సాక్షి, హైదరాబాద్: రైతుల నోటికాడ బుక్క కాంగ్రెస్‌పార్టీ ఎత్తగొట్టిందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిని అడ్డుపెట్టి రైతుబంధు పంపిణీ ఆపలేదని అన్నారు. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఎన్నికలు ముగిసిన వెంటనే డిసెంబర్ 6న రైతులకు రైతుబంధు సాయం పంపిణీ చేస్తామని చెప్పారు. సోమవారం రాత్రి తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌పార్లమెంటరీ పక్షనేత కె.కేశవరావుతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రైతుబంధు ఆపాలని అక్టోబర్23న కాంగ్రెస్ నేత మాణిక్‌రావు ఠాక్రే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, ఆరోజే ఢిల్లీలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్‌పెట్టి ఈ విషయం చెప్పారని వెల్లడించారు. రైతుబంధు ఐదున్నర ఏళ్లుగా కొనసాగుతున్న పథకమని.. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరితే పంపిణీకి అనుమతిఇచ్చిందని, దానిని తాను స్వాగతించాను తప్ప ఎన్నికల సంఘంపెట్టిన ఆంక్షలను ఎక్కడా అతిక్రమించలేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
దీనిపై పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ఎన్నికల సంఘానికిమళ్లీ ఫిర్యాదు చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. రైతుబంధుకు ఎన్నికల సంఘంఅనుమతి ఇచ్చినప్పుడు పీసీసీ చీఫ్‌రేవంత్‌రెడ్డి.. ఎలక్షన్‌కమిషన్, బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని ఆరోపించారే కానీ స్వాగతించలేదని అన్నారు. రైతులంటే రేవంత్‌కు ప్రేమ ఉంటే రైతుబంధు సాయం పంపిణీని స్వాగతించే వారు పేర్కొన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా కాంగ్రెస్‌పరిస్థితి ఉందన్నారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈనెల 30న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని హరీశ్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌కు రైతులంటే గిట్టదు..
కాంగ్రెస్‌పార్టీకి రైతులంటేనే గిట్టదని, అది ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టీయేనని హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీ ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్‌చేసిందని, కాంగ్రెస్‌అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీది రైతు వ్యతిరేక వైఖరేనని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రూ.4 వేల చొప్పున ఇచ్చేవారని, కానీ కాంగ్రెస్‌గెలిచిన వెంటనే ఆ పథకాన్ని రద్దు చేశారని చెప్పారు.
తెలంగాణలో గెలిచి రైతుబంధును రద్దు చేయాలని కాంగ్రెస్‌కుట్ర చేస్తోందన్నారు. ఉత్తమ్‌రైతుబంధును దుబారా అంటున్నారని, రేవంత్‌రైతులను బిచ్చగాళ్లు అంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌అధికారంలో ఉన్నప్పుడు అర్ధరాత్రి కరెంట్‌ఇచ్చి రైతులను అరిగోస పెట్టిందని, ఎరువులు, విత్తనాలను పోలీస్‌స్టేషన్‌ల ముందు లైన్‌లో నిలబెట్టి పంపిణీ చేస్తూ బాధ పెట్టిందని అన్నారు. వ్యవసాయం దండగ అన్న నాయకుడి వారసుడు రేవంత్‌అని మండిపడ్డారు. అందుకే ఆయన సాగుకు మూడు గంటల కరెంట్‌చాలు అన్నారని, కర్ణాటక డిప్యూటీ సీఎం ఐదు గంటల కరెంట్‌చాలు అంటున్నారని హరీశ్ మండిపడ్డారు.
అవి చిత్తు కాగితాలు..
కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను అమలు చేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు బాండ్‌పేపర్లు రాసి ఇస్తున్నారని.. అయితే అవి చిత్తు కాగితాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌కొడతారని, 80 సీట్లలో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment