పన తీరును మ్యాప్‌ల ద్వారా సమీక్షించిన శ్రీధరన్ గురువారం ఉదయం ప్రతిపాదిత రెండు కారిడార్లను పరిశీలించనున్నారు. ఏలూరు, బందరు రోడ్డుల్లో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రదేశాలను చూడనున్నారు. మధ్యాహ్నం తిరిగి ఢిల్లీ వెళతారు. -
నిరీక్షణ
సర్వే కోసం ఎదురు చూస్తున్న జనం అనేక ప్రాంతాల్లో పూర్తి కాని వైనం త్వరలో తేదీ ప్రకటిస్తాం...ఇక ఫిర్యాదులు వద్దు స్పష్టం చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ సాక్షి,సిటీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే తంతు ముగిసింది. అయినా ఇంకా తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదని, తమ వివరాలు నమోదు చేసుకోలేదని అనేక ప్రాంతాలు.. బస్తీలు.. కాలనీల్లోని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీకి కాల్‌సెంటర్, ఎస్ఎం ఎస్, ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన వారందరి ఇళ్లకు సర్వే కోసం ఇంకా పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఫిర్యాదులు స్వీకరించేది లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలెవ్వరూ ఇక ఫిర్యాదులు చేయవద్దని.. మిగిలిన కుటుం బాల కోసం మరో రోజు సర్వే తేదీని ప్రకటించి, వారి వివరాలు నమోదు చేస్తామన్నారు. ప్రజలు జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగరాదని సూచించారు. 19నే ఫిర్యాదు చేసినప్పటికీ.. సర్వే పూర్తి కాని వారుంటే వివరాలు సేకరిస్తామన్నారు. అప్పటి నుంచి తాము ఎన్యూమరేటర్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నామని బస్తీలకు బస్తీలు.. కాలనీలకు కాలనీల ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. వీరిలో ఉప్పల్ సర్కిల్లోని సూర్యానగర్, రాజ్‌నగర్ కాలనీ, కావేరి నగర్, సెవెన్ హిల్స్ కాలనీ, చిలుకానగర్‌లోని ఆదర్శనగర్, స్వరూప్‌నగర్, భర త్‌నగర్, శాంతినగర్, రామంతాపూర్‌లోని గోఖలేనగర్, వెంకటరెడ్డినగర్, వివేక్‌నగర్, పాత రామంతాపూర్, శ్రీరామా కాలనీ, రాంరెడ్డినగర్, హబ్సిగూడలోని వీధి నంబర్-1, వీధి నంబర్-8లో గల గాంధీ గిరిజన బస్తీ, వసంత్ విహార్ కాలనీ, హరిజన బస్తీ, ఫిర్జాదిగూడ, మల్లికార్జున నగర్ తదితర ప్రాంతాల వారు ఉన్నారు. లాలాపేట వార్డు నెంబర్ 12లో సుమారు 30 కుటుంబాల వారు 17వ తేదీ నుంచి 19 అర్థరాత్రి వరకు ఎన్యూమరేటర్ల కోసం ఎదురు చూసినా రాలేదని తెలిపారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందన లేదని తార్నాక డివిజన్లోని కొన్ని ప్రాంతాల వారు వాపోయారు. జూబ్లీహిల్స్ డివిజన్లోని ఫిలింనగర్ మురికివాడల్లో ఉన్న చాలా బస్తీలకు ఎన్యూమరేటర్లు రాలేదని, అక్కడి 18 బస్తీల్లో ఇంకా వందలాది కుటుంబాలు సర్వే కోసం ఎదురు చూస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేదని వారు దుయ్యబడుతున్నారు. మల్కాజిగిరి సర్కిల్ లోని శ్రీసాయినగర్, కాకతీయనగర్, జేకేకాలనీ, జేజే నగర్, రేణుకా నగర్, ఓల్డ్ సఫిల్‌గూడ, వినాయకనగర్, వసంతపురి కాలనీ, మల్లికార్జుననగర్, హనుమాన్‌పేట్, దయానంద్‌నగర్, ఆనంద్‌బాగ్, ఓల్డ్ మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్ లోని జొన్నబండ, ఓల్డ్ అల్వాల్, మచ్చబొల్లారం, ఖానాజీగూడ, యాప్రాల్, ఎంప్లాయిస్ కాలనీ, కౌకూర్, భగత్‌సింగ్‌నగర్, భూపేస్నగర్, బాపూజీ నగర్ ప్రాంతాలలో అధిక శాతం కుటుంబాల పేర్లు నమోదు కాలేదు. దీంతో గత మూడు రోజులుగా వారు సర్వే అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు. కంప్యూటరీకరణకు పరుగులు సమగ్ర కుటుంబ సర్వేలో నమోదైన వారి డేటాబేస్ తయారీకి జీహెచ్ఎంసీ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వీలైనంత త్వరితంగా సర్వే వివరాలను డిజిటైజేషన్ చేయించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. అంతేకాదు.. శుక్రవారంతో టెండర్ ప్రీబిడ్ సమావేశం.. సాంకేతిక, ఆర్థిక టెండర్లను ఖరారు చేసి.. మర్నాటి నుంచే ఒప్పందం పూర్తి చేసి.. పనులు చేపట్టాలనే తలంపుతో ఉన్నారు. ఒక్కో జోన్‌కు ఏకంగా 200 కంప్యూటర్లు.. మూడు షిప్టులుగా రేయింబవళ్లు పని చేసేందుకు తగిన సిబ్బంది కలిగిన సంస్థలు టెండరులో పాల్గొనాల్సిందిగా ఆర్ఎఫ్పీ జారీ చేశారు. ఇలా ఐదు జోన్లకు మొత్తం వెయ్యి కంప్యూటర్లు .. మూడు వేల మంది ఆపరేటర్లు 24 గంటల పాటు పని చేయనున్నారు. ఈ స్పీడ్‌కు తగిన విధంగా టెండరును దక్కించుకోగల సంస్థలు నగరంలో ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టెండరు ప్రకటనకు.. ఖరారుకు మధ్య ఒక్కరోజు మాత్రమే గడువివ్వడం..అదీ చిన్నాచితకా ప్రాజెక్టు కాకపోవడంతో అధికారుల ఆలోచన ఏమేరకు సఫలీకృతం కానుందన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రీబిడ్ సమావేశంలో ఎలాంటి అభిప్రాయాలొస్తాయోననేది ఆసక్తికరంగా మారింది. అధికారుల దూకుడుకు తగ్గట్టుగా పని చేయగల సామర్ధ్యం ఉన్న సంస్థలున్నాయా.. లేవా? అన్నది నేడు తేలనుంది. కఠిన నిబంధనలు టెండరు నిబంధనలు సైతం కఠినంగా ఉన్నాయి. ఒప్పందం ముగియగానే ప్రాజెక్టు చేపట్టాలి. లేని పక్షంలో రోజుకు రూ. 20 వేల వంతున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. టెండరు దక్కించుకున్న సంస్థ పది రోజుల్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఇలాంటి నిబంధనల వల్ల ఎందరు ముందుకొస్తారనేదీ ఆసక్తికరంగా మారింది. -
బియాస్ నదిలో లభించిన శ్రీనిధి ఆచూకీ
కన్నీటి నిరీక్షణకు తెర - 42 రోజులుగా దు:ఖసాగరంలో తల్లిదండ్రులు - నేడు రేకుర్తికి మృతదేహం కరీంనగర్ రూరల్ : కన్నకూతురు మృతదేహాన్ని కడసారి చూడాలనే ఆ తల్లిదండ్రుల నిరీక్షణకు తెరపడింది. 42 రోజుల సుదీర్ఘ ఎదురు చూపుల అనంతరం ఆదివారం బియాస్ నదిలో కూతురు మృతదేహం లభించిందనే సమాచారంతో ఇన్నాళ్లూ దిగమింగిన దు:ఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కుటుంబమంతా కన్నీటి సంద్రమైంది. కన్నకూతురు మృతదేహం దు:ఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కుటుంబమంతా కన్నీటి సంద్రమైంది. కన్నకూతురు మృతదేహం రేకుర్తికి తీసుకరావడానికి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. గత నెల 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో వరద ఉధృతికి గల్లంతైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మొత్తం 24 మంది విద్యార్థులు నదిలో గల్లంతు కావడంతో శ్రీనిధి అచూకీ కోసం ఆమె తండ్రి రాజిరెడ్డి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాడు. కూతురు ఆచూకీ కోసం నది ఒడ్డున పదిరోజులపాటు పడిగాపులు కాశాడు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి కొద్ది రోజులపాటు అక్కడే ఉండి గా లింపును పర్యవేక్షించారు. మంచుకొండలు కరిగి నదిలో నీటి ఉధృతి ఎక్కువ కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చే పట్టగా గల్లంతైన 24 మంది విద్యార్థుల్లో 21 మృతదేహాలు లభించా యి. ఒక్కొక్క మృతదేహం బయటపడుతున్న కొద్దీ అది తమ కూతురుదేమోననే ఆతృతతో వెళ్లి చూడడం... ఆమెది కాదని తెలిసి నది ఒడ్డున విషాదవదనంతో ఎదురుచూపులు చూడడం రాజిరెడ్డికి నిత్యకృత్యమైంది. నదిలో నీటిప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలను నిలిపివేసినట్లు ప్రకటి ంచింది. గల్లంతైన విద్యార్థుల పేరిట డెత్ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఒకవేళ మృతదేహాలు లభిస్తే హైదరాబాద్‌కు పంపిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కూతురు ఆచూకీపై రాజిరెడ్డి ఆశ లు వదులుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరినీ అక్కడి నుంచి తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజిరెడ్డి గత నెల 20న స్వగ్రామం రేకుర్తికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి శ్రీనిధి జ్ఞాపకాలతో ఆమె మృతదేహం ఆచూకీ కోసం రాజిరెడ్డి కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం బియాస్‌నదిలో చేపట్టిన గాలింపు చర్యల్లో లభించిన రెండు మృతదేహాల్లో ఒకటి శ్రీనిధిగా గుర్తించినట్లు అధికారులు ప్రకటించడంతో తల్లిదండ్రులు రాజిరెడ్డి, అనంతలక్ష్మి, అక్క తేజతోపాటు బంధువుల్లో దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికింది. శ్రీనిధి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని సోమవారం హిమాచల్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించడానికి అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారు. కూతురు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి రాజిరెడ్డి సమీప బంధువులతో కలిసి సోమవారం వేకువజామున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మృతదేహం రేకుర్తికి వచ్చే అవకాశముంది. -
అనాథల ఆకాంక్షలు నెరవేరుస్తాం
- నెటైడ్ టెక్నాలజీస్ ఇండియా సీఎస్ఆర్ కౌన్సిల్ హెడ్ పలాష్‌రాయ్ చౌదరి మణికొండ: అనాథ పిల్లల ప్రగతికి, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషిచేస్తామని యునెటైడ్ టెక్నాలజీ ఇండియా సీఎస్ఆర్ కౌన్సిల్ హెడ్ పలాష్‌రాయ్ చౌదరి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 9 కేంద్రాలలో 800 మంది అనాథ విద్యార్థుల బాగోగులు చూస్తున్న ఎస్ఓఎస్ స్వచ్ఛంద సంస్థతో యునెటైడ్ టెక్నాలజీస్ సంస్థ బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఇక మీదట విద్యార్థులకు అవసమయ్యే విద్య, వారి నిర్వహణ, పుస్తకాలు, బట్టలు తదితర వస్తువులన్నీ తామే అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం రాజేంద్రనగర్ మండల పరిధిలోని వట్టినాగులపల్లి శివారులోని ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్‌లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన చౌదరి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, జీవకళను పెంపొందించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే అనాథ పిల్లలకు చేయూత అందించి భావి భారతపౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎస్‌ఓఎస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఎస్ఓఎస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ జిన్సీ మాట్లాడుతూ తమ సంస్థలోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు, యూటీసీ ముందుకు రావటం అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పెయిం టింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఇందులో యూటీసీ ఉద్యోగులతో పాటు ఎస్ఓఎస్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.