పిల్లలే ఫ్యూచర్‌ | Today is Satyarthi's birthday | Sakshi
Sakshi News home page

పిల్లలే ఫ్యూచర్‌

Published Wed, Jan 10 2018 11:42 PM | Last Updated on Wed, Jan 10 2018 11:42 PM

Today is Satyarthi's birthday - Sakshi

ఇవాళ సత్యార్థి బర్త్‌డే. బాలల ఆకాంక్షలకు స్వేచ్ఛనివ్వడమే ఆయనకు మనం పంపే బర్త్‌డే గ్రీటింగ్‌! 

మనిషి పరుగులు ఎవరి కోసం? సంపాదన కోసం. సంపాదన ఎవరి కోసం? పిల్లల కోసం. లోకం.. పిల్లల చుట్టూ తిరుగుతోంది. పిల్లలే లోకంగా అవిశ్రాంతంగా శ్రమిస్తోంది. సూక్ష్మంగా చూస్తే సైన్స్‌అండ్‌ టెక్నాలజీ, సోషియాలజీ, పాలనా నిర్ణయాలు.. అన్నీ.. పిల్లల కోసమే. పిల్లలే ప్రపంచ భవిష్యత్తు కాబట్టి. అయితే.. పిల్లల చుట్టూ పరిభ్రమిస్తున్న మనిషి గానీ, పాలనా యంత్రాంగాలు కానీ పిల్ల రక్షణను, సంరక్షణకు అవసరమైన శ్రద్ధను చూపడం లేదు. సమాలోచనలు చేయడం లేదు. పిల్లల కోసం చేసిన చట్టాలు సక్రమంగా అమలవుతున్నదీ లేనిదీ చూడడం లేదు! 
బాలల హక్కుల కార్యకర్త కైలాష్‌ సత్యార్థి.. ట్రెయినీ కలెక్టర్‌లతో ముచ్చటించేందుకు ప్రత్యేక ఆహ్వానంపై మంగళవారం హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఇదే విషయమై ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. బాలల కోసం కలెక్టర్లుగా వాళ్లేం చేయవలసిందీ చెప్పారు. సత్యార్థి నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కూడా. స్కూల్‌కు వెళ్లడం కోసం ఉగ్రవాదుల ఆక్షలను సైతం ఉల్లంఘించిన మలాలాకు, సత్యార్థికి కలిపి 2014లో ఆ అవార్డు వచ్చింది. 

ప్రపంచ జనాభాలో ఆరు కోట్ల మంది బాలలకు చదువుకునే భాగ్యం లేదు. నాలుగు కోట్ల మంది బాలకార్మికులుగా నలిగిపోతున్నారు. నిమిషానికి ఒక చిన్నారి చొప్పున కనిపించకుండా పోతున్నారు! ఆ తర్వాత అక్రమ రవాణా అవుతున్నారు. ఇవన్నీ చెబుతూ, ‘కలెక్టర్లు దృష్టి పెడితే ఈ పరిస్థితి మారుతుందని సత్యార్థి అన్నారు.బాలల కోసం సత్యార్థి.. డ్రీమ్, డిస్కవరీ, డు.. అనే త్రీడీ ఫార్ములా ప్లాన్‌ చేశారు. భవిష్యత్తు గురించి కలలు కనడం, భవిష్యత్తు అవకాశాలను కనుగొనడం, అందుకు అనుగుణంగా ముందుకు సాగడం.. అనే ఈ తీడ్రీ ఫార్ములాతో పిల్లలు స్వేచ్ఛగా ఎదిగేలా చూడడం, వారికి చట్టపరంగా జరగవలసిన న్యాయాన్ని అందించడం కలెక్టర్ల ప్రధాన కర్తవ్యం కావాలని సత్యార్థి కోరారు. సత్యార్థి కూడా ఒక కల కంటున్నారు. పిల్లలంతా సంతోషంగా కళకళలాడుతూ ఉండే ప్రపంచాన్ని ఆయన ఆకాంక్షిస్తున్నారు. పిల్లలే పెద్దల ప్రపంచం కావడం ఒక్కటే కాదు, ఈ ప్రపంచం పిల్లలది అయ్యేలా చూడ్డం ప్రతి తల్లీ తండ్రీ బాధ్యత. అలాగే ప్రభుత్వాలదీ.

గ్లోబల్‌ రిపోర్ట్‌
►6 కోట్లు... బడి భాగ్యం లేని పిల్లల సంఖ్య
►4 కోట్లు... బాల కార్మికుల సంఖ్య
►నిమిషానికొకరు అదృశ్యం
►80 శాతం చిన్నారులపై పరిచయస్తుల లైంగిక అఘాయిత్యాలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement