‘‘టీఆర్‌ఎస్ వైఫల్యాలపై, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడదామంటే మాకు మైకు ఇవ్వరు. మీకు మైకు ఇచ్చినా టీఆర్‌ఎస్‌పై మీరు గట్టిగా మాట్లాడరు. టీఆర్‌ఎస్ అప్రజాస్వామిక చర్యలను, వైఫ ల్యాల గురించి మాట్లాడకుంటే ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి ఏ సంకేతాలు వెళ్తాయి?’’ అంటూ కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానా రెడ్డిని పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు నిలదీసినట్టు తెలిసింది. సీఎల్పీ నేతే మెతక వైఖరితో ఉంటే పార్టీకి నష్టమని వారు అభిప్రాయపడ్డారు. ‘‘శాసనసభాపక్ష నేతగా మీరు గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడూ మెతకగా మాట్లాడితే ప్రయోజనం లేదు.