'ఉద్యమ నేతకు కనీవినీ ఎరగని రీతిలో స్వాగతం' | Grand welcome planned for KCR, says Harish Rao | Sakshi
Sakshi News home page

'ఉద్యమ నేతకు కనీవినీ ఎరగని రీతిలో స్వాగతం'

Published Mon, Feb 24 2014 3:07 PM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

ఈ నెల 26న హైదరాబాద్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు చెప్పారు.

హైదరాబాద్: ఈ నెల 26న హైదరాబాద్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు చెప్పారు. బేగంపేట విమానాశ్రయం నుంచి గన్‌పార్క్‌ వరకూ పాదయాత్ర ద్వారా ర్యాలీగా వెళ్తామని తెలిపారు. తెలంగాణలో విజయోత్సవాలు జరుపుకునే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు.

26న కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని చెప్పి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మాట నిలబెట్టుకుని తిరగి వస్తుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు కనీవినీ ఎరగని రీతిలో స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement