Jena Sena Party
-
‘అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు, పవన్’
సాక్షి, విజయవాడ: కోనసీమ ఘటనపై లోతుగా విచారణ జరిపిస్తామని.. నిందితులెవరైనా వదిలేది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, కుట్రలు పన్నడం చంద్రబాబుకు అలవాటేనని.. పక్కా ప్లాన్ ప్రకారమే విధ్వంసం సృష్టించారన్నారు. పచ్చని కోనసీమలో చంద్రబాబు, పవన్ అలజడి సృష్టించారని దుయ్యబట్టారు. చదవండి: అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'! అంబేడ్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేయలేదా?. అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన దీక్షలు చేయలేదా? అని మంత్రి ప్రశ్నించారు. ‘‘ఆనాడు తుని ఘటనకు చంద్రబాబే కారణం. ఇప్పుడు ఈ ఘటనకు కూడా ఆయనే కారణం. ప్రజలన్నా.. వ్యవస్థలన్నా.. చంద్రబాబుకు భయం లేదు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేని చంద్రబాబే గొడవలు సృష్టించారన్నారు. నిరసన కారులు జై జనసేన అంటూ నినాదాలు చేశారు. అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు, పవన్ హస్తం ఉందని’’ మంత్రి దాడిశెట్టి మండిపడ్డారు. -
పవన్ కళ్యాణ్‌తో ఉండవల్లి భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన నిధులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆదివారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో తన కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఇరు ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై ప్రజల మాదిరిగానే తనకు అసంతృప్తి ఉందన్నారు. హోదా విషయంలో వాస్తవాలు బయటకు తీయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఏపీకి మేలు జరుగుతుందనే టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చానని తెలిపారు. పవన్‌ను చూడటానికే వచ్చా.. పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ అని, ఆయనను చూడటానికే వచ్చానని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. పవన్ తనతో రాజకీయాల గురించి చర్చించలేదన్నారు. అసలు రాజకీయాలు ఆయన ఇప్పుడు మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడరు, నిజాలు చెప్పరని వ్యాఖ్యానించారు. -
పవన్ కళ్యాణ్ టీడీపీ ఏజెంట్: హరీష్
హైదరాబాద్: రానున్న ఎన్నికల తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నాయకుడు హరీష్‌రావు అన్నారు. 13 ఎంపీ స్థానాలకు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. తెలంగాణలో తమకు సంపూర్ణ ఆధిక్యం వస్తుందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేమని అందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోలేదన్నారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై వస్తున్న విమర్శలను హరీష్‌రావు తోసిపుపుచ్చారు. తాము ఉద్యమాలు చేసినప్పుడు ఎందుకు ఈ విషయం గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఉద్యమాల్లో తాను పలుమార్లు అరెస్టయ్యానని వెల్లడించారు. హైదరాబాద్‌లో తాను అరెస్టవని పోలీస్ స్టేషన్ లేదన్నారు. టీడీపీ లబ్ది చేయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని అరోపించారు. టీడీపీ ఏజెంట్‌గా ముందుకు వచ్చారని చెప్పారు. జనసేన పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని హరీష్‌రావు అన్నారు. చిరంజీవిని కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదన్నారు. -
పవన్ ప్రశ్నించే విధానం నచ్చింది: శివాజి
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై తెలుగు సినిమా పరిశ్రమ మౌనం దాల్చింది. ఇప్పటివరకు జనసేనపై సినిమా పెద్దలు స్పందించలేదు. అయితే శివాజి మాత్రం తనదైన శైలిలో స్పందించాడు. పవన్ కళ్యాణ్ విధానాలు తనకు అర్థం కాలేదని ఓ కార్యక్రమంలో అన్నాడు. 'పవన్ కళ్యాణ్ దేనికి కట్టుబడ్డారో నాకు అర్థం కాలేదు. విప్లవవీరుడు చేగువేరా అంటే ఇష్టమని చెప్పుకునే పవర్ స్టార్ ఆశ్చర్యకరంగా బీజేపీకి మద్దతు పలికారు. ఏదైమైనా పవన్ కళ్యాణ్ ప్రశ్నించే విధానం నాకు నచ్చింది' అని శివాజి వ్యాఖ్యనించినట్టు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. పాలెం బస్సు ప్రమాద బాధితుల తరపున శివాజి ప్రభుత్వంతో పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అతడికి పలు రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. -
మోడీతో పవన్ భేటీ
మోడీకి, బీజేపీకి మద్దతు పలికిన జనసేన నేత సాక్షి, హైదరాబాద్: ఇటీవలే జనసేన పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన సినీ నటుడు పవన్‌కల్యాణ్ శుక్రవారం అహ్మదాబాద్‌లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని కలిశారు. పవన్‌ను మోడీ కార్యాలయానికి తీసుకెళ్లిన బీజేపీ సీమాంధ్ర సీనియర్ నేత సోము వీర్రాజు ఆయనను మోడీకి పరిచయం చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో బీజేపీకి, మోడీకి పవన్‌కల్యాణ్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జనసేన ఏర్పాటు సందర్భంగా ఇటీవల అభిమానులతో నిర్వహించిన సమావేశానికి సంబంధించిన పలు అంశాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని మోడీ కోరినట్లు సమాచారం. మోడీని కలసిన వారిలో పవన్‌తో పాటు ఆయన సన్నిహితులు రాజు రవితేజ, రాఘవ, అనిల్ ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ప్రతిపాదన... మోడీతో భేటీలో చర్చల సారాంశాన్ని బయటకు వెల్లడించనప్పటికీ.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయం ఇంకా తేల్చుకోలేదని పవన్‌కల్యాణ్ చెప్పినట్లు తెలిసింది. అయితే.. పవన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బీజేపీ మద్దతు ఇస్తుందనే ప్రతిపాదనపై వారిమధ్య చర్చ జరిగిందని పవన్ సన్నిహితులు పేర్కొన్నారు. పవన్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని మోడీ తరఫున ప్రతిపాదన వచ్చిందని, ఈ అంశం కొలిక్కి వచ్చినప్పటికీ.. ఇటు బీజేపీ ప్రతినిధులు, అటు పవన్ కల్యాణ్ విషయాన్ని రహస్యంగానే ఉంచినట్లు చెప్తున్నారు. ఇదే జరిగితే.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పవన్ లోక్‌సభ బరిలోకి దిగుతారు. అదే సమయంలో బీజేపీ పక్షాన ప్రచారం నిర్వహిస్తారు. పవన్ నిబద్ధత నాకు నచ్చింది: మోడీ ‘‘నేను పవన్‌ను కలిశాను. ఇది మా తొలి భేటీ. దేశానికి సేవ చేయాలన్న ఆయన ఆకాంక్ష, నిబద్ధత నాకెంతో నచ్చింది...’’ అని మోడీ సామాజిక వెబ్సైట్ ట్విటర్లో వ్యాఖ్యానించారు. మోడీకి మద్దతు ఇస్తున్నాం: కల్యాణ్ మోడీతో భేటీ అనంతరం పవన్‌కల్యాణ్ అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి అయ్యే అర్హతలన్నీ మోడీకి ఉన్నాయి. నేను, నా పార్టీ ఆయనకు మద్దతు ఇస్తున్నాం’’ అని ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించగా.. ‘‘నేను మోడీకి మద్దతు ఇస్తున్నా.. అంటే నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టే’’ అని బదులిచ్చారు. అయితే.. బీజేపీతో ఆయన పార్టీకి ఎన్నికలకు ముందు పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు పవన్ సమాధానం ఇవ్వలేదు. భేటీలో వీర్రాజుదే కీలకపాత్ర... తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. సీమాంధ్రలో టీడీపీతో పొత్తును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీతో పొత్తు సంగతి ఎలా ఉన్నా పవన్‌కల్యాణ్, బీజేపీ కలసిపనిచేయడం వల్ల ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపొచ్చన్న అభిప్రాయంతో ఆయనను స్వయంగా మోడీతో కలిపించడానికి వీర్రాజు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. పార్టీలో కొందరు నేతలు వ్యతిరేకించినప్పటికీ వీర్రాజు తనకున్న పరిచయాలతో పవన్‌ను మోడీ వద్దకు తీసుకెళ్లారని పార్టీ వర్గాలు చెప్పాయి. -
మోడీకే జనసేన మద్దతు: పవన్
-
మోడీతో పవన్ భేటీ ఉత్తిదే: వెంకయ్య
హైదరాబాద్: నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. పొత్తు గురించి బీజేపీ, జనసేన మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గానీ, జనసేన పార్టీ నుంచి కానీ ఎవరూ తమను సంప్రదించలేదన్నారు. పవన్ కళ్యాణ్ తరపున కూడా తమతో ఎవరూ మాట్లాడలేదని వెల్లడించారు. ఈ విషయంపై మీడియాలో వస్తున్నవి వందతులేనని, ఇందులో నిజం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారన్నది కూడా ప్రచారమేనని చెప్పారు. మోడీతో పవన్ భేటీ గురించి తనకైతే ఎలాంటి సమాచారం లేదన్నారు. అపాయింట్మెంట్ ఉంటే మోడీని నేరుగా కలవొచ్చని వెంకయ్య నాయుడు తెలిపారు. తానింతవరకు జనసేన పార్టీ వారితో మాట్లాడలేదని చెప్పారు. -
'కల్లు తాగిన కోతిలా పవన్ వ్యవహారం'
హైదరాబాద్: స్టార్హోటల్లో జనానికి సంబంధం లేనివాళ్ల మధ్య జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కల్యాణ్‌ది ప్రజల పార్టీయే కాదని కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు ఆరోపించారు. మంగళవారం ఆయన సీఎల్పీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వ్యవహారం కోతి కల్లు తాగి గెంతులేసినట్టు ఉందని, ఆయన ప్రసంగం సినిమా షూటింగ్‌లా ఉందని ఎద్దేవా చేశారు. చిరంజీవి వల్లే సినీ పరిశ్రమలో గుర్తింపు పొంది ఇప్పుడు ఆయన ఉన్న పార్టీనే దూషించడాన్ని ఖండిస్తున్నానన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా పవన్ కళ్యాణ్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, దేశాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
పవన్ పట్టుదలతో ఉన్నారు: జనసేన
హైదరాబాద్: దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పనిచేస్తామని పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ ప్రకటించుకుంది. యువ రాజకీయ నాయకులను తయారు చేయాలన్న పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఉన్నారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. సరికొత్త రాజకీయం సృష్టించేందుకు పవన్ సిద్ధపడ్డారని స్పష్టం చేసింది. అట్టడుగు వర్గాల నుంచి నాయకులను తీసుకురావాలని పవన్ భావిస్తున్నారని వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే, రెండు రాష్ట్రాల అవరణ దినోత్సవాలను మాత్రమే సెలవు దినాలుగా ప్రకటిస్తామని పేర్కొంది. జాతీయ సమగ్రతకు ఉపయోగపడే రోజులు సెలవుదినాలుగా ఉండాలని పవన్ భావిస్తున్నారని తెలిపింది. అన్ని మతాలు, పండుగల పట్ల ఆయనకు గౌరవం ఉందని పేర్కొంది. పార్టీని దృఢంగా ముందుకు తీసుకెళ్లాలని పవన్ యోచిస్తున్నారని, రాజకీయ సామాజిక మార్పు లక్ష్యంగా వేలాది మందిని జనసేనలో చేర్చుకుంటామని తెలిపింది. కార్యకర్తలందరికీ శిక్షణనిచ్చి సామాజిక సైన్యంగా తయారుచేస్తామని వెల్లడించింది. కాగా, పవన్ కళ్యాణ్ తన రెండో సభను విశాఖపట్టణంలో నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈనెల 25 లేదా 27న విశాఖలో పవన్ కళ్యాణ్ సభ ఉంటుందని అంటున్నారు. మరోవైపు పవన్‌తో పొత్తుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. -
మరో సంచలనానికి సిద్ధమవుతున్న పవన్
హైదరాబాద్: రాజకీయ పార్టీ పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన పవన్ కళ్యాణ్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు. 'ఇజం' పేరుతో పుస్తకాన్ని విడుదల చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు. జనసేన పార్టీ భావజాలంతో పవన్ కళ్యాణ్ ఈ పుస్తకం రాసినట్టు తెలుస్తోంది. తన సన్నిహితుడు రాజు రవితేజతో కలిసి ఈ పుస్తకం రాసినట్టు సమాచారం. దీన్ని ఈనెల 25న విడుదల చేసే అవకాశముంది. మరోవైపు పార్టీ పనుల్లో పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా ఉన్నారు. సామాజిక, రాజకీయ ఎజెండాతో ఆయన ముందుకు సాగనున్నారు. పార్టీలో చేరతామంటూ తమకు వేలాది ఫోన్లు వస్తున్నాయని జనసేన పార్టీ కార్యాలయం వెల్లడించింది. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ విధి విధానాలు ఏవిధంగా ఉండబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈనెల 17న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో పవన్ భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి. -
నా పార్టీ పేరు జనసేన: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: గొప్పగా బతకాలని తానెన్నడూ ప్రయత్నం చేయలేదని, సామాన్యుడిలా బతకాలనుకున్నానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తాను రాజకీయాల నుంచి మాట్లాడతానగానే తనను ఇష్టం వచ్చినట్టు తిట్టారని అందుకే పార్టీ పెట్టానని వెల్లడించారు. తన పార్టీ పేరు 'జనసేన' అని ప్రకటించారు. తన పార్టీ విధివిధానాలు తర్వాత వెల్లడిస్తానని చెప్పారు. తాను పార్టీ పెడుతున్నట్టు తన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ తెలియదన్నారు. పదవుల పట్ల తనకు వ్యామోహం లేదన్నారు. అన్నయ్య చిరంజీవిపై కోపం ఉండదన్నారు. తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యకు ఎదురెళ్లను అన్నారు. ఢిల్లీ వాళ్ల కాళ్లు పట్టుకునే బానిసను కాదన్నారు. పదవులపై తనకు మోజు లేదన్నారు. పదవులు నాకు చాలా తుచ్ఛమైనవి అన్నారు. -
'పవన్ కన్నా గొప్ప నాయకుడు దొరకడు'
హైదరాబాద్: 'జనసేన' పేరులోనే ఇంతుంటే పార్టీలో ఇంకెంతుంటుందోనని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. జనసేన అనే పేరు శివసేన కన్నా వెయ్యి రెట్లు మెరుగ్గా ఉందని ట్విటర్లో పేర్కొన్నారు. జనసేన కన్నా గొప్ప పేరు ఒక పార్టీకి ఉండే అవకాశం లేదన్నారు. ప్రజారాజ్యం పార్టీలో జరిగిన అవకతవక పనులు జనసేనలో అసలు జరిగే అవకాశం లేదని వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కన్నా గొప్ప నాయకుడు దొరకడు కాబట్టి జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి తెలుగువాళ్లు తెలివైనవారని నిరూపించుకోవాలన్నారు. తన ఉద్దేశంలో తెలివి, నీతి, అభిమానం, పౌరుషం ఉన్నవాళ్లెవరైనా పవన్ జనసేన పార్టీకి ఓటు వేస్తారని వర్మ వ్యాఖ్యానించారు. జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ కొత్తపార్టీ పెడుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.