న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి సాంఘిక శాస్త్రం (సోషల్ సైన్స్) సబ్జెక్ట్ నుంచి ఐదు అధ్యాయాలను తీసేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది. ప్రజాస్వామ్య సవాళ్లు (చాలెంజెస్ టు డెమోక్రసీ), రాజకీయ పోరాటాలు, ఉద్యమాలు (పొలిటికల్ స్ట్రగుల్స్ అండ్ మూవ్‌మెంట్స్), ప్రజాస్వామ్యం, భిన్నత్వం (డెమోక్రసీ అండ్ డైవర్సిటీ), అడవులు, వన్యప్రాణులు (ఫారెస్ట్ అండ్ వైల్డ్‌లైఫ్), నీటి వనరులు (వాటర్ రిసోర్సెస్) అనే ఐదు అధ్యాయాలను సాంఘిక శాస్త్రం నుంచి సీబీఎస్‌ఈ తొలగించనుంది. 2021లో పీసా (ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్‌మెంట్)లో పాల్గొనాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించిందనీ, అందుకు తగ్గట్లుగా విద్యార్థుల మూల్యాంకన పద్ధతుల మార్చాల్సి ఉందని గత నెలలోనే పాఠశాలలకు సీబీఎస్‌ఈ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment