
ప్రతిపక్షనేత కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్.. రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉండే బడ్జెట్. గత పదేళ్ల కాలంలో హైప్ బడ్జెట్..కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రాక్టీకల్ అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ పదేళ్ల బడ్జెట్ ఊహల్లో విహరించిన బడ్జెట్ అన్న ఆయన.. కాంగ్రెస్ నాయకత్వం వాస్తవానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోరి ప్రవేశ పెట్టిన బడ్జెట్ వ్యవసాయానికి పెద్ద పీట వేయడంతో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తే.. గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం అప్పులకే ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment