ఫుల్‌ జోరులో కాంగ్రెస్‌.. సీఎం అభ్యర్థుల లీడింగ్‌ ఎలా ఉందంటే.. | Congress CM Candidates Lead In Telangana Assembly Elections Results 2023, Check Majority Details Inside - Sakshi
Sakshi News home page

Telangana Election Results 2023: ఫుల్‌ జోరులో కాంగ్రెస్‌.. సీఎం అభ్యర్థుల లీడింగ్‌ ఎలా ఉందంటే..

Published Sun, Dec 3 2023 11:37 AM | Last Updated on Sun, Dec 3 2023 12:39 PM

Congress CM Candidates Lead In Telangana Assembly Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ దూసుకుపోతోంది. ఇక, కాంగ్రెస్‌ నుంచి సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న నేతలు భారీ మెజార్టీ సంపాదించారు. మరోవైపు, అశ్వరావుపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీలో గెలుపొందారు. 

మెజార్టీ ఇలా..
రేవంత్‌రెడ్డి.. 12వేల మెజార్టీ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. 25వేల మెజార్టీ
ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. 20వేల మెజార్టీ
భట్టి విక్రమార్క.. 8వేల మెజార్టీ
సీతక్క.. మూడు వేల మెజార్టీ

ఇక, కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన తర్వాత ఎవరు సీఎం అవుతారనే కీలక చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌ శ్రేణులు మాత్రం మా నేత సీఎం అంటే మా నాయకుడు ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు.. కాంగ్రెస్‌ నేతలు మాత్రం అధిష్టానమే సీఎం అభ్య‍ర్థిని ఖరారు చేస్తుందని చెబుతున్నారు. 

కాగా, కాంగ్రెస్‌ గెలుపు నేపథ్యంలో హస్తం శ్రేణులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. పలుచోట్ల కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి పాలాభిషేకం చేస్తున్నారు. బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్‌ అభ్యర్థులను కర్ణాటకకు తరలించే ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే తాజ్‌కృష్ణలో డీకే శివకుమార్‌ సహా కర్ణాటక నేతలు బస చేశారు. లగ్జరీ బస్సులను కూడా తరలింపునకు రెడీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement