Raitubandhu
-
అవి ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలు
సాక్షి, హైదరాబాద్: ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలుగా మారిన కాంగ్రెస్, బీఆర్ఎస్లపై పోరాడేది తామేనని, తెలంగాణ ప్రజలు, భావి తరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తమ పార్టీని గెలిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వేలాది కోట్లు ఖర్చు చేస్తూ ఎంఐఎం మధ్యవర్తిత్వంతో బీజేపీ గెలవకుండా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. సోమవారం పార్టీ నాయకులు డా.ఎస్.ప్రకాశ్‌రెడ్డి, సోలంకి శ్రీనివాస్, సునీతారెడ్డి, అమర్నాథ్, జి, వెంకటరెడ్డి, మౌనికతో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు ఎలా అనేది కోటి డాలర్ల ప్రశ్న అని వ్యాఖ్యానించారు. ఈ గ్యారంటీల అమలుకు తెలంగాణకు ఇప్పుడొస్తున్న రెవెన్యూకు మూడింతలు డబ్బు అవసరమని లెక్క వేశారు. ఇక్కడ ఎన్నికలకు కర్ణాటక ప్రభుత్వ యాడ్స్ ఎలా ఇస్తారు ? తెలంగాణలో ఏ ప్రాతిపదికన కర్ణాటక ప్రభుత్వ డబ్బుతో కాంగ్రెస్ ప్రకటనలు ఇస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ ఎన్నికల కోసం కర్ణాటకలోని కాంట్రాక్టర్లు, ఐటీసంస్థలు, వ్యాపారులను బెదిరించి వేల కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో 50 శాతం మందికి కేసీఆర్, మరో 50 శాతం మందికి కర్ణాటక సర్కార్ ఖర్చు చేస్తోందని నిందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల దోస్తీ, కాంగ్రెస్ కేంద్ర కేబినెట్లో కేసీఆర్ మంత్రిగా పనిచేయడం, కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు వంటి అంశాలపై రాహుల్‌గాంధీ చర్చకు రావాలని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లది డూప్ ఫైట్... ‘ఎన్నికల నేపథ్యంలో...కాంగ్రెస్, బీఆర్ఎస్లది డూప్ ఫైట్...రాహుల్‌గాంధీ అంత చేతగాని రాజకీయనాయకుడు మరొకరు లేడు’అని కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నిర్వహణ చేతకాదంటూ వదులుకున్న వ్యక్తి రాహుల్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైద్యకళాశాలల ఏర్పాటు కోసం కేసీఆర్ రాసినట్టు చెబుతున్న 50 లేఖలు చూపిస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని సవాల్ విసిరారు. రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు.. ‘రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయి బీఆర్ఎస్ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్‌కు ఒక రోజు ముందుగానే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో ఫిర్యాదు చేయించడం ద్వారా బీఆర్ఎస్కు ఇది ఇవ్వడం ఇష్టం లేదని తేలిందన్నారు. హైదరాబాద్ పేరు మారుస్తాం... బీజేపీ అధికారానికి వస్తే హైదరాబాద్ పేరును కచ్చితంగా భాగ్యనగర్‌గా మార్చేస్తామని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ‘ఎవరైనా బీజే పీ, బీఆర్ఎస్ ఒక్కటంటే.. లాగి చెప్పుదెబ్బ కొట్టండి...ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితో కలిసే ప్రసక్తే లేదు’అని తీవ్రంగా స్పందించారు. -
రైతుబంధు ఆపింది కాంగ్రెస్ పార్టీయే
సాక్షి, హైదరాబాద్: రైతుల నోటికాడ బుక్క కాంగ్రెస్‌పార్టీ ఎత్తగొట్టిందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిని అడ్డుపెట్టి రైతుబంధు పంపిణీ ఆపలేదని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎన్నికలు ముగిసిన వెంటనే డిసెంబర్ 6న రైతులకు రైతుబంధు సాయం పంపిణీ చేస్తామని చెప్పారు. సోమవారం రాత్రి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్పార్లమెంటరీ పక్షనేత కె.కేశవరావుతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ఆపాలని అక్టోబర్23న కాంగ్రెస్ నేత మాణిక్‌రావు ఠాక్రే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, ఆరోజే ఢిల్లీలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్‌పెట్టి ఈ విషయం చెప్పారని వెల్లడించారు. రైతుబంధు ఐదున్నర ఏళ్లుగా కొనసాగుతున్న పథకమని.. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరితే పంపిణీకి అనుమతిఇచ్చిందని, దానిని తాను స్వాగతించాను తప్ప ఎన్నికల సంఘంపెట్టిన ఆంక్షలను ఎక్కడా అతిక్రమించలేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. దీనిపై పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ఎన్నికల సంఘానికిమళ్లీ ఫిర్యాదు చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. రైతుబంధుకు ఎన్నికల సంఘంఅనుమతి ఇచ్చినప్పుడు పీసీసీ చీఫ్రేవంత్రెడ్డి.. ఎలక్షన్‌కమిషన్, బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని ఆరోపించారే కానీ స్వాగతించలేదని అన్నారు. రైతులంటే రేవంత్‌కు ప్రేమ ఉంటే రైతుబంధు సాయం పంపిణీని స్వాగతించే వారు పేర్కొన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా కాంగ్రెస్‌పరిస్థితి ఉందన్నారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈనెల 30న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని హరీశ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు రైతులంటే గిట్టదు.. కాంగ్రెస్‌పార్టీకి రైతులంటేనే గిట్టదని, అది ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టీయేనని హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీ ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్చేసిందని, కాంగ్రెస్అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీది రైతు వ్యతిరేక వైఖరేనని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రూ.4 వేల చొప్పున ఇచ్చేవారని, కానీ కాంగ్రెస్గెలిచిన వెంటనే ఆ పథకాన్ని రద్దు చేశారని చెప్పారు. తెలంగాణలో గెలిచి రైతుబంధును రద్దు చేయాలని కాంగ్రెస్కుట్ర చేస్తోందన్నారు. ఉత్తమ్రైతుబంధును దుబారా అంటున్నారని, రేవంత్రైతులను బిచ్చగాళ్లు అంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్అధికారంలో ఉన్నప్పుడు అర్ధరాత్రి కరెంట్ఇచ్చి రైతులను అరిగోస పెట్టిందని, ఎరువులు, విత్తనాలను పోలీస్స్టేషన్ల ముందు లైన్లో నిలబెట్టి పంపిణీ చేస్తూ బాధ పెట్టిందని అన్నారు. వ్యవసాయం దండగ అన్న నాయకుడి వారసుడు రేవంత్అని మండిపడ్డారు. అందుకే ఆయన సాగుకు మూడు గంటల కరెంట్‌చాలు అన్నారని, కర్ణాటక డిప్యూటీ సీఎం ఐదు గంటల కరెంట్‌చాలు అంటున్నారని హరీశ్ మండిపడ్డారు. అవి చిత్తు కాగితాలు.. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను అమలు చేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు బాండ్‌పేపర్లు రాసి ఇస్తున్నారని.. అయితే అవి చిత్తు కాగితాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్మూడోసారి గెలిచి హ్యాట్రిక్కొడతారని, 80 సీట్లలో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
రైతుబంధుకు బ్రేక్ వెనక కాంగ్రెస్, బీజేపీ కుట్ర
సాక్షి, పెద్దపల్లి/హుజూరాబాద్/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ఏటూరునాగారం/వెల్గటూర్ (ధర్మపురి)/అంబర్‌పేట/ముషిరాబాద్: కాంగ్రెస్, బీజేపీ కలసి కొత్త కుట్రకు తెరలెపి రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లో పడకుండా ఆపాయని మంత్రి కె. తారక రామారావు ఆరోపించారు. రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే బీజేపీ నేతలు ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి నిలిపివేయించారని దుయ్యబట్టారు. అధికారంలోకి రాకముందే ఆ పార్టీలు రైతుబంధును కాటగలిపి రైతుల నోట్లో మట్టిగొట్టాయని... పొరపాటున ఆ పార్టీలు అధికారంలోకి వస్తే రైతుబంధును మొత్తానికే ఎత్తగొడ్తాయని హెచ్చరించారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటుతో బుద్ధిచెప్పాలని కోరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్, జగిత్యాల జిల్లా వెల్గటూర్, మంచిర్యాల జిల్లా చెన్నూరు, ములుగు జిల్లా ఏటూరునాగారంతోపాటు హైదరాబాద్‌లోని అంబర్‌పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున నిర్వహించిన రోడ్ షోలలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా.. కరెంట్ కావాలో లేక కాంగ్రెస్ కావాలోప్రజలే నిర్ణయించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. 2014కు ముందు తెలంగాణలో కరెంటు కష్టాలు ఎలా ఉండేవో ఒక్కసారి గుర్తుచేసుకోవాలన్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల కరెంటు ఇస్తున్న విషయాన్ని గమనించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ కరెంటు ఉండదని, కర్ణాటకలో గెలిపించినందుకు ప్రజలు చెంపలు వేసుకుంటున్నారని తెలిపారు. పిరమైన ప్రధాని.. బీజేపీకి ఓటు వేస్తే మోటార్ల కాడ మీటర్లు బిగిస్తామని బాహాటంగానే చెబుతున్న విషయాన్ని రైతులు గమనించాలని కేటీఆర్ కోరారు. ప్రధాని మోదీ జన్‌ధన్ ఖాతాలు తీయమని చెప్పి రూ.15 లక్షలు వేస్తామని హామీ ఇచ్చి కనీసం రూ. 15 కూడా వేయలేదని విమర్శించారు. దేశంలో నిత్యావసర సరుకులను పిరం చేసి ప్రియమైన ప్రధాని కాకుండా పిరమైన ప్రధానిగా మోదీ మారిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మిత్తితో సహా రైతు రుణమాఫీ.. ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీని మిత్తితో సహా చెల్లిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లే అవుతోందని.. కొన్నింట్లో చిన్నచిన్న పొరపాట్లు ఉండవచ్చని.. వాటన్నింటినీ సరిచేసుకుందామన్నారు. కాంగ్రోసోళ్లు ఓటుకు రూ. 10 వేలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసిందని... ఆ డబ్బును అందరూ తీసుకొని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని కేటీఆర్ కోరారు. అంబర్‌పేటలో బీఆర్ఎస్ను గెలిపిస్తే మెట్రో రైలు విస్తరిస్తామని, మూసీ సుందరీకరణ చేపట్టి దానిపై కొత్త బ్రిడ్జీలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంక్షేమ బోర్డు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ సాక్షి, హైదరాబాద్: స్విగ్గి, జొమాటో, ఓలా, ఉబర్ ఇతర పార్ట్‌టైం ఉద్యోగాలు చేసే యువకుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి ఉద్యోగులకు ఆరోగ్య బీమా, పీఎఫ్, ఈఎస్ఐ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమవారం తనను కలిసిన వివిధ ఫుడ్ డెలివరీ ఉద్యోగులతో కేటీఆర్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే అధికారులు, కంపెనీల ప్రతినిధులు, గిగ్ వర్కర్ల ప్రతినిధులతో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. గిగ్ వర్కర్లకు కనీస జీతాలను చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వమే ఫుడ్ డెలివరీ, క్యాబ్ బుకింగ్, ఇతర ఆన్లైన్ సేవలకు ప్రత్యేక యాప్‌ని ఏర్పాటు చేస్తే తమకు ఉపయుక్తంగా ఉంటుందని పలువురు ఉద్యోగులు చేసిన సూచనపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. దీనిపై అధ్యయనం చేస్తామన్నారు. -
కోహ్లీలా కేసీఆర్ సెంచరీ!
సిరిసిల్ల: క్రికెట్లో విరాట్ కోహ్లీ లాగా రాష్ట్రంలో కేసీఆర్ సెంచరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఊరుకోడు.. మహారాష్ట్రలో అడుగు పెడతాడు, కర్ణాటకలో అడుగు పెడతాడు.. తర్వాత ఢిల్లీలో గులాబీ జెండా పాతాలని చూస్తాడని రాహుల్‌గాందీ, నరేంద్రమోదీ భయపడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ వాళ్లిద్దరికీ కొరకరాని కొయ్యలా అయ్యాడని అన్నారు. కేసీఆర్ ఢిల్లీకొస్తే తమ కొంప మునుగుతుందని ఇక్కడే ఖతం చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో ఇస్తున్నట్లుగా 24 గంటల కరెంట్ దేశమంతా ఇవ్వాలని, దేశమంతా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి అమలు చేయాలని, జిల్లాకో మెడికల్ కాలేజీ, నాణ్యమైన విద్యనందించే గురుకులాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని వివరించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, ఎల్లారెడ్డిపేటల్లో జరిగిన యువ సమ్మేళనం సభల్లో మంత్రి మాట్లాడారు. తెలంగాణ సినిమాకు అన్నీ కేసీఆరే తెలంగాణలో కాంగ్రెస్‌కు, బీజేపీలకు లోకల్ లీడర్లు లేక.. కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కానీ తెలంగాణ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్.. అన్నీ కేసీఆరేనని, మన సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ‘అదే ప్రతిపక్షాలకు కన్నడ ప్రొడ్యూసర్, ఢిల్లీ డైరెక్టర్, యాక్టర్ పక్కోడు.. వాళ్లది డిజాస్టర్’అని అన్నారు. ఆ రెండు పారీ్టలు ఢిల్లీలో ఉస్కో అంటే.. ఇక్కడ డిస్కో అంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఎవరూ ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. 11సార్లు చాన్సిస్తే ఏం చేశారు? ఢిల్లీ నాయకులు తెలంగాణ విషయంలో ఏనాడూ మర్యాదగా ప్రవర్తించలేదని మంత్రి అన్నారు. పోరాటాలు, త్యాగాలు, కేసీఆర్ ఉద్యమాలతోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. ఒక్క చాన్స్ అంటున్న కాంగ్రెస్ పారీ్టకి 11 సార్లు అవకాశం ఇస్తే.. ఏం చేసిందని ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ఎందుకు ఇయ్యలేదని నిలదీశారు. ఆ పుర్రెలేని రాహుల్‌గాం«దీకి మేడిగడ్డ ప్రాజెక్టుపై వచ్చిన పర్రె (పగులు) కూడా తెలియదని విమర్శించారు. తాము రాజకీయ హిందువులం కాదని, నిజమైన హిందువులమని స్పష్టం చేశారు. స్టెప్పులేసి జోష్ పెంచిన కేటీఆర్ ఎల్లారెడ్డిపేట యువ సమ్మేళనం వేదికపై కేటీఆర్ స్టెప్పులేశారు. ఎన్నికల పాట ‘దేఖ్లేంగే..’కు యువ నాయకులతో కలిసి నృత్యం చేసి వారిలో ఉత్సాహం నింపారు. సభికులు కేరింతలు కొడుతూ వారు కూడా స్టెప్పులేయడంతో ఆ ప్రాంతం మార్మోగింది. స్థానిక నాయకులను పేరుపేరునా పిలిచిన మంత్రి వారిలో జోష్ నింపారు. వేములవాడ సభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. జాబ్ కేలండర్ ప్రకటించే బాధ్యత నాది రాబోయే రోజుల్లో యువతతో మమేకమవుతామని, జాబ్ కేలండర్‌ను ప్రకటించే బాధ్యతను తాను తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. జి ల్లాకో నైపుణ్య శిక్షణ కేంద్రం, నియోజకవర్గానికో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి పరిశ్రమలను ప్రోత్సహిస్తానని, స్వయం ఉపాధిని పెంచుతానని అన్నారు. తెలంగాణను దాచి దాచి దయ్యాల పాలు చేయొద్దని, ఎవరి చేతిలో ఉంటే తెలంగాణ పచ్చగా ఉంటుందో ఆలోచించాలని కోరారు. -
కేసీఆర్ మాటలన్నీ అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల పేరిట సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. పథకాల విషయంలో కేసీఆర్ చెప్తున్నవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. ‘‘రైతుబంధు అందరికీ ఇవ్వలేదు.. 24 గంటల కరెంటు అంతా ఉత్తిమాటే.. అందరికీ ఇళ్లు కూడా వట్టిమాటలే.. దళితులకు మూడెకరాల భూమి అని మోసం చేశారు. ఇక ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావ్ కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినప్పుడే కేసీఆర్ దుకాణం బంద్ అయింది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు సరిగా నిర్వహించలేని ప్రభుత్వం, ఉద్యోగ అర్హత పరీక్షల పేపర్లు లీక్ చేసే ప్రభుత్వం ఉంది. ఈ కుంభకోణాల ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది..’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు కావస్తోందని గుర్తు చేశారు. 2014లో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి స్వాతంత్య్రం ఇస్తే.. ఇప్పుడు కేసీఆర్ అవినీతి పాలననుంచి విముక్తి కల్పించేందుకు మరోసారి తెలంగాణ గడ్డకు వచ్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని.. అందుకోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ఆమెకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో వంద సీట్లలో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. -
దొంగలకు ఆశ్రయం కల్పిస్తున్న బీజేపీ
మునుగోడు: దేశంలోని పేద ప్రజలపై మోయలేని పన్నుల భారం మోపుతూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశంలోని దొంగల్ని, అక్రమ సంపాదనాపరుల్ని కాపాడేందుకు పార్టీలో ఆశ్రయం కల్పిస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలసి ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పంటల సాగుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంటే దానిని అడ్డుకునే కుట్రలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేయలేదని, కేవలం ఆయన ఆస్తులు పెంచుకునేందుకే రూ. 21వేల కోట్ల విలువైన కాంట్రాక్టు పనుల్ని తెచ్చుకుని అమ్ముడుపో యారని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి కొన్ని వందలసార్లు సీఎం కేసీఆర్ చుట్టూ తిరిగి టీఆర్ఎస్లో చేరతానని బతిమిలాడినా చేర్చుకోలేదన్నారు. 20న మునుగోడులో సభ: ఈ నెల 20న మునుగోడులో మండల కేంద్రంలో ప్రజా తీర్పు సభ నిర్వహించనున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారని చెప్పారు. చదవండి: బీజేపీ, కాంగ్రెస్ దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలి? -
‘రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు’
చింతలపాలెం (హుజూర్నగర్): సీఎం కేసీఆర్ రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చా రని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరస న తెలుపుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సూర్యా పేట జిల్లా హుజూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రైతుబంధు కింద ఖరీఫ్‌కు రూ.5 వేలు, రబీకి రూ.5 వేలు ఇస్తామని, ఆ తర్వాత మరిచి పోయారని విమర్శించారు. -
రైతుబంధుకు నిధుల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్‌లో రైతుబంధు సొమ్ము కోసం సర్కారు నిధులు కేటాయించింది. ఈ మేరకు ఆర్థికశాఖను ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. రైతు వివరాలు, బ్యాంకు ఖాతాలు, కొత్తవారి నమోదు వివరాలను చేర్చే విషయంలోనూ వ్యవసాయశాఖకు దిశానిర్దేశం చేసినట్లు ఆశాఖ వర్గాలు తెలిపాయి. ఖరీఫ్, రబీల కోసం గత బడ్జెట్లో 2019–20 ఆర్థిక ఏడాదికి రూ.12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఖరీఫ్‌లో రూ.6 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు నుంచి అంటే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రైతుబంధు నిధులు రైతుల బ్యాంకు ఖాతాలో వేయనున్నారు. జూన్ మొదటి వారంలోగా రైతులందరి ఖాతాలోనూ వేస్తారు. తొలకరి వర్షాలు కురిసే నాటికి, సాగు మొదలుకు ముందు రైతులందరికీ అందజేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. గతేడాది ప్రభు త్వం ఒక్కో సీజన్‌కు ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున ఇచ్చింది. ఈసారి దాన్ని రూ.5 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. అంటే ఏడాదికి ఎకరానికి ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 10 వేలు ఇస్తారు. దీంతో రైతులకు మరింత వెసులుబాటు ఉంటుంది. రబీలో రాని వారికీ అందించే యోచన... 2018–19 ఆర్థిక సంవత్సరంలో రైతుబంధు పథకం ప్రారంభమైంది. ఖరీఫ్, రబీలకు ఇప్పటివరకు రైతులకు సాయం అందజేశారు. ఖరీఫ్‌లో 51.50 లక్షల మంది రైతులకు రూ. 5,260.94 కోట్లు ఇచ్చారు. అలాగే రబీలో 49.03 లక్షల మంది రైతులకు రూ. 5,244.26 కోట్లు అందజేశారు. మొత్తంగా రూ. 10,505.20 కోట్లు ఇచ్చినట్లయింది. అయితే రబీలో కొందరు రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో సొమ్ము అందలేదు. ఆర్థిక, ట్రెజరరీల మధ్య సమన్వయ లోపమో మరో కారణమో తెలియదు కానీ చాలామంది రైతులకు రబీ రైతుబంధు డబ్బులు పడినట్లు వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లాయి. కానీ బ్యాంకుల్లో మాత్రం సొమ్ము పడలేదు. దీంతో వ్యవసాయశాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. కొందరి సమస్య పరిష్కారమైనా ఇంకొందరికి డబ్బు చేరలేదు. వారికి త్వరలో డబ్బులు వేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి స్పందిస్తూ అటువంటి వారు కొందరే ఉన్నట్లు తేలింది. ఇంకా డబ్బు అందని వారికి త్వరలోనే వేస్తామని ఆయన మంగళవారం తెలిపారు. గతేడాది ఖరీఫ్‌లో రైతుబంధు సొమ్మును ప్రభుత్వం చెక్కుల రూపేణా అందజేసింది. ప్రతీ గ్రామంలో సభలు పెట్టి చెక్కుల పంపిణీని పండుగలా నిర్వహించింది. రబీలోనూ అలాగే చేయాలని అనుకున్నారు. ఆ మేరకు చెక్కులనూ ముద్రించారు. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లడం, కోడ్ ప్రభావంతో చెక్కుల పంపిణీని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. రైతుల ఖాతాలోనే డబ్బులు జమ చేయాలని సూచించింది. ఆ మేరకు రైతుల బ్యాంకు ఖాతాలను వ్యవసాయశాఖ సేకరించి రైతులకు సొమ్ము బదిలీ చేసింది. వచ్చే ఖరీఫ్‌లోనూ రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాలోనే నేరుగా వేయాలని సర్కారు నిర్ణయించింది. చెక్కుల పంపిణీ పెద్ద తతంగంలా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది.+ -
మే నెలాఖరుకు రైతుబంధు నిధులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలాఖరుకు ఖరీఫ్ రైతు బంధు నిధులను అందజేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం రైతులకు అందజేసిన సంగతి తెలిసిందే. రైతు బంధు కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.8 వేల చొప్పున రెండు విడతలుగా అందజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సీజన్లకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఏటా ఖరీఫ్‌కు సంబంధించి రైతు బంధు సాయాన్ని మేలోనే ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. దీంతో ఖరీఫ్ ప్రారంభానికి ముందే రైతులు విత్తనాలు, సాగు సహా ఇతరత్రా ఖర్చులకు వినియోగించుకుంటారని పేర్కొంటోంది. అవే మార్గదర్శకాలు.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రైతుబంధు కోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. గత ఏడాది సాయం అందజేసిన ప్రతి రైతుకు ఈసా రి కూడా సాయం అందివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి పదెకరాలకు మించి భూమి ఉన్న రైతులకు సాయం నిలిపేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే వ్యవసాయ శాఖ వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని, గతేడాది మాదిరిగానే అందరికీ సాయం అందజేస్తామని చెబుతున్నాయి. మార్గదర్శకాలను మార్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. రుణమాఫీపై అస్పష్టత.. అసెంబ్లీ ఎన్నికల హామీ ప్రకారం అధికారంలోకి వస్తే రూ.లక్ష రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక దీనికి సం బంధించి బ్యాంకర్లు కసరత్తు కూడా చేశారు. పైగా ప్రభుత్వం విడతల వారీగా ఇచ్చేలా బడ్జెట్లో ఈసారి రూ.6 వేల కోట్లు కేటాయించింది. అయితే ఎప్పుడు రుణమాఫీ చేస్తారన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. లోక్‌సభ ఎన్నికల కోడ్ అయిపోయాక, రైతు బంధు సొమ్ము అందజేశాక రుణమాఫీ గురించి ఆలోచిస్తామని కొందరు సీనియర్ వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతు ఖాతాలకే నేరుగా.. గతేడాది ఖరీఫ్‌లో రైతుబంధు సొమ్మును ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేసింది. ప్రతి గ్రామంలో సభలు పెట్టి చెక్కుల పంపిణీ చేసింది. రబీలోనూ అలాగే చేయాలని అనుకున్నారు. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు రావడం, కోడ్ ప్రభావంతో చెక్కుల పంపిణీ జరగలేదు. దీంతో డబ్బును నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేశారు. ఈసారి కూడా ఖరీఫ్‌లో రైతు బంధు సొమ్మును రైతుల ఖాతాలోనే నేరుగా వేయాలని సర్కారు నిర్ణయించింది. -
‘పెట్టుబడి’కి మళ్లీ రూ.12వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్ రైతుబంధు పథకం కింద లబ్ధిదారులకు అందించే ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో లాంఛనంగా పెంచింది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్లలో ఒక్కో రైతుకు ఎకరానికి రూ. 8 వేలు ఇవ్వగా 2019–20 ఖరీఫ్, రబీల నుంచి ఎకరానికి ఏటా రూ. 10 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే ఖరీఫ్‌లో ప్రతి రైతుకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున, రబీలో ఎకరాకు మరో రూ. 5 వేల చొప్పున అందించనుంది. 2018–19 బడ్జెట్లో రైతుబంధుకు రూ. 12 వేల కోట్లు కేటాయించగా ఈసారి కూడా అంతే మొత్తం కేటాయించింది. ఎందుకంటే గత ఖరీఫ్, రబీలకు కలిపి ఇప్పటివరకు కేవలం రూ. 9,554 కోట్లు అందించగా ఇంకా కొంత మేరకు ఇవ్వాల్సి ఉంది. దీంతో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసుకొని ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించినట్లు అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం–కిసాన్ కింద ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6వేలు అందించనుండగా తెలంగాణలో మాత్రం కేంద్ర పథకంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందనుంది. పీఎం–కిసాన్ పథకానికి తెలంగాణ నుంచి దాదాపు 26 లక్షల మంది అర్హులుగా తేలారు. వారు కేంద్ర పథకం ద్వారానూ, రాష్ట్ర పథకం ద్వారానూ రెండు విధాలుగా లాభం పొందనున్నారు. ఉదాహరణకు ఐదెకరాలున్న రైతు కేంద్ర పథకం ద్వారా రూ. 6 వేలు పొందితే, అదే రైతు రైతుబంధు ద్వారా వచ్చే ఏడాదికి రూ. 50 వేలు పొందుతాడు. రెండింటి ద్వారా మొత్తంగా రూ. 56 వేల ఆర్థిక సాయం అందుకుంటాడు. పూర్తిస్థాయిలో అందని రబీ సొమ్ము... గతేడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతుబంధు కింద చెక్కులను పంపిణీ చేసి 51.80 లక్షల మంది రైతులకు రూ. 5,280 కోట్లు అందజేసింది. అయితే ఎన్ఆర్ఐలు, ఇతరత్రా వివాదాలుగల వారు ఉండటంతో మరికొందరికి ఇవ్వలేకపోయింది. రబీలోనూ చెక్కుల ద్వారా ఇవ్వాలనుకున్నా ఎన్నికల కారణంతో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే అందజేసింది. ఇప్పటివరకు రబీ సీజన్ కింద 43.60 లక్షల మందికి రూ. 4,724 కోట్లు రైతుబంధు సొమ్ము అందజేశారు. గతేడాది డిసెంబర్ 4 వరకు సక్రమంగానే అందజేసినా ఎన్నికల తర్వాత కొన్ని రోజులు నిధుల కొరతతో సొమ్ము ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. తర్వాత దాదాపు రూ. 700 కోట్లకుపైగా గత బిల్లులను పాస్ చేసి ట్రెజరీ అధికారులు ఎన్ఐసీకి సమాచారం ఇవ్వగా అందులో సగం సొమ్ము మాత్రమే బ్యాంకులకు వెళ్లింది. మిగిలిన సొమ్ము వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిధులు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అధికారులు అంటున్నారు. -
రైతుబంధు’లందరూ బీమాకు అర్హులే
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు చెక్కులు తీసుకున్న రైతులందరూ రైతుబీమాకు అర్హులేనని వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. ఈ పథకం కింద రైతుల నమోదు పురోగతి గురించి శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. పార్థసారథి మాట్లాడుతూ రైతు జీవితబీమా పథకంలో ఇప్పటివరకు 30 లక్షల మంది రైతులపేర్లు నమోదయ్యాయని తెలిపారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాసుబుక్ లేకున్నా రైతుబంధు చెక్కులను అందజేశామని, వారూ రైతుబీమా చేయించుకోవాలని పేర్కొన్నారు. కొంద రు రైతులు రైతుబంధు చెక్కులు తీసుకోకపోవడంతో అవి తహసీల్దార్ వద్దనే ఉన్నాయని, అలాంటి రైతు లు తప్పనిసరిగా ఆ చెక్కులు తీసుకుని, రైతుబీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు కుటుంబాలకు భరోసా కలిగించడానికే రైతుబీమా పథకమని.. ప్రతీ రైతు కూడా రైతుబీమా పథకంలో నమోదు కావాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకం కలిగిన 18 నుంచి 59 సంవత్సరాల (1959 ఆగస్టు 14 నుండి 2000 ఆగస్టు 15 మధ్య పుట్టినవారు) వయసు కలిగిన రైతులు జీవిత బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. జీవితబీమా పథకంలో ప్రతీ పట్టాదారు రైతు నమోదయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. జూలై 15, 2018 నాటికి నమోదు వివరాలు అందించాలి కాబట్టి త్వరితగతిన నమోదు, అప్ లోడింగ్ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య
సిరికొండ(బోథ్): అప్పులు పెరిగిపోవడం..రైతుబంధు సాయం రాకపోవడంతో మనస్థాపం చెందిన సిరికొండ మండల కేంద్రంలోని బోయవాడకాలనీకి చెందిన రైతు గోగుల నారాయణ (56) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. నారాయణ తనకున్న రెండెకరాల పరంపోగు భూమితోపాటు మరింత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది సక్రమంగా పంటలు పండకపోవడం, తనకున్న ముగ్గురు కూతుర్ల వివాహాలు చేయడంతో అప్పులు అధికమయ్యాయి. అవి ఎలా తీర్చాలోనని తీవ్ర మనస్థాపానికి గురయ్యేవాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి పెంచడం, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సహాయం చిల్లిగవ్వ రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు తీసి చూడగా నారాయణ మృతిచెంది ఉన్నాడు. నారాయణకు భార్య, ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. -
రేపటి నుంచి రెండో విడత
సాక్షి, హైదరాబాద్: తొలి విడతలో పాస్ పుస్తకాలు, రైతు బంధు చెక్కులు తీసుకోని రైతుల కోసం రెండో విడతగా ఈనెల 21 నుంచి మండల కేంద్రాల్లో పంపిణీ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 10 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. మొత్తం 51 లక్షలకు పైగా పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, 40 లక్షల వరకు రైతులు తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల దాదాపు 20 శాతం మంది పాస్ పుస్తకాలను తీసుకోలేదని రెవెన్యూ యంత్రాంగం లెక్కలు వేసింది. దీంతో వారికి రెండో విడతలో పంపిణీ చేయనున్నారు. ఆధార్‌తోపాటు ఆధారం కూడా.. వాస్తవానికి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలోనే రైతులు తమ భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు తీసుకున్నారు. అయితే స్థానికంగా నివాసం ఉండని వారు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ భూములున్న వారు, తమ గ్రామంలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన రోజున వెళ్లలేని వారు తీసుకోలేదు. ఇలా పాస్ పుస్తకాలు తీసుకోని రైతులు సగటున 20 శాతం మంది వరకు ఉంటారని అంచనా. రంగారెడ్డి జిల్లాలో ఇది 30 శాతం వరకు ఉన్నట్లు సమాచారం. వీరి కోసం స్పెషల్ డ్రైవ్ ఉంటుందని రెవెన్యూ శాఖ మొదటి నుంచీ చెబుతున్నా రైతుల్లో కొంత సందేహం ఉండేది. ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఈనెల 21 నుంచి అన్ని జిల్లాల్లో మలి విడత (పాస్ పుస్తకాలు తీసుకోని రైతులకు) పంపిణీ ప్రారంభించాలని సీసీఎల్ఏ నుంచి జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు అన్ని జిల్లాల్లో సోమవారం నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రామంలో పాస్ బుక్కు తీసుకోని రైతులు తమ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిపోయిన పాస్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు అక్కడ సిబ్బంది అందుబాటులో ఉంటారని, వారికి ఆధార్ కార్డుతోపాటు ఇతర ఆధారాలు చూపిస్తే సదరు రైతు పాస్ పుస్తకం, రైతుబంధు చెక్కు అందజేస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పాస్ పుస్తకాలు తీసుకోని రైతులు మండలాలకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ పూర్తయిందని, ఇక గ్రామాల్లో పంపిణీ ఉండదని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
కేసీఆర్ మోసాలు బట్టబయలుకే యాత్ర
వరంగల్: సీఎం కేసీఆర్ ఈ నాలుగేళ్లలో చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకే ప్రజాచైతన్య యాత్రను నిర్వహిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజాచైతన్య బస్సుయాత్రలో భాగంగా శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బహిరంగసభ నిర్వహించారు. ఉత్తమ్ మాట్లాడుతూ ఇప్పటివరకు వరంగల్ తూర్పు సభతో 38 నియోజకవర్గాల్లో ప్రజా చైతన్యయాత్రలు ముగిశాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పూర్తిగా విస్మరించిందని, సుమారు 4,200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్క కుటుం బాన్ని కూడా పరామర్శించని అమానవీయ ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. పక్క రాష్ట్రాలు రైతులకు గిట్టుబాటు ధరల కోసం బడ్జెట్లోని నిధులను కేటాయిస్తుంటే.. కేసీఆర్ ఎందుకు అందించడంలేదని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే రైతుబం«ధు పథకాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. రైతుబంధు పథకానికి తాము వ్యతిరేకం కాదని.. అయితే, ముందుగానే ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళాసంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మహిళా సంఘాలకు రూ.లక్ష గ్రాంటుగా, రూ.10 లక్షలు రుణాలుగా అందిస్తామని ఉత్తమ్ ప్రకటించారు. సభ కేవలం 34 నిమిషాల్లో ముగియడంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యాయి. వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ మంద వినోద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ నేతలు సీతక్క, నాయిని రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, నంది ఎల్లయ్య, దొంతి మాధవరెడ్డి, సంతోష్, పొదెం వీరయ్య, వేం నరేందర్‌రెడ్డి, మల్లు రవి, కోదండరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘రైతుబంధు’ను విస్తరిస్తాం
⇒ ఇక 6 నెలల దాకా ధాన్యం ఉచిత నిల్వ ⇒ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మార్కెటింగ్ మంత్రి హరీశ్ ⇒ కంది రైతును కాపాడేందుకు రూ.5,050 మద్దతు ధర ⇒ ఇప్పటికే 9 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశాం ⇒ ఈ–నామ్‌తో జీరో వ్యాపారానికి అడ్డుకట్ట ⇒ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త మార్కెటింగ్ చట్టం ⇒ మార్కెటింగ్ వ్యవస్థను డీనోటిఫై చేస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రైతు బంధు పథకాన్ని మరింత విస్తరిస్తామని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ధాన్యాన్ని ఉచితంగా నిల్వ ఉంచుకునే వెసులుబాటును ప్రస్తుతమున్న మూడు నెలల నుంచి ఆరు నెలలకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. మార్కెట్లు లేని చోట ప్యాక్స్, నాఫెడ్, ఎఫ్‌సీఐ, హాకా, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ వంటి ప్రభుత్వరంగ సంస్థలను భాగస్వామ్యం చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని సోమవారం సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. రాష్ట్రంలో మార్కెట్ల సంఖ్యను 150 నుంచి 180 దాకా పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. గతేడాది క్వింటాల్ రూ.8 వేలు పలికిన కంది ఈసారి రూ.4 వేలకు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఆఫ్రికా నుంచి కందుల దిగుమతికి కేంద్రం చేసుకున్న ఒప్పందమే దీనికి కారణమన్నారు. ‘‘తెలంగాణలో అధిక ఉత్పత్తి జరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అందుకే కందులకు రూ.5,050 మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర చరిత్రలోనే అధికంగా 95 కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇప్పటిదాకా రైతుల నుంచి 9 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశాం’’ అని మంత్రి వివరించారు. మా లక్ష్యం... మండలానికో గోదాం ప్రతి మండలానికీ ఒక గోదాం ఉండాలనేది తమ ఉద్దేశమని మంత్రి వివరించారు. ‘‘అందుకోసం 17 లక్షల మెట్రిక్ సామర్థ్యమున్న గోదాముల కోసం కేంద్రం నుంచి రూ.1,000 కోట్లు రుణంగా తీసుకున్నాం. ఇందులో కేంద్రం రూ.234 కోట్లు సబ్సిడీ కూడా ఇచ్చింది. గతంలో ఉల్లి ధర కిలో రూ.80 దాకా పెరిగినప్పుడు వినియోగదారులు అల్లాడారు. అప్పుడు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి అదే ధరకు 52,681 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి వినియోగదారులకు కిలో రూ.20కే విక్రయించాం’’ అని గుర్తు చేశారు. ఇకపై అలా జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 46 కేంద్రాల్లో ఈ–నామ్‌లను అమలు చేస్తున్నామని, రాష్ట్రానికి మరో 16 ఈ–నామ్‌లు రావచ్చని చెప్పారు. ఈసారి ఒక్కో ఈ–నామ్‌కు రూ.75 లక్షలు కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. పాత ఈ–నామ్‌లకు ఈ పెంచిన సొమ్మును కేటాయించాలని కోరతామన్నారు. ‘‘నల్లగొండ జిల్లాలో బత్తాయి అధికంగా పండుతుంది. కానీ అక్కడ ఇప్పటివరకు బత్తాయి మార్కెటే లేదు. అందుకే అక్కడ బత్తాయి మార్కెట్ నెలకొల్పాం. జిల్లాలోని నకిరేకల్‌లో నిమ్మకాయల మార్కెట్ ప్రారంభించాం. దేవరకొండలో దొండకాయలు మార్కెటింగ్ చేస్తున్నాం’’ అని తాము తీసుకుంటున్న చర్యలను సోదాహరణంగా వివరించారు. కొత్త మార్కెట్ చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే తేవాలనుకుంటున్నామని మంత్రి చెప్పారు. వ్యవస్థను డీ నోటిఫై చేయాలని నిర్ణయించామని, పండ్లు, కూరగాయలను రైతులు ఎక్కడైనా విక్రయించుకునేలా చర్యలు తీసుకుం టామని వివరించారు. జిన్నింగ్ మిల్లులకు పరిశ్రమ హోదా ఇవ్వడంతో రాష్ట్రంలో కొత్తగా 35 కాటన్ మిల్లులు వచ్చాయని చెప్పారు. -
రైతులకు చేయూతనిస్తున్న ప్రభుత్వం
మెదక్ ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి దళారులను నమ్మి మోస పోవద్దు మెదక్:తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంతగానో చేయూత నిస్తుందని , వారి శ్రేయస్సుకోసం ప్రభుత్వం ఏమైన చేస్తుందని మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. రైతులకోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. రైతులు పండించిన పంటను నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవదన్నారు. రైతుబంధు పథకాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకం కింద రైతుల పంటకు గిట్టుబాటు «ధర దొరక్కపోతే వారు పండించిన ధాన్యాన్ని నేరుగా ఏఎంసీలోకి తరలించి, అక్కడి గోదాంలో నిల్వ చేసి పంట ఉత్పత్తిపై 75 శాతం రుణాన్ని వడ్డీ లేకుండా తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆరునెలల వరకు రైతులు తమ ఉత్పత్తులు నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి మండల ప్రధాన కేంద్రంలో పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేయించిందన్నారు. ప్రస్తుతం మెదక్ మార్కెట్ యార్డ్‌లో గల ఉల్లినిల్వ గోదాములను కూలదోసి వాటి స్థానంలో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి, వాటిల్లో ఎరువులు, మందులు విక్రయ కేంద్రాలను ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మార్కెట్‌యార్డ్‌లో జరుగుతున్న వారాంతపు పశువుల సంతను కొనసాగిస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సంతను మరోచోటకు తరలిస్తామని తెలిపారు. దసరా రోజున నూతన జిల్లా ఏర్పాటు అవుతున్న సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని ఆయన కోరారు -
అంతంత మాత్రమే
- అన్నదాతలను ఆదుకోని రైతు బంధు - అధ్వానంగా పథకం అమలు - అరకొరగా కేటాయింపులు కడప అగ్రికల్చర్: పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదు.. ధర వచ్చేవరకు నిలువ ఉంచుకుందామనుకున్నా వీలుపడటం లేదు.. దీంతో రైతన్న పండించిన అరకొరపంటను అయిన కాడికి కళ్లంలోనో, పొలంలోనో తెగనమ్ముకుంటున్నారు. ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ఏ మాత్రం పట్టించుకోక పోవడంతో అవస్థలు తప్పడంలేదు. ఒకప్పుడు రైతులకు ఎంతో ఉపయోగక రంగా ఉన్న రైతుబంధు పథకం ప్రస్తుతం ఉన్నా లేనట్టేనని చెప్పకతప్పదు. జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో కడప, ప్రొద్దుటూరు మార్కెట్లు కీలకమైనవి. ఈ మార్కెట్ యార్డుల్లో గోడౌన్లకు కొదవలేదు. ఒకటి, రెండు మినహా మెజార్టీ మార్కెట్ కమిటీలు రైతులకు ఉపయోగపడే రైతుబంధు పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టాయి. ఈ ఏడాది కేటాయింపులు అంతంత మాత్రమే : రైతుబంధు పథకానికి ఈ ఏడాది కూడా అంతంత మాత్రంగానే నిధులు కేటాయించారు. కడప మార్కెట్‌యార్డుకు రూ 50 లక్షలు, ప్రొద్దుటూరుకు రూ.2లక్షలు, బద్వేలుకు రూ. 10 లక్షలు, మైదుకూరుకు రూ. 30 లక్షల నిధులను రైతులకు ఇవ్వనున్నట్లు రికార్డుల్లో పొందుపరచారు. మార్కెట్లో ఏటా ఎగుడుదిగుడుగా ధరలు ఉంటుండటంతో రైతులు పంట ప్రారంభంలో ఉన్న ధరకే ఉత్పత్తులను విక్రయించడం అలవాటు చేసుకుంటున్నారు. మార్కెట్ గోడౌన్లలో దాచుకుని ధరలు వచ్చాక విక్రయించుకొండి అని చెప్పేవారు కరవవుతున్నారు. రైతులకు అవగాహన కల్పించి ఎక్కువ మంది రైతుబంధు పథకాన్ని వినియోగించుకునేలా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. దూరమవుతున్న పథకం పండించిన పంటలకు మార్కెట్లో తగిన గిట్టుబాటు ధరలు లేనప్పుడు రైతులు వాటిని మార్కెట్ యార్డుల్లోని గోడౌన్లలో నిల్వ చేసుకుని రుణం పొందడానికి ప్రభుత్వం వీలుకల్పించింది. ప్రస్తుతం వివిధ పంటలకు గిట్టుబాటు ధర కరువవుతోంది. ఈ పథకాన్ని అధికారులే రైతుల కు దూరం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా దాదాపు రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కో ట్ల నిధులు కేటాయించి పథకాన్ని అమలు చేయాల్సి ఉండగా రానురాను బడ్జెట్ కేటాయింపు తగ్గి స్తూ వస్తున్నారు. 2010లో 77 మందికి రూ.79.33 లక్షలు, 2011లో 259 మందికి రూ.1.08 కోట్లు, 2012లో 22 మంది రైతులకు రూ. 6.43 లక్షలు మాత్రమే ఇచ్చారు. 2013వ సంవత్సరంలో 320 మందికి రూ. 3.19 కోట్లు రుణంగా చెల్లించారు. రైతుల కోసం ఉపయోగించాల్సిన గోడౌన్లను అధికారులు ఇతర కార్యకలాపాలకు అద్దెకు ఇస్తున్నారు. కడప మార్కెట్ యార్డులో 2500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోడౌన్లో కొంతభాగం ఆప్కోకు, మరికొంత బాగం పౌరసరఫరాలశాఖకు ఇచ్చారు.