ఇంటర్‌ సిలబస్‌ కుదింపు | Telangana Intermediate Board Planning To Reduce Syllabus | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సిలబస్‌ కుదింపు

Published Fri, Jul 10 2020 2:56 AM | Last Updated on Fri, Jul 10 2020 2:56 AM

Telangana Intermediate Board Planning To Reduce Syllabus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోనూ ఇంటర్మీడియట్‌ సిలబస్‌ను కుదించేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు ప్రారంభించింది. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఇటీవల 9 నుంచి 12వ తరగతి వరకు 30 శాతం సిలబస్‌ను కుదించినట్లుగానే రాష్ట్రంలోనూ ఆ మేరకు చర్యలు చేపడుతోంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ నే ప్రామాణికంగా తీసుకొని ప్రశ్నపత్రాల రూపకల్పన జరుగుతున్న నేపథ్యంలో గతంలోనే జాతీయ స్థాయికి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఇంటర్‌ సిలబస్‌ను మార్పు చేసింది. మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈలో ఉన్న సిలబస్‌ కంటే కొంత ఎక్కువే ఉండేలా చర్య లు చేపట్టింది.

కరోనా నేపథ్యంలో జూన్‌లో ప్రారం భం కావాల్సిన జూని యర్‌ కాలేజీలు ఇంతవరకు మొదలు కా లేదు. ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలే ని పరిస్థితి.. ఈ నేపథ్యంలో జాతీ య స్థాయిలో 30% సి లబస్‌ కుదింపునకు సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకుం ది. సీబీఎస్‌ఈ ఏయే పాఠ్యాంశాలను తొ లగిస్తుందో రాష్ట్రంలోనూ వాటినే తొలగించాలని నిర్ణయించింది. ముఖ్యంగా మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈ ప్రకారమే తొలగింపును అమలు చేయనుంది. ఇక ఆర్ట్స్, భాషా సబ్జెక్టులు మాత్రం రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగానే చాలా వరకు ఉంటాయి కాబట్టి స్థానికంగానే నిర్ణయం తీసుకోనుంది. భాషా, ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈ తొలగించే పాఠ్యాంశాలు ఉంటే వాటిని తొలగించడంతోపాటు స్థానిక అంశాలకు సంబంధించిన సిలబస్‌ను కుదించేందుకు చర్యలు చేపట్టింది. 

ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్, ఫిజిక్స్‌లో తొలగించబోయే కొన్ని పాఠ్యాంశాలు ఇవీ..
మ్యాథమెటిక్స్‌ ప్రతి పేపర్‌లో మొత్తం 31 వెయిటేజీ మార్కులు, 45 పిరియడ్లు కలిగిన పాఠ్యాంశాలను తొలగించబోతున్నారు.
► 1ఏలో చాప్టర్‌–1 ఫంక్షన్స్‌లో 2 మార్కులు, 8 పిరియడ్లు కలిగిన రియల్‌ వ్యాల్యూడ్‌ ఫంక్షన్స్‌ (డొమెయిన్, రేంజ్, ఇన్‌వర్స్‌)
► చాప్టర్‌–2లో 7 వెయిటేజీ మార్కులు, 8 పిరియడ్లు కలిగిన మ్యాథమెటికల్‌ ఇంట్రడక్షన్‌ మొత్తం.
► చాప్టర్‌–3 మ్యాట్రిసెస్‌లో 7 మార్కులు, 14 పిరియడ్లు కలిగిన డిటెర్మినాంట్స్, కాన్సిస్టెన్సీ అండ్‌ ఇన్‌కాన్సిటెన్సీ ఆఫ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ సిమ్యులేషన్‌ ఈక్యూస్, సొల్యుషన్‌ ఆఫ్‌ సైమల్‌టెనియస్‌ లీనియర్‌ ఈక్యూఎస్‌.
► చాప్టర్‌–5 ప్రొడక్ట్‌ వెక్టార్స్‌లో 7 మార్కులు, 14 పిరియడ్లు కలిగిన స్కాలర్‌ ట్రిపుల్‌ ప్రొడక్ట్, వెక్టార్‌ ఈక్యూ ఆఫ్‌ ప్లేన్, డిఫరెంట్‌ ఫారమ్స్, వెక్టార్‌ ట్రిపుల్‌ ప్రొడక్ట్‌.
► చాప్టర్‌–7లో 4 మార్కులు, 5 పిరియడ్లు కలిగిన పాఠ్యాంశాలు మొత్తం.
► చాప్టర్‌–8లో 4 మార్కులు, 5 పిరియడ్లు కలిగిన పాఠ్యాంశం మొత్తం తొలగించనున్నారు. అలాగే మ్యాథమెటిక్స్‌ 1బీలోనూ 31 వెయిటేజీ మార్కులు, 45 పిరియడ్లు కలిగిన ఆరు ఛాప్టర్లలోని 10 పాఠ్యాంశాలు, 2ఏలోనూ ఆరు చాఫ్టర్లలో 30 మార్కులు, 45 పిరియడ్లు కలిగిన 10 పాఠ్యాంశాలు, 2బీలోనూ ఆరు చాఫ్ట్రర్లలోని 31 మార్కులు, 45 పిరియడ్లు కలిగిన 10 పాఠ్యాంశాలను తొలగించనున్నారు.

ప్రథమ సంవత్సరం ఫిజిక్స్‌లో తొలగించబోయే పాఠ్యాంశాలు..
► చాప్టర్‌–1లో స్కోప్‌ అండ్‌ ఎక్సైట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజిక్స్, ఫిజిక్స్,– టెక్నాలజీ అండ్‌ సొసైటీ, నేచర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ లాస్‌.
► చాప్టర్‌–5లో ది లా ఆఫ్‌ ఇనెర్టియా, న్యూటన్‌ ఫస్ట్‌ లా ఆఫ్‌ మోషన్, న్యూటన్స్‌ సెకండ్‌ లా ఆఫ్‌ మోషన్, న్యూటన్‌ థర్డ్‌ లా ఆఫ్‌ మోషన్‌.
► చాప్టర్‌–7లో థియరిమ్స్‌ ఆఫ్‌ పర్‌పెండిక్యులర్‌ అండ్‌ ప్యారలాల్‌ ఆక్సిస్‌.
► చాప్టర్‌–9లో కెప్లర్స్‌ లాస్, యాక్సిలరేషన్‌ డ్యూటు గ్రావిటీ ఆఫ్‌ ది ఎర్త్, యాక్సిలరేషన్‌ డ్యూ టు గ్రావిటీ బిలో అండ్‌ ఏబోవ్‌ ది సర్ఫేస్‌ ఆఫ్‌ ఎర్త్‌
► చాప్టర్‌ 10లో ఎలాస్టిక్‌ బిహేవియర్‌ ఆఫ్‌ సాలిడ్స్, ఎలాస్టిక్‌ మాడ్యులీ
► చాప్టర్‌––12లో టెంపరేచర్‌ అండ్‌ హీట్, హీట్‌ ట్రాన్స్‌ఫర్‌
► చాప్టర్‌– 13లో హీట్‌ ఇంజన్స్, రిఫ్రిజిరేటర్స్‌ అండ్‌ హీట్‌ పంప్స్‌.

ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్‌లో తొలగించబోయే పాఠ్యాంశాలు
► చాప్టర్‌–1లో ది ప్రిన్సిపుల్‌ ఆఫ్‌ సూపర్‌పొజిషన్‌ ఆఫ్‌ వేవ్స్, డాప్లర్‌ ఎఫెక్ట్‌.
► చాప్టర్‌–2లో రిఫ్లెక్షన్‌ ఆఫ్‌ లైట్‌ బై స్పెరికల్‌ మిర్రర్స్, సమ్‌ నేచురల్‌ ఫినామినా డ్యూ టూ సన్‌లైట్, ఆప్టికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌.
► చాప్టర్‌–3లో ఆప్లికేషన్‌ ఆఫ్‌ గాయ్‌స్‌ లా
► చాప్టర్‌–6లో కాంబినేషన్‌ ఆఫ్‌ రెసిస్టర్స్‌ – సిరీస్‌ అండ్‌ ప్యారలాల్‌.
► చాప్టర్‌–7లో టారక్య్‌ ఆన్‌ కరెంట్‌ లూప్, మ్యాగ్నటిక్‌ డిపోల్‌.
► చాప్టర్‌–8లో మ్యాగ్నెటిక్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెట్స్‌ అండ్‌ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్‌.
► చాప్టర్‌–10లో పవర్‌ ఇన్‌ ఏసీ సర్క్యూట్‌: ది పవర్‌ ఫ్యాక్టర్‌.
► చాప్టర్‌–11లో డిస్‌ప్లేస్‌మెంట్‌ కరెంట్‌.
► చాప్టర్‌–12లో డావిస్సన్‌ అండ్‌ గార్మర్‌ ఎక్స్‌పెరిమెంట్‌
► చాప్టర్‌–13లో మాస్‌ ఎనర్జీ అండ్‌ న్యూక్లియర్‌ బైండింగ్‌ ఎనర్జీ, రేడియో యాక్టివిటీ
► చాప్టర్‌–15లో స్పెషల్‌ పర్పస్‌ పీ–ఎన్‌ జంక్షన్‌ డియోడ్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement