Syllabus Changes
-
గ్రీన్విచ్ కంటే ముందే మనకో కాలమానం!
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆరో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానం కంటే ముందే మన దేశానికి సొంత కాలమానం ఉందని, దీనిని ‘మధ్య రేఖ’ అని పిలుస్తారని పేర్కొంది. బీఆర్ అంబేద్కర్ అనుభవాలను, ఎదుర్కొన్న కుల వివక్ష పాఠాన్ని కూడా కుదించింది. హరప్పా నాగరికతను కొత్త పాఠ్య పుస్తకంలో ‘సింధు–సరస్వతి’గా పేర్కొంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాల విద్య కోసం కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్–2023కు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ కొత్త సిలబస్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో 6వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానమే ప్రధాన కాలమానం కాదని, దానికంటే శతాబ్దాల ముందు యూరప్, భారత్‌లకు సొంత కాలమానాలున్నాయని పేర్కొంది. దానిని మధ్య రేఖ (మిడిల్ లైన్) అని పిలిచేవారని, అది ఖగోళ శాస్త్రానికి ప్రసిద్ధి చెందిన ఉజ్జయినీ నగరం (ఉజ్జయిన్) గుండా వెళ్లిందని వివరించింది. అలాగే కొత్త పాఠ్యపుస్తకంలో ‘భారత నాగరికత ప్రారంభం’ అనే అధ్యాయంలో సరస్వతి నదికి ప్రముఖ స్థానం ఉందని, ప్రజలను వర్ణాలుగా విభజించారని, శూద్రులను, స్త్రీలను వేదాలను అధ్యయనం చేయనీయలేదని పాత పాఠ్య పుస్తకంలో ఉండగా.. వ్యవసాయదారుడు, నేత, కుమ్మరి, బిల్డర్, వడ్రంగి, వైద్యుడు, నర్తకి, మంగలి, పూజారివంటి వృత్తులను వేదాల్లో పేర్కొన్నట్లు కొత్త పుస్తకాల్లో పేర్కొంది. పాత పుస్తకంలోని నాలుగు అధ్యాయాల్లో ఉన్న చాణక్యుడి అర్థశాస్త్రం, గుప్తులు, పల్లవులు, చాళుక్యుల రాజవంశాలు, అశోకుడు చంద్రగుప్త మౌర్యుల రాజ్యాల కథనాలను కొత్త పుస్తకంలో తొలగించింది. -
నైపుణ్యానిదే భవిష్యత్తు.. సాధారణ చదువులతో ఉపాధి అంతంత మాత్రమే
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యంతో కూడిన విద్య అభ్యసిస్తేనే భవిష్యత్తు ఉంటుందని, ఎలాగో డిగ్రీ పూర్తి చేశామనుకుంటే చాలదని స్పష్టమవుతోంది. ఏదో ఒక అంశంలో నైపుణ్యం కలిగిన వారు కూడా ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పెంచుకుంటూ సాంకేతిక, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాన్ని అవరుచుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ విధంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించేందుకు అన్ని స్థాయిల్లోనూ కసరత్తు జరుగుతోంది. డిగ్రీ స్థాయి నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ వృత్తి విద్య కోర్సుల్లోనూ కొనసాగుతోంది. ఏటా కుప్పలు తెప్పలుగా.. ఏటా కుప్పలు తెప్పలుగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసిన వారు ఉద్యోగాల వేటలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేలు, లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చేసిన వారికి కూడా ఉపాధి ఆమడ దూరంలోనే ఉంటోంది. ఏదో ఒక డిగ్రీలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల్లో దాదాపుగా సగం మందికి ఉపాధి లభించక పోవడం విస్మయం కలిగించే అంశమే అయినా వాస్తవం. 2020–21 అఖిల భారత సాంకేతిక విద్యా మండలి లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 1,34,763 మంది గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరారు. ఇదే సంవత్సరంలో 85 వేల వరకు విద్యార్థులు తమ కోర్సులు పూర్తి చేశారు. అయితే ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య 46,539 మాత్రమే. అకడమిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నా, నైపుణ్యం ఆశించిన మేర లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఇటీవల ఓ అధ్యయనంలో తేల్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాంకేతిక మండళ్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో నైపుణ్యంతో కూడిన ఉన్నత విద్యను అందించడం ఇప్పుడు అనివార్యమైంది. ఇంజనీరింగ్ విద్యకు అదనపు సాంకేతికత ఈ ఏడాది ఇంజనీరింగ్ విద్యకు మరింత సాంకేతికత జోడిస్తున్నారు. నాస్కామ్తో కలిసి ఇటీవల జేఎన్టీయూహెచ్ ఓ అవగాహన ఒప్పందం చేసుకుంది. రాబోయే కాలంలో ఏ తరహా సాంకేతికత పరిశ్రమలకు అవసరమో గుర్తించారు. దాన్ని ఇంజనీరింగ్ స్థాయి నుంచే విద్యార్థులకు బోధించడం ఇందులో ప్రత్యేకత. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలు ఇందులో భాగస్వామ్యమవుతాయి. ఆ కంపెనీలే అవసరమైన సాఫ్ట్వేర్ లాంగ్వేజీని ఇంజనీరింగ్ విద్యార్థులకు అందిస్తాయి. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటాసైన్స్ కోర్సుల్లో అంతర్జాతీయ మార్పులను ఎప్పటికప్పుడు ఈ సంస్థలు విద్యార్థుల ముందుకు తెస్తాయి. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు సైతం ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఉదాహరణకు ఓ వాహనం డిజైన్‌లో ముందుగా ఉపయోగించేది సాఫ్ట్వేర్. దాని సామర్థ్య పరీక్షలన్నీ కంప్యూటర్‌పైనే రూపొందిస్తారు. అదే విధంగా సివిల్‌లో నిర్మాణ రంగం మొత్తం సాఫ్ట్‌వేర్‌పైనే ఆధారపడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్ భాషతో కూడిన ప్రత్యేక ప్యాకేజీలు నాస్కామ్ విద్యార్థులకు అందిస్తుంది. అంతిమంగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రణాళికల్లో మార్పులు సంప్రదాయ డిగ్రీ కోర్సులను మరింత మెరుగ్గా అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఇటీవల ఓ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రయోగాత్మకంగా బీఏ హానర్స్ కోర్సులను ప్రవేశపెట్టింది. తరగతి విద్య తక్కువ, క్షేత్రస్థాయిలో, ప్రాజెక్టు వర్క్ ఎక్కువగా ఉండేలా పాఠ్య ప్రణాళికను రూపొందిస్తోంది. దేశవిదేశాల్లోని ఆర్థిక విధానాలను ఆర్థికశాస్త్ర అధ్యయనంలో జోడిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలను రూపొందించే శక్తి సామర్థ్యాలు పెంపొందించేలా కోర్సుల్లో మార్పులు ఉండబోతున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు డిగ్రీ కోర్సుల్లోనూ సాంకేతిక విద్యకు పెద్ద పీట వేస్తున్నారు. బీఎస్సీ డేటా సైన్స్‌ను కంప్యూటర్ ఇంజనీరింగ్‌తో సత్సమానంగా తీర్చిదిద్దేలా పాఠ్యాంశాలు రూపొందించారు. బీకాం విద్యార్థి కేవలం సబ్జెక్టుకే పరిమితం కాకుండా విద్యార్థి దశలోనే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం సాధించేందుకు అవసరమైన బోధన మెళకువలను ప్రవేశ పెడుతున్నారు. బీఏ కోర్సులు చేసినా సాఫ్ట్వేర్ వైపు మళ్ళేందుకు వీలుగా కొన్ని రకాల సాఫ్ట్వేర్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నారు. ఇది గొప్ప మార్పు స్కిల్ డెవలప్మెంట్తో కూడిన విద్య నేటి తరానికి అవసరం. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిగ్రీ విద్యార్థిని కూడా ఉపాధి వేటలో ఏమాత్రం తీసిపోని విధంగా తయారు చేయాలన్నది లక్ష్యం. ఇంజనీరింగ్ విద్యార్థి కూడా మరింత నాణ్యమైన విద్యను సొంతం చేసుకునేలా ఆలోచనలు చేస్తున్నాం. తద్వారా వీరు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని సొంతం చేసుకునే వీలుంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, చైర్మన్, ఉన్నత విద్యామండలి -
‘సిలబస్’ పై వెనక్కి తగ్గిన కర్ణాటక సర్కార్
బెంగళూర్ : ఈ ఏడాది విద్యాసంవత్సరంలో సిలబస్‌లో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కర్ణాటక సర్కార్ వెనక్కి తగ్గింది.18వ శతాబ్ధపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ ,హైదర్ అలీకి సంబంధించి పాఠ్యాంశాలను తొలగిస్తూ చేసిన ప్రకటనను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఖరారు కాలేదని, త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొంది. లాక్డౌన్ కారణంగా పాఠశాలల పునఃప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రానుందున విద్యా సంవత్సరం ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియదని, ఈ నేపథ్యంలో సిలబస్‌లో మార్పుల అంశంపై తుది వివరాలను వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపింది. (పాఠ్యాంశాల నుంచి టిప్పు సుల్తాన్ చాప్టర్ తొలగింపు) తొమ్మిది నుంచి పన్నెండో తరగతి సిలబస్‌ను కుదించే క్రమంలో లౌకికవాదం, పౌరసత్వం, సమాఖ్య వ్యవస్థల వంటి అంశాలను తొలగించాలన్న సీబీఎస్ఈ నిర్ణయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనికి అనుబంధంగా కర్ణాటక సైతం సిలబస్‌ను 30 శాతం తగ్గించే ఉద్దేశంతో పాఠ్య పుస్తకాల నుంచి మైసూర్ పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ చాప్టర్లను తొలగిస్తూ ప్రకటన జారీ చేసింది. మొఘల్, రాజ్‌పుత్‌ల చరిత్రకు సంబంధించిన అథ్యాయాలు, జీసస్, మహ్మద్ ప్రవక్త బోధనల అథ్యాయాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాజకీయ దుమారం తలెత్తడంతో సర్కార్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని, త్వరలోనే ఖరారు చేస్తామని వెల్లడించింది. కాగా మహమ్మారి నేపథ్యంలో తీసుకున్న సిలబస్ కుదింపు నిర్ణయం ప్రస్తుత విద్యా సంవత్సరానికే సిలబస్ కుదింపు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఒకటి నుంచి పదోతరగతి వరకూ సాధారణ విద్యాసంవత్సరంలో 210-220 పనిదినాలు కాగా, ఈ ఏడాది మాత్రం 120-140 ఉండనున్నట్లు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే సిలబస్‌ను కుదిస్తూ మార్పులు చేపట్టారు. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు) -
ఇంటర్ సిలబస్ కుదింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనూ ఇంటర్మీడియట్ సిలబస్‌ను కుదించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇటీవల 9 నుంచి 12వ తరగతి వరకు 30 శాతం సిలబస్‌ను కుదించినట్లుగానే రాష్ట్రంలోనూ ఆ మేరకు చర్యలు చేపడుతోంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సీబీఎస్ఈ సిలబస్ నే ప్రామాణికంగా తీసుకొని ప్రశ్నపత్రాల రూపకల్పన జరుగుతున్న నేపథ్యంలో గతంలోనే జాతీయ స్థాయికి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఇంటర్ సిలబస్‌ను మార్పు చేసింది. మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో సీబీఎస్ఈలో ఉన్న సిలబస్ కంటే కొంత ఎక్కువే ఉండేలా చర్య లు చేపట్టింది. కరోనా నేపథ్యంలో జూన్‌లో ప్రారం భం కావాల్సిన జూని యర్ కాలేజీలు ఇంతవరకు మొదలు కా లేదు. ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలే ని పరిస్థితి.. ఈ నేపథ్యంలో జాతీ య స్థాయిలో 30% సి లబస్ కుదింపునకు సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుం ది. సీబీఎస్ఈ ఏయే పాఠ్యాంశాలను తొ లగిస్తుందో రాష్ట్రంలోనూ వాటినే తొలగించాలని నిర్ణయించింది. ముఖ్యంగా మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ ప్రకారమే తొలగింపును అమలు చేయనుంది. ఇక ఆర్ట్స్, భాషా సబ్జెక్టులు మాత్రం రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగానే చాలా వరకు ఉంటాయి కాబట్టి స్థానికంగానే నిర్ణయం తీసుకోనుంది. భాషా, ఆర్ట్స్ సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ తొలగించే పాఠ్యాంశాలు ఉంటే వాటిని తొలగించడంతోపాటు స్థానిక అంశాలకు సంబంధించిన సిలబస్‌ను కుదించేందుకు చర్యలు చేపట్టింది. ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్‌లో తొలగించబోయే కొన్ని పాఠ్యాంశాలు ఇవీ.. మ్యాథమెటిక్స్ ప్రతి పేపర్లో మొత్తం 31 వెయిటేజీ మార్కులు, 45 పిరియడ్లు కలిగిన పాఠ్యాంశాలను తొలగించబోతున్నారు. ► 1ఏలో చాప్టర్–1 ఫంక్షన్స్‌లో 2 మార్కులు, 8 పిరియడ్లు కలిగిన రియల్ వ్యాల్యూడ్ ఫంక్షన్స్ (డొమెయిన్, రేంజ్, ఇన్వర్స్) ► చాప్టర్–2లో 7 వెయిటేజీ మార్కులు, 8 పిరియడ్లు కలిగిన మ్యాథమెటికల్ ఇంట్రడక్షన్ మొత్తం. ► చాప్టర్–3 మ్యాట్రిసెస్‌లో 7 మార్కులు, 14 పిరియడ్లు కలిగిన డిటెర్మినాంట్స్, కాన్సిస్టెన్సీ అండ్ ఇన్కాన్సిటెన్సీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ సిమ్యులేషన్ ఈక్యూస్, సొల్యుషన్ ఆఫ్ సైమల్టెనియస్ లీనియర్ ఈక్యూఎస్. ► చాప్టర్–5 ప్రొడక్ట్ వెక్టార్స్‌లో 7 మార్కులు, 14 పిరియడ్లు కలిగిన స్కాలర్ ట్రిపుల్ ప్రొడక్ట్, వెక్టార్ ఈక్యూ ఆఫ్ ప్లేన్, డిఫరెంట్ ఫారమ్స్, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్. ► చాప్టర్–7లో 4 మార్కులు, 5 పిరియడ్లు కలిగిన పాఠ్యాంశాలు మొత్తం. ► చాప్టర్–8లో 4 మార్కులు, 5 పిరియడ్లు కలిగిన పాఠ్యాంశం మొత్తం తొలగించనున్నారు. అలాగే మ్యాథమెటిక్స్ 1బీలోనూ 31 వెయిటేజీ మార్కులు, 45 పిరియడ్లు కలిగిన ఆరు ఛాప్టర్లలోని 10 పాఠ్యాంశాలు, 2ఏలోనూ ఆరు చాఫ్టర్లలో 30 మార్కులు, 45 పిరియడ్లు కలిగిన 10 పాఠ్యాంశాలు, 2బీలోనూ ఆరు చాఫ్ట్రర్లలోని 31 మార్కులు, 45 పిరియడ్లు కలిగిన 10 పాఠ్యాంశాలను తొలగించనున్నారు. ప్రథమ సంవత్సరం ఫిజిక్స్‌లో తొలగించబోయే పాఠ్యాంశాలు.. ► చాప్టర్–1లో స్కోప్ అండ్ ఎక్సైట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, ఫిజిక్స్,– టెక్నాలజీ అండ్ సొసైటీ, నేచర్ ఆఫ్ ఫిజికల్ లాస్. ► చాప్టర్–5లో ది లా ఆఫ్ ఇనెర్టియా, న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ► చాప్టర్–7లో థియరిమ్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ అండ్ ప్యారలాల్ ఆక్సిస్. ► చాప్టర్–9లో కెప్లర్స్ లాస్, యాక్సిలరేషన్ డ్యూటు గ్రావిటీ ఆఫ్ ది ఎర్త్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ బిలో అండ్ ఏబోవ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ► చాప్టర్ 10లో ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ సాలిడ్స్, ఎలాస్టిక్ మాడ్యులీ ► చాప్టర్––12లో టెంపరేచర్ అండ్ హీట్, హీట్ ట్రాన్స్ఫర్ ► చాప్టర్– 13లో హీట్ ఇంజన్స్, రిఫ్రిజిరేటర్స్ అండ్ హీట్ పంప్స్. ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్‌లో తొలగించబోయే పాఠ్యాంశాలు ► చాప్టర్–1లో ది ప్రిన్సిపుల్ ఆఫ్ సూపర్‌పొజిషన్ ఆఫ్ వేవ్స్, డాప్లర్ ఎఫెక్ట్. ► చాప్టర్–2లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై స్పెరికల్ మిర్రర్స్, సమ్ నేచురల్ ఫినామినా డ్యూ టూ సన్‌లైట్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. ► చాప్టర్–3లో ఆప్లికేషన్ ఆఫ్ గాయ్స్ లా ► చాప్టర్–6లో కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ – సిరీస్ అండ్ ప్యారలాల్. ► చాప్టర్–7లో టారక్య్ ఆన్ కరెంట్ లూప్, మ్యాగ్నటిక్ డిపోల్. ► చాప్టర్–8లో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్. ► చాప్టర్–10లో పవర్ ఇన్ ఏసీ సర్క్యూట్: ది పవర్ ఫ్యాక్టర్. ► చాప్టర్–11లో డిస్ప్లేస్మెంట్ కరెంట్. ► చాప్టర్–12లో డావిస్సన్ అండ్ గార్మర్ ఎక్స్పెరిమెంట్ ► చాప్టర్–13లో మాస్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ, రేడియో యాక్టివిటీ ► చాప్టర్–15లో స్పెషల్ పర్పస్ పీ–ఎన్ జంక్షన్ డియోడ్స్ -
టెన్త్ సోషల్ నుంచి 5 చాప్టర్ల తొలగింపు
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి సాంఘిక శాస్త్రం (సోషల్ సైన్స్) సబ్జెక్ట్ నుంచి ఐదు అధ్యాయాలను తీసేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. ప్రజాస్వామ్య సవాళ్లు (చాలెంజెస్ టు డెమోక్రసీ), రాజకీయ పోరాటాలు, ఉద్యమాలు (పొలిటికల్ స్ట్రగుల్స్ అండ్ మూవ్మెంట్స్), ప్రజాస్వామ్యం, భిన్నత్వం (డెమోక్రసీ అండ్ డైవర్సిటీ), అడవులు, వన్యప్రాణులు (ఫారెస్ట్ అండ్ వైల్డ్‌లైఫ్), నీటి వనరులు (వాటర్ రిసోర్సెస్) అనే ఐదు అధ్యాయాలను సాంఘిక శాస్త్రం నుంచి సీబీఎస్ఈ తొలగించనుంది. 2021లో పీసా (ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్)లో పాల్గొనాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించిందనీ, అందుకు తగ్గట్లుగా విద్యార్థుల మూల్యాంకన పద్ధతుల మార్చాల్సి ఉందని గత నెలలోనే పాఠశాలలకు సీబీఎస్ఈ తెలిపింది. -
ఇంజనీరింగ్ విద్యలో సమూల మార్పులు
-
మార్కెట్లో ఇంటర్ ఫస్టియర్ కొత్త పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వివిధ భాషలకు సంబంధించిన సిలబస్‌ను మార్పు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్ భాషలకు సంబంధించిన పుస్తకాల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ సిలబస్ 2018–19 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పుస్తకాలను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. మరోవైపు గతంలో ఫెయిలైన విద్యార్థులు 2019 మార్చి వార్షిక పరీక్షల్లో, మే/జూన్ నెలలో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాత సిలబస్‌లో పరీక్షలు రాయవచ్చని పేర్కొంది. మూడు రోజుల్లో రిఫండ్ చేస్తాం: టీఎస్పీఎస్సీ సాక్షి, హైదరాబాద్: పేమెంట్లు ఫెయిలైన అభ్యర్థులకు తిరిగి 3 రోజుల్లోగా రిఫండ్ చేస్తామని టీఎస్పీఎస్సీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గ్రూప్–4, టీఎస్ఆర్టీసీలో వివిధ పోస్టుల భర్తీలో భాగంగా పేమెంట్లను ఎస్బీఐ ఈ–పే ద్వారా స్వీకరిస్తున్న తరుణంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొంది. ఈ నెల 7 నుంచి 11వరకు చేసిన పేమెంట్ల సమస్యల్ని పరిష్కరించినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పాలీసెట్ చివరి దశ సీట్లు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్–2018 ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసింది. చివరి దశ కౌన్సెలింగ్‌లో కొత్తగా 9,100మంది విద్యార్థులకు సీట్లు లభించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రం లోని 170 పాలిటెక్నిక్ కాలేజీల్లో 38,359 సీట్లు అందుబాటులో ఉండగా, చివరి దశ కౌన్సెలింగ్ కలుపుకొని 29,663 సీట్లు భర్తీ అయ్యాయని, 8,696 సీట్లు మిగిలిపోయాయని ఆయన తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు శుక్రవారం లోగా నెట్ బ్యాంకింగ్/క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు ద్వారా ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని, కాలేజీల్లో నేడు, రేపు చేరాలని సూచించారు. -
ఎ‘ట్టెట్టా’!
ఎస్కేయూ/అనంతపురం ఎడ్యుకేషన్ : టెట్(టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) పేరు విం టేనే అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీ – టెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) సిలబస్ ఆధారంగా టెట్ విధివిధానాలు, నిబంధనలను రూపొందిస్తుండటంతో టెట్ సిలబస్ గతంతో పోలిస్తే మూడింతలు అధికంగా ఉంది. కనీస అర్హత సాధిస్తామా, లేదా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ♦ టెట్ రాత పరీక్షల్లో అన్ని మెథడాలజీ సబ్జెక్టుల వారికీ ఇబ్బందులున్నాయి. బయాలజీ సైన్సెస్ స్కూల్ అసిస్టెంట్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల సమస్యలు జఠిలంగా ఉన్నాయి. టెట్‌లో నిర్ధేశించిన సిలబస్ ప్రకారం కేటాయించిన ఈ 150 మార్కుల్లో బయాలజికల్ సైన్సెస్ వారికి కేవలం బయాలజీ, మెథడాలజీ రెండూ కలుపుకొని 18 మార్కుల సిలబస్ మాత్రమే తెలిసి ఉంటుంది. తక్కిన 132 మార్కుల కోసం కొత్తగా చదవాలి. దరఖాస్తుకు, పరీక్షకు గడువు కేవలం నామమాత్రంగానే ఉంది. టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఇస్తుండటంతో ప్రతి మార్కు కీలకమైన నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నారు. ♦ బీఈడీ(ఇంగ్లిష్), (తెలుగు), టీపీటీ పూర్తి చేసిన లాంగ్వేజెస్ అభ్యర్థులు ఇదివరకు సోషల్ స్టడీస్‌లో టెట్ రాయాల్సి ఉండేది. తాజాగా ఈ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని టెట్ – 3 పేరుతో నూతన సిలబస్ ఖరారు చేశారు. స్పెషల్ తెలుగు, స్పెషల్ ఇంగ్లిష్‌కు 60 మార్కులు కేటాయించారు. గతంలో ఈ 60 మార్కులకు ప్రశ్నలు తప్పనిసరిగా సోషల్ స్టడీస్‌లోనే వచ్చేవి. నూతనంగా సిలబస్ మార్చినప్పటికీ దాని రూపకల్పన పూర్తి కాలేదు. దీంతో వీరికీ ఇబ్బందులు తప్పలేదు. ఇంగ్లిష్ లాంగ్వేజెస్ వారికి ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులోకి రాకపోవడంతో వారు దరఖాస్తు చేసుకోలేదు. అందువల్ల టెట్ పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు. టెట్ స్వరూపాన్నే మార్చి.. ఆవేదన మిగిల్చి.. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎన్సీటీఈ(నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) టెట్ సిలబస్‌ను రూపొదించింది. వాస్తవానికి టెట్ పరీక్షను బట్టే ఉద్యోగ ఎంపిక పూర్తి చేయాల్సి ఉన్నా టెట్‌లోని సిలబస్ కొంత, డీఎస్సీ సిలబస్ కొంత తీసుకుని టెట్, డీఎస్సీ రెండు పరీక్షలు నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. టెట్ 150 మార్కులకు నిర్వహిస్తే.. ఇందులో వచ్చిన మార్కులను 20 శాతం డీఎస్సీలో వెయిటేజీ ఇస్తున్నారు. తక్కిన 80 శాతం వెయిటేజీ కోసం డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ♦ ‘టెట్’ను కాదని టీఆర్టీ.. తిరిగి టెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి సారిగా జులై – 2011లో టెట్ నిర్వహించారు. రెండో దఫా టెట్ జనవరి 2012లో జరిగింది. మొదటి టెట్ కన్నా రెండో టెట్ పరీక్ష చాలా కఠినంగా ఉండటంతో బోనస్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేశారు. తిరిగి మూడో టెట్‌ను జులై – 2013లో, నాలుగో టెట్‌ను మార్చి – 2014లో నిర్వహించారు. అయితే అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో టెట్‌ను రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అయితే ఒకసారి టెట్‌కు అర్హత సాధిస్తే ఏడేళ్ల వరకు చెల్లుబాటవుతుంది. అందువల్ల అప్పటికే అర్హత సాధించినవారు టెట్‌ను రద్దుపై తీవ్ర అభ్యంతరం తెలి పారు. దీంతో టీడీపీ ప్రభుత్వం టెట్ కమ్ టీఆర్టీ పేరుతో ఒకే పరీక్ష నిర్వహిం చింది. అయితే తిరిగి టెట్, డీఎస్సీ రెండు పరీక్షలు పెడుతున్నారు. ఇలా ప్రభుత్వ నిర్ణయాలు తరచూ మారుతుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. పొంతన లేని సిలబస్ మేథమేటిక్స్ కష్టమనే బయాలజికల్ సైన్సెస్ కోర్సులు తీసుకున్నాము. టెట్‌లో మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ప్రవేశపెట్టారు. మేథమేటిక్స్ బేసిక్ అయితే నేర్చుకోవచ్చుగానీ లోతైన సిలబస్ ఇచ్చారు. – భారతి, అనంతపురం సిలబస్ మూడింతలైంది గతంలో కన్నా మూడింతలు అధిక సిలబస్‌ను రూపొందించారు. దీంతో ప్రిపేరేషన్ చాలా భారంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ చదవాలంటే ఆందోళనగా ఉంది. – రాజేశ్వరి, గుంతకల్లు అర్హతమార్కులు తగ్గించాలి టెట్‌లో అర్హత మార్కులు అధిక శాతంగా నిర్ణయించారు. ఏ మాత్రం సంబంధం లేని సిలబస్‌ను ప్రవేశపెట్టారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అర్హత మార్కులు తగ్గించాలి. – సావిత్రి, అనంతపురం -
సివిల్స్, గ్రూప్-1కు అనుగుణంగా డిగ్రీ సిలబస్
హైదరాబాద్: సివిల్స్, గ్రూప్-1 వంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా డిగ్రీలోని సోషియాలజీ, సోషల్ వర్క్, ఆంత్రోపాలజీ సబ్జెక్టుల్లో మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా బుధవారం మండలి కార్యాలయంలో చైర్మ న్ పాపిరెడ్డి అధ్యక్షతన సిలబస్ సమీక్ష కమి టీ సమావేశం జరిగింది. ఈ కమిటీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఉన్నత విద్యా మండలి వైస్చైర్మన్లు వెంకటాచలం, మల్లేష్, ఇతర కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. డిగ్రీలో సోషియాలజీ, సోషల్‌వర్క్, ఆం త్రోపాలజీ సబ్జెక్టుల్లో తీసుకురావాల్సిన మార్పులను ఖరారు చేశారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ ఉం డాలని, ఇందుకోసం కొన్ని ప్రత్యేక పేపర్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ సబ్జెక్టులతో విద్యార్థి డిగ్రీ పూర్తి చేయగానే మానవ వనరుల విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిం చే విధంగా సిలబస్‌ను రూపొందించనున్నారు. సోషియాలజీలోని ఆప్షనల్స్‌ను పూర్తిగా మార్చుతున్నారు. సోషల్ వర్క్‌లో డిగ్రీ చేసిన విద్యార్థి ఎన్జీవోను ప్రారంభిం చేలా పాఠ్యాంశాలను అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఆంత్రోపాలజీలో తెలంగాణ గిరిజనులపై పాఠాలు పెట్టనున్నారు. -
పాఠ్యాంశాల్లో ‘సీమాంధ్ర’ముద్ర!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత విద్యా స్థాయి పాఠ్యాంశాల్లో మార్పులు చేసేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. తెలంగాణ విడిపోయిన నేపథ్యంలో పాఠ్యాంశాల్లో సీమాంధ్ర ప్రాంతం ముద్రను ప్రతిబింబించేలా పాఠ్యాంశాల్లో మార్పులకు కసరత్తు చేస్తోంది. సిలబస్ మార్పులపై గత జనవరిలోనే సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రాథమిక విద్యాశాఖ పరిధిలోని సిలబస్ మార్పులపై రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ(ఎస్ఈఆర్టీ)కు, ఉన్నత విద్యాసంస్థల్లో సిలబస్ మార్పుపై వర్సిటీలకు బాధ్యతలు అప్పగించారు. ప్రాథమికస్థాయి పాఠ్యాంశాల్లో మార్సులకు సంబంధించి ఎస్ఈఆర్టీ ఆధ్వర్యంలోని కమిటీ తాత్కాలిక నివేదికను కూడా సిద్ధం చేసింది. దీనిని ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందించనుంది. రాష్ట్ర విభజనానంతరం తెలంగాణ ప్రాంతం విడివడినందున ప్రాథమిక స్థాయి పాఠ్యాంశాల్లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంత వివరాలను పొందుపర్చనున్నారు. -
సిలబస్ మార్పులు ఎన్నాళ్లు?
పూర్తికాని పాఠ్యపుస్తకాల సిలబస్ మార్పుల ప్రక్రియ ⇒ ఇప్పటికే సగం ముద్రణ పూర్తి కావాల్సి ఉన్నా.. ⇒ ఇంకా మార్పుల దశలోనే ⇒ ముద్రణ టెండర్లే ఖరారు కాని వైనం ⇒ పేపరు కొనేదెప్పుడు.. పుస్తకాలను ముద్రించేదెప్పుడు? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల్లో మార్పుల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత నెల రోజులుగా సిలబస్‌లో మార్పుల ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెబుతున్నా, సిలబస్ కమిటీ ప్రభుత్వానికి ఇంకా నివేదికను ఇవ్వలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకున్న తెలుగు, సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకాల్లో మార్పులపై గత ఆగస్టు 28న ప్రభుత్వం నియమించిన కమిటీ కసరత్తు చేస్తూనే ఉంది. నవంబర్‌కల్లా సిలబస్‌లో చేసిన మార్పులపై నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికీ పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించలేకపోయింది. మార్పుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సిలబస్‌లో మార్పుల ప్రక్రియ ఆలస్యం అవుతున్నకొద్దీ ఆ ప్రభావం పుస్తకాల పంపిణీపైనా పడే అవకాశం ఉంది. కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందించాక అందులోని అంశాలను పరిశీలించేందుకు, మార్పులను ముఖ్యమంత్రి స్థాయిలో ఖరారు చేసేందుకు మరింత సమయం పట్టనుంది. మరోవైపు ముద్రణకు సంబంధించి పేపరు కొనుగోలుకోసం మొదట్లో పిలిచిన టెండర్లను రద్దు చేసి, మళ్లీ పిలిచారు. అవి ఖరారు చేసేందుకు, ఆ తరువాత ముద్రణకోసం టెండర్లు పిలిచేందుకు మరింత సమయం పట్టనుంది. ముద్రణ టెండర్లను ఖరారు చేశాక ప్రింటర్లకు పనులను అప్పగించాల్సి ఉంటుంది. తర్వాత వాటిని ముద్రించి పాఠశాలలకు పుస్తకాలు పంపేసరికి చాలా సమయం పడుతుందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి విద్యార్థులకు పుస్తకాలు అందించడం సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. బడులు తెరిచే నాటికి ఇవ్వకపోయినా కనీసం ఒకటీ రెండు నెలలు ఆలస్యంగానైనా పుస్తకాలను అందించేందుకు పక్కా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. తెలుగు పాఠ్యపుస్తకాల్లో మార్పులు.. సిలబస్‌లో మార్పులపై ఇప్పటి వరకు రూపొందించిన ప్రణాళికల ప్రకారం.. ఒకటి నుంచి పదో తరగతి వరకున్న తెలుగు పాఠ్య పుస్తకాల్లో భారీగా మార్పులు చోటు చే సుకోనున్నాయి. కాగా, ఈ సారి అన్ని తరగతుల సాంఘిక శాస్త్రాల్లో మార్పులు చేయడం లేదు. 6, 7, 8 తరగతుల సాంఘిక శాస్త్రాల్లో మాత్రం మార్పులు చేస్తున్నారు. 9, 10 తరగతుల సాంఘిక శాస్త్రాల్లో వచ్చే ఏడాదే మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రధాన మార్పులు ఇవీ.. ⇒ 9, 10 సహా అన్ని తరగతుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్రపటాలు ఉన్న చోట తెలంగాణ చిత్రపటాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర ఉన్న చోట తెలంగాణ సమగ్ర చరిత్ర ఉంటుంది. భారత దేశ పటంలో ఆంధ్రప్రదేశ్‌ను, తెలంగాణను వేరుగా చూపిస్తారు. ⇒ 6, 7, 8 తరగతుల్లో తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, పరిసర రాష్ట్రాలు, వాటితో సంబంధాలపై పాఠాలు ఉండనున్నాయి. నదులు, ఉపనదులు, చెరువులు, పంటలకు ప్రధాన సాగునీటి ఆధారాలు, ఒకప్పటి చెరువులు, వాటి ప్రాధాన్యం, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయపై చోటు కల్పిస్తున్నట్లు తెలిసింది. ⇒ తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ అవ తరణకు ముందు.. తరువాత అంశాలు, ఉద్యమంలో కేసీఆర్, టీఆర్ఎస్ పాత్రపై పాఠ్యాంశాలు, నిజాం పాలన, రజాకార్లు, నాటి పరిస్థితులపైనా పాఠాలు ఉంటాయి. అలాగే పెద్ద మనుషుల ఒప్పందం, సాయుధ పోరాట యోధులు, వారి చరిత్ర, ప్రత్యేక తెలంగాణ పోరాటానికి దారి తీసిన పరిస్థితులను పాఠ్యాంశాలుగా చేర్చుతున్నారు. ⇒ తెలంగాణ వైతాళికులైన ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ, కొమురం భీం, కొండా లక్ష్మణ్‌బాపూజీ తదితరుల జీవిత చరిత్ర, తెలంగాణ రాష్ట్రం కోసం వారి కృషిపైనా పాఠ్యాంశాలు ఉంటాయని తెలిసింది.