digree cource
-
ప్రియుడి స్థానంలో డిగ్రీ పరీక్షకు ప్రేయసి.. ప్రభుత్వ ఉద్యోగం ఫసక్!
గాంధీనగర్: ఒకరికకి బదులు ఒకరు పరీక్షలు రాసిన సంఘటనలు చాలానే వెలుగు చూశాయి. కవల పిల్లల్లో అలాంటివి ఎక్కువ జరుగుతాయి. అయితే, ఓ అబ్బాయి స్థానంలో అమ్మాయి పరీక్షలు రాసే ప్రయత్నం చేసింది. చివరకు తన డిగ్రీ కోల్పోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ సంఘటన గుజరాత్లో వెలుగు చూసింది. ఆమెను విచారించగా అసలు విషయం తెలిసి కళాశాల అధికారులతో పాటు తల్లిదండ్రులు అవాక్కయ్యారు. తన బాయ్‌ఫ్రెండ్ ఉత్తరాఖండ్‌కు వెకేషన్‌కు వెళ్లగా అతడి స్థానంలో పరీక్షలు రాసేందుకు హాజరైంది. థర్డ్ ఇయర్ బీకామ్ పరీక్షల్లో తన ప్రియుడి స్థానంలో డమ్మీ క్యాండిడేట్‌గా కూర్చుంది 24 ఏళ్ల యువతి. అయితే, పరీక్ష రాసే క్రమంలో పట్టుబడింది. ఇదీ జరిగింది.. అక్టోబర్‌లో జరిగిన బీకామ్ థర్డ్ఇయర్ పరీక్షల్లో ఒకరోజు అబ్బాయి స్థానంలో అమ్మాయి కూర్చింది. హాల్‌టికెట్‌లోనూ అమ్మాయి ఫోటో, పేరు ఉన్నాయి. ఎవరూ గుర్తించలేదు. కానీ, అదే హాల్లో పరీక్ష రాస్తున్న మరో విద్యార్థి అనుమానించాడు. ఆ స్థానంలో ప్రతిరోజు అబ్బాయి ఉంటాడని, ఆ రోజు అమ్మాయి ఉండటంపై ఇన్విజిలేటర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ యువతిని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ ఫెయిర్ అసెస్మెంట్ కన్సల్టేటివ్ కమిటీ ముందు హాజరుపరిచారు. ఆ కమిటీ విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది నిందితురాలు. ‘ఆ యువతి, యువకుడికి స్కూల్ నుంచే పరిచయం ఉన్నట్లు తెలిసింది. అయితే, పరీక్షలకు హాజరయ్యే విషయం వారి తల్లిదండ్రులకు తెలియదు.’ అని కమిటీ పేర్కొంది. విచారణ సందర్భంగా.. కంప్యూటర్లో హాల్‌టికెట్‌ను మర్చి పరీక్ష హాల్లోకి ప్రవేశించినట్లు ఒప్పుకుంది నిందితురాలు. ఇన్విజిలేటర్ రోజు మారతారు. విద్యార్థులతో పెద్దగా వారికి పరిచయం ఉండకపోవడంతో విద్యార్థులను గుర్తించలేరు. ఇదే ఆ యువతికి అనుకూలంగా మారింది. అసలు పరీక్షకు హాజరుకావాల్సిన అబ్బాయిని పిలిపించిన కమిటీ విచారించింది. తాను పరీక్ష రోజున ఉత్తరాఖండ్‌కు వెళ్లినట్లు తెలిపాడు. థర్డ్ఇయర్ బీకామ్ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో ఈ ప్లాన్ చేసినట్లు తెలిసింది. మరోవైపు.. ఎఫ్ఏసీటీ కమిటీ సిఫార్సుల మేరకు ఆ యువతి బీకామ్ డిగ్రీని, యువకుడి తొలి, రెండో ఏడాది పరీక్షలను సైతం రద్దు చేసినట్లు ఎఫ్ఏసీటీ సభ్యురాలు ఒకరు తెలిపారు. . దీంతో ఆ యువతి ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకునే ప్రమాదం తెచ్చుకుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
ఓయూ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల మొదటి, మూడో, అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో ఉంచినట్లు ఆయన చెప్పారు. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇంగ్లీష్, ఆర్కియాలజీ, ఉర్దూ, పర్షియన్, ఫిలాసఫీ, మరాఠీ విభాగాల్లో ఎంఏ, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంకాం ప్రధమ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
సివిల్స్, గ్రూప్-1కు అనుగుణంగా డిగ్రీ సిలబస్
హైదరాబాద్: సివిల్స్, గ్రూప్-1 వంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా డిగ్రీలోని సోషియాలజీ, సోషల్ వర్క్, ఆంత్రోపాలజీ సబ్జెక్టుల్లో మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా బుధవారం మండలి కార్యాలయంలో చైర్మ న్ పాపిరెడ్డి అధ్యక్షతన సిలబస్ సమీక్ష కమి టీ సమావేశం జరిగింది. ఈ కమిటీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఉన్నత విద్యా మండలి వైస్చైర్మన్లు వెంకటాచలం, మల్లేష్, ఇతర కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. డిగ్రీలో సోషియాలజీ, సోషల్‌వర్క్, ఆం త్రోపాలజీ సబ్జెక్టుల్లో తీసుకురావాల్సిన మార్పులను ఖరారు చేశారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ ఉం డాలని, ఇందుకోసం కొన్ని ప్రత్యేక పేపర్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ సబ్జెక్టులతో విద్యార్థి డిగ్రీ పూర్తి చేయగానే మానవ వనరుల విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిం చే విధంగా సిలబస్‌ను రూపొందించనున్నారు. సోషియాలజీలోని ఆప్షనల్స్‌ను పూర్తిగా మార్చుతున్నారు. సోషల్ వర్క్‌లో డిగ్రీ చేసిన విద్యార్థి ఎన్జీవోను ప్రారంభిం చేలా పాఠ్యాంశాలను అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఆంత్రోపాలజీలో తెలంగాణ గిరిజనులపై పాఠాలు పెట్టనున్నారు.