
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ఎలాంటి ఫైన్ లేకుండా నేటి నుంచి (జనవరి 30) ఫిబ్రవరి 11 వరకు ఫీజు చెల్లించవచ్చని రాష్ట్ర విద్యాశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 100 రూపాయల రుసుముతో ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు, 500 రూపాయల రుసుముతో ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 2 వరకు, 1000 రూపాయల ఫైన్‌తో మార్చ్ 3 నుంచి మార్చి9 వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం ఇచ్చింది. అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే ఫీజు చెల్లించాలని పేర్కొంది. చదవండి: సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాకు అస్వస్థత
మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. మే 2 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిదే. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ ఉండనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఏప్రిల్ 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.