హైదరాబాద్: సివిల్స్, గ్రూప్-1 వంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా డిగ్రీలోని సోషియాలజీ, సోషల్ వర్క్, ఆంత్రోపాలజీ సబ్జెక్టుల్లో మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా బుధవారం మండలి కార్యాలయంలో చైర్మ న్ పాపిరెడ్డి అధ్యక్షతన సిలబస్ సమీక్ష కమి టీ సమావేశం జరిగింది. ఈ కమిటీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఉన్నత విద్యా మండలి వైస్‌చైర్మన్లు వెంకటాచలం, మల్లేష్, ఇతర కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.
డిగ్రీలో సోషియాలజీ, సోషల్‌వర్క్, ఆం త్రోపాలజీ సబ్జెక్టుల్లో తీసుకురావాల్సిన మార్పులను ఖరారు చేశారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ ఉం డాలని, ఇందుకోసం కొన్ని ప్రత్యేక పేపర్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ సబ్జెక్టులతో విద్యార్థి డిగ్రీ పూర్తి చేయగానే మానవ వనరుల విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిం చే విధంగా సిలబస్‌ను రూపొందించనున్నారు. సోషియాలజీలోని ఆప్షనల్స్‌ను పూర్తిగా మార్చుతున్నారు. సోషల్ వర్క్‌లో డిగ్రీ చేసిన విద్యార్థి ఎన్‌జీవోను ప్రారంభిం చేలా పాఠ్యాంశాలను అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఆంత్రోపాలజీలో తెలంగాణ గిరిజనులపై పాఠాలు పెట్టనున్నారు.
సివిల్స్, గ్రూప్-1కు అనుగుణంగా డిగ్రీ సిలబస్
Published Thu, May 7 2015 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement