కిరణ్ను సీఎంగా గుర్తించడం లేదు: హరీష్ | we do not recognise kiran kumar reddy as a CM, says Harish Rao | Sakshi
Sakshi News home page

కిరణ్ను సీఎంగా గుర్తించడం లేదు: హరీష్

Published Mon, Feb 10 2014 10:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

కిరణ్ను సీఎంగా గుర్తించడం లేదు: హరీష్

కిరణ్ను సీఎంగా గుర్తించడం లేదు: హరీష్

హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్రావు విమర్శించారు. పదవుల్లో కొనసాగే నైతిక అర్హత వారికిలేదని ఆయన అన్నారు. సీఎం, స్పీకర్ సీమాంధ్ర నేతల్లా నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుకు అసెంబ్లీలో తీవ్రమైన నిరసన తెలుపుతామని ఆయన హెచ్చరించారు. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా గుర్తించడం లేదన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుంటే చంద్రబాబు అన్యాయమనడాన్ని హరీష్రావు తప్పుబట్టారు. విపక్షాల నిరసనల మధ్య రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement