
మునుగోడు: దేశంలోని పేద ప్రజలపై మోయలేని పన్నుల భారం మోపుతూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశంలోని దొంగల్ని, అక్రమ సంపాదనాపరుల్ని కాపాడేందుకు పార్టీలో ఆశ్రయం కల్పిస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలసి ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో పంటల సాగుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంటే దానిని అడ్డుకునే కుట్రలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేయలేదని, కేవలం ఆయన ఆస్తులు పెంచుకునేందుకే రూ. 21వేల కోట్ల విలువైన కాంట్రాక్టు పనుల్ని తెచ్చుకుని అమ్ముడుపో యారని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి కొన్ని వందలసార్లు సీఎం కేసీఆర్ చుట్టూ తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరతానని బతిమిలాడినా చేర్చుకోలేదన్నారు.
20న మునుగోడులో సభ: ఈ నెల 20న మునుగోడులో మండల కేంద్రంలో ప్రజా తీర్పు సభ నిర్వహించనున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారని చెప్పారు.
చదవండి: బీజేపీ, కాంగ్రెస్ దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలి?
Comments
Please login to add a commentAdd a comment