
'2 నెలల్లో 80మందికి పైగా ఆత్మహత్య'
హైదరాబాద్: రుణమాఫీపై రైతులు ఆందోళనలో ఉన్నారని తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. 2 నెలల్లో 80మందికి పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశంలో విద్యార్ధుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
ఓయూ విద్యార్ధులపై లాఠీచార్జ్ చేయడం బాధాకరమన్నారు. ఓయూ విద్యార్ధులపై కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిరంతర విద్యుత్ ఇస్తామన్న తెలంగాణ సర్కారు రోజుకు మూడు గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేకపోతుందని విమర్శించారు. ఉద్యోగుల ఖాళీలను శాఖల వారీగా భర్తీ చేయాలని జానారెడ్డి సూచించారు.