
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం వామపక్ష నేతలు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అయితే వామపక్ష నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. ప్రశ్నించిన వాళ్లను ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. చనిపోయిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.