సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత విద్యా స్థాయి పాఠ్యాంశాల్లో మార్పులు చేసేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. తెలంగాణ విడిపోయిన నేపథ్యంలో పాఠ్యాంశాల్లో సీమాంధ్ర ప్రాంతం ముద్రను ప్రతిబింబించేలా పాఠ్యాంశాల్లో మార్పులకు కసరత్తు చేస్తోంది. సిలబస్ మార్పులపై గత జనవరిలోనే సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ప్రాథమిక విద్యాశాఖ పరిధిలోని సిలబస్ మార్పులపై రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ(ఎస్‌ఈఆర్టీ)కు, ఉన్నత విద్యాసంస్థల్లో సిలబస్ మార్పుపై వర్సిటీలకు బాధ్యతలు అప్పగించారు. ప్రాథమికస్థాయి పాఠ్యాంశాల్లో మార్సులకు సంబంధించి ఎస్‌ఈఆర్టీ ఆధ్వర్యంలోని కమిటీ తాత్కాలిక నివేదికను కూడా సిద్ధం చేసింది. దీనిని ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందించనుంది. రాష్ట్ర విభజనానంతరం తెలంగాణ ప్రాంతం విడివడినందున ప్రాథమిక స్థాయి పాఠ్యాంశాల్లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంత వివరాలను పొందుపర్చనున్నారు.
పాఠ్యాంశాల్లో ‘సీమాంధ్ర’ముద్ర!
Published Thu, Feb 26 2015 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement