పవన్ కళ్యాణ్ టీడీపీ ఏజెంట్: హరీష్
హైదరాబాద్: రానున్న ఎన్నికల తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నాయకుడు హరీష్రావు అన్నారు. 13 ఎంపీ స్థానాలకు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. తెలంగాణలో తమకు సంపూర్ణ ఆధిక్యం వస్తుందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేమని అందుకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదన్నారు.
కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై వస్తున్న విమర్శలను హరీష్రావు తోసిపుపుచ్చారు. తాము ఉద్యమాలు చేసినప్పుడు ఎందుకు ఈ విషయం గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఉద్యమాల్లో తాను పలుమార్లు అరెస్టయ్యానని వెల్లడించారు. హైదరాబాద్లో తాను అరెస్టవని పోలీస్ స్టేషన్ లేదన్నారు.
టీడీపీ లబ్ది చేయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని అరోపించారు. టీడీపీ ఏజెంట్గా ముందుకు వచ్చారని చెప్పారు. జనసేన పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని హరీష్రావు అన్నారు. చిరంజీవిని కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదన్నారు.