మోడీతో పవన్ భేటీ ఉత్తిదే: వెంకయ్య | No information about Pawan Kalyan, Narendra Modi, says Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

మోడీతో పవన్ భేటీ ఉత్తిదే: వెంకయ్య

Published Thu, Mar 20 2014 3:57 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మోడీతో పవన్ భేటీ ఉత్తిదే: వెంకయ్య - Sakshi

మోడీతో పవన్ భేటీ ఉత్తిదే: వెంకయ్య

హైదరాబాద్: నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. పొత్తు గురించి బీజేపీ, జనసేన మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గానీ, జనసేన పార్టీ నుంచి కానీ ఎవరూ తమను సంప్రదించలేదన్నారు. పవన్ కళ్యాణ్ తరపున కూడా తమతో ఎవరూ మాట్లాడలేదని వెల్లడించారు.

ఈ విషయంపై మీడియాలో వస్తున్నవి వందతులేనని, ఇందులో నిజం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారన్నది కూడా ప్రచారమేనని చెప్పారు. మోడీతో పవన్ భేటీ గురించి తనకైతే ఎలాంటి సమాచారం లేదన్నారు. అపాయింట్మెంట్ ఉంటే మోడీని నేరుగా కలవొచ్చని వెంకయ్య నాయుడు తెలిపారు. తానింతవరకు జనసేన పార్టీ వారితో మాట్లాడలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement