
'ఊహాలోకంలో విహరించినట్టు ఉంది'
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ చదువుతుంటే ఊహాలోకంలో విహరించినట్టు ఉందని ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. 2015-16 సంవత్సరానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ఆచరణాత్మకంగా లేదన్నారు. ఈ బడ్జెట్ కు విశ్వసనీయత లేదన్నారు. శుక్రవారం శాసనసభలో బడ్జెట్ పై చర్చలో ఆయన పాల్గొన్నారు.
బడ్జెట్ ను పూర్తిగా అధ్యయనం చేసి ముందుకు సాగాల్సివుంటుందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్ ఉండాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆర్థి బడ్జెట్ ను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఈనెల 11న ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.