'కల్లు తాగిన కోతిలా పవన్ వ్యవహారం'
హైదరాబాద్: స్టార్హోటల్లో జనానికి సంబంధం లేనివాళ్ల మధ్య జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కల్యాణ్‌ది ప్రజల పార్టీయే కాదని కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు ఆరోపించారు. మంగళవారం ఆయన సీఎల్పీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ వ్యవహారం కోతి కల్లు తాగి గెంతులేసినట్టు ఉందని, ఆయన ప్రసంగం సినిమా షూటింగ్‌లా ఉందని ఎద్దేవా చేశారు. చిరంజీవి వల్లే సినీ పరిశ్రమలో గుర్తింపు పొంది ఇప్పుడు ఆయన ఉన్న పార్టీనే దూషించడాన్ని ఖండిస్తున్నానన్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా పవన్ కళ్యాణ్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, దేశాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.