
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజును రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకూ చెల్లించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు గడువు ఈ నెల 19వ తేదీతో ముగిసింది. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment