SOCIAL STUDIES
-
గ్రీన్విచ్ కంటే ముందే మనకో కాలమానం!
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆరో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానం కంటే ముందే మన దేశానికి సొంత కాలమానం ఉందని, దీనిని ‘మధ్య రేఖ’ అని పిలుస్తారని పేర్కొంది. బీఆర్ అంబేద్కర్ అనుభవాలను, ఎదుర్కొన్న కుల వివక్ష పాఠాన్ని కూడా కుదించింది. హరప్పా నాగరికతను కొత్త పాఠ్య పుస్తకంలో ‘సింధు–సరస్వతి’గా పేర్కొంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాల విద్య కోసం కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్–2023కు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ కొత్త సిలబస్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో 6వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానమే ప్రధాన కాలమానం కాదని, దానికంటే శతాబ్దాల ముందు యూరప్, భారత్‌లకు సొంత కాలమానాలున్నాయని పేర్కొంది. దానిని మధ్య రేఖ (మిడిల్ లైన్) అని పిలిచేవారని, అది ఖగోళ శాస్త్రానికి ప్రసిద్ధి చెందిన ఉజ్జయినీ నగరం (ఉజ్జయిన్) గుండా వెళ్లిందని వివరించింది. అలాగే కొత్త పాఠ్యపుస్తకంలో ‘భారత నాగరికత ప్రారంభం’ అనే అధ్యాయంలో సరస్వతి నదికి ప్రముఖ స్థానం ఉందని, ప్రజలను వర్ణాలుగా విభజించారని, శూద్రులను, స్త్రీలను వేదాలను అధ్యయనం చేయనీయలేదని పాత పాఠ్య పుస్తకంలో ఉండగా.. వ్యవసాయదారుడు, నేత, కుమ్మరి, బిల్డర్, వడ్రంగి, వైద్యుడు, నర్తకి, మంగలి, పూజారివంటి వృత్తులను వేదాల్లో పేర్కొన్నట్లు కొత్త పుస్తకాల్లో పేర్కొంది. పాత పుస్తకంలోని నాలుగు అధ్యాయాల్లో ఉన్న చాణక్యుడి అర్థశాస్త్రం, గుప్తులు, పల్లవులు, చాళుక్యుల రాజవంశాలు, అశోకుడు చంద్రగుప్త మౌర్యుల రాజ్యాల కథనాలను కొత్త పుస్తకంలో తొలగించింది. -
టెన్త్ సోషల్ నుంచి 5 చాప్టర్ల తొలగింపు
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి సాంఘిక శాస్త్రం (సోషల్ సైన్స్) సబ్జెక్ట్ నుంచి ఐదు అధ్యాయాలను తీసేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. ప్రజాస్వామ్య సవాళ్లు (చాలెంజెస్ టు డెమోక్రసీ), రాజకీయ పోరాటాలు, ఉద్యమాలు (పొలిటికల్ స్ట్రగుల్స్ అండ్ మూవ్మెంట్స్), ప్రజాస్వామ్యం, భిన్నత్వం (డెమోక్రసీ అండ్ డైవర్సిటీ), అడవులు, వన్యప్రాణులు (ఫారెస్ట్ అండ్ వైల్డ్‌లైఫ్), నీటి వనరులు (వాటర్ రిసోర్సెస్) అనే ఐదు అధ్యాయాలను సాంఘిక శాస్త్రం నుంచి సీబీఎస్ఈ తొలగించనుంది. 2021లో పీసా (ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్)లో పాల్గొనాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించిందనీ, అందుకు తగ్గట్లుగా విద్యార్థుల మూల్యాంకన పద్ధతుల మార్చాల్సి ఉందని గత నెలలోనే పాఠశాలలకు సీబీఎస్ఈ తెలిపింది. -
ఆ పుస్తకాలు నిషేధించిన పాక్
ఇస్లామాబాద్: పాక్ ప్రభుత్వం పంజాబ్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాల్లో సోషల్ స్టడీస్ పుస్తకాలపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పుస్తకాల్లో ముద్రించిన పాక్ మ్యాప్‌లో కశ్మీర్ భూభాగం భారత్‌లో అంతర్భాగమని చూపిస్తుండటంతో వాటిపై నిషేధానికి ఆదేశాలు జారీ చేసింది. 2, 4, 5, 7, 8 తరగతులు విద్యార్థులకు సంబంధించిన సోషల్ స్టడీస్ పుస్తకాల్లో వివాదాస్పద, అభ్యంతరకరమైన విషయాలు, ముఖ్యంగా పాక్ మ్యాప్‌ల్లో కశ్మీర్ భారత్‌లో ఉన్నట్లు గుర్తించినట్లు పంజాబ్ కరికులమ్, టెక్స్ట్‌బుక్ బోర్డు(పీసీటీబీ) ఒక ప్రకటనలో పేర్కొంది. పంజాబ్ ప్రావిన్స్‌లో తక్షణమే ఆ పుస్తకాలను నిషేధించాలని పీసీటీబీ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ ఖయ్యూమ్ ఆయా పాఠశాలలకు సర్క్యూలర్ జారీ చేశారు. విద్యాసంస్థల నిర్వాహకులతో పాటు ఈ ఘోర తప్పిదం చేసిన పబ్లిషర్స్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని లాహోర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ సంస్థ పీసీటీబీ పేర్కొంది. -
మార్చి 28న టెన్త్ సోషల్–1 పరీక్ష!
హైదరాబాద్: వచ్చే ఏడాది నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా మార్చి 28వ తేదీన సోషల్ స్టడీస్ పేపరు–1 పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయానికి వచ్చింది. మార్చి 29వ తేదీన ఆ పరీక్షను నిర్వహిస్తామని ఇదివరకు షెడ్యూలును జారీ చేసినా ఆ రోజు ఉగాది పండుగ ఉండటంతో ముందుగానే (28వ తేదీన) పరీక్షను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు మార్పు చేసిన షెడ్యూలుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి ఫైలు పంపించింది. నాలుగైదు రోజుల్లో దీనిపై ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడనుంది. -
ఊరు ఉంది
జ్ఞాపకం మూడుంపావు అవుతోంది. లాస్ట్ పిరియడ్ అంజయ్య మాస్టారు గారి సోషల్ క్లాస్. బుర్రలో రకరకాల ఆలోచనలు. ఎలా కాళీని చూడాలి. కాళి తప్ప మనసుకు ఏమీ పట్టడం లేదు. ఆ... ఐడియా వచ్చింది. సార్.. అని పిలుస్తూ నెమ్మదిగా అంజయ్య మాస్టారి దగ్గరకు వెళ్లాను. స్టాఫ్ రూమ్‌లో ఉన్నారు. కొంచెం మంచి అభిప్రాయమే ఉంది కదా మనమంటే, ‘ఏంటమ్మా’ అన్నారు ప్రసన్నంగా. ‘తలనొప్పిగా ఉంది సార్. మీరు పర్మిషన్ ఇస్తే లాస్ట్ పావు గంట ఇంటికి వెళ్తాను’ అన్నాను. అరగంట ఆయన క్లాస్ వింటాననే సరికి వాత్సల్యం అంతా కళ్లల్లో ప్రకటిస్తూ సరేనమ్మ వెళ్లు అన్నారు. అనందభాష్పాలు రాలడం ఒక్కటే తక్కువ. హమ్మయ్య ఇవాళ కాళిని చూడొచ్చు అనుకోగానే ఎక్కడలేని హుషారు వచ్చింది. ఉత్సాహంగా క్లాస్‌కి అటెండ్ అయ్యి, సోషల్ స్టడీస్‌లో కూడా డౌట్స్ అడిగి వెళ్లాల్సిన టైమ్ దగ్గర పడగానే నీరసంగా ముఖం పెట్టి కూర్చున్నాను. నా ముఖం చూసే సరికి సర్కి గుర్తొచ్చింది. ‘ఇంక వెళ్లమ్మా’ అన్నారు. ఓపిక లేనట్లు లేచి బుక్స్ తీసుకుని బయల్దేరాను. ఏమనుకున్నారో.. నేనూ వస్తానమ్మ. పదా.. నాన్నగారిని కలిసి చాలా రోజులు అయ్యింది అన్నారు. నా గుండె ఢాం అంది. బిత్తర చూపులు చూశాను. కారణం తెలిసిన నెప్పల్లి పద్మ నా ముఖం చూసి కిసుక్కున నవ్వింది. మిగతా పిల్లలు అర్థం కాక అయోమయంగా, అసూయగా చూస్తున్నారు. గొంతులోంచి మాట రావట్లేదు. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు కదా! కాళి ఈ ఊళ్లో ఉన్నన్నాళ్లూ ఈ అబద్ధాలు తప్పవు. ఇంతలో వచ్చాడు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఆర్తత్రాయ పరాయణుడు. మా స్కూల్ అటెండర్ నోటీసు పట్టుకుని. ఇదే ఛాన్స్ అనుకుని ఛలో... స్కూల్ బయటి వరకు నెమ్మదిగా నడుచుకుని వచ్చాను. పరుగు. ఇంక ఒకటే పరుగు. తెలిసినవాళ్లు ‘డాక్టరు గారి అమ్మాయి ఏంటి ఇలా పరుగెడుతోంది’ అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీళ్లకేం తెలుసు. ఇంకా నాలుగు రోజుల్ల్లో కాళి వెళ్లిపోతాడని. ఆయాసపడుతూ వచ్చాను గేట్ దగ్గరికి. నన్ను చూడగానే ఏసు గేట్ తెరిచాడు. లాస్ట్ చెయిర్ ఖాళీగా ఉంటే కూర్చున్నాను. హమ్మయ్య ఇంకా కొంచెం టైమ్ ఉంది. జయసుధ, జయప్రదల క్లైమాక్స్ డాన్స్ పాట ఇంకా మొదలవలేదు. ఎన్.టి.రామారావు కాళీని పిలవడానికి టైమ్ ఉంది. ఇదంతా.. అడవిరాముడు సినిమాలో కాళి... కాళి... కాళీ అనే పాట గురించి. ఏనుగుల గుంపు వచ్చి ఎన్.టి.ఆర్.కి హెల్ప్ చేసే పాట. ఇంతలో పాట స్టార్ట్ అయింది. అదిగో అనుకున్న టైమ్ వచ్చింది. పిలిచేశాడు ఎన్.టి.ఆర్. కాళీ అని. మైమరచి పోయి చూస్తున్నాను. ఒళ్లు గగుర్పొడిచే సీన్. ఏనుగుల హెల్ప్‌తో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కాళిని కరువు తీరా చూసి ఏనుగునెక్కిన ఆనందంతో ఇంటికి వచ్చాను. ఆ పాట కోసం ఇరవై నాలుగుసార్లు సినిమా మొత్తం చూశాను. లాస్ట్ లాస్ట్‌లో కేవలం పాట కోసం వెళ్లేదాన్ని. కాకపోతే లాస్ట్ పిరియడ్ అంజయ్య మాస్టారితో ఇబ్బంది. మంచి మాస్టారు. మల్లెపువ్వులాంటి పంచాలాల్చీలో బక్క పలుచని రూపం. నోరు విప్పితే ‘సంస్కృతం’. ఎక్కువగా అబ్బాయిలతోనే ఆ భాషలో మాట్లాడి వాళ్లని ఎడ్యుకేట్ చేసేవాళ్లు. ఇంకా నాలుగు రోజుల్లో కొత్త సినిమా వేస్తారు, అడవిరాముడు తీసేస్తారు అనగానే మధ్యాహ్నం భోజనానికి వచ్చి ఇంక స్కూల్‌కి వెళ్లేదాన్ని కాదు. నాతో పాటు నా ఫ్రెండ్స్ నగరాజకుమారి, నెప్పల్లి పద్మ. ఏడుకొండలవాడ... వెంకటరమణ అనే పాట వినపడగానే వెళ్లి పోయేవాళ్లం. డాక్టర్ గారి అమ్మాయిని కదండీ, టికెట్స్ ఏమీ తీసుకోనక్కర్లా. అందులోనూ మ్యాట్నీ షో. పైగా గేట్దగ్గర మన ఆత్మబంధువు ఏసు ఉంటాడు. చూడగానే నవ్వుతూ లోపలికి పంపేవాడు. ఇంటర్వెల్లో సోడా తెచ్చేవాడు. ఎప్పుడైనా ఫస్ట్ షోకి వెళ్లి నిద్రపోతే లేపి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చేవాడు. కాళిని కరువు తీరా చూసి ఏనుగు ఎక్కినంత ఆనందంగా ఇంటికి వచ్చేదాన్ని. ఇప్పుడు ఎన్.టి.ఆర్. లేడు. అంజయ్యగారు లేరు. ఏసు లేడు. కాళిని పిలిస్తే ఏనుగొచ్చి హెల్ప్ చెయ్యడం అనే కాన్పెప్టుని ఎంజాయ్ చేసే అమాయకపు జనాలూ లేరు. కానీ ఊరు ఉంది. ఊరిని తలుచుకోగానే నిండే మనసు, వచ్చే ఆనందము ఉంది. - కవిత -
మెరుగైన స్కోర్‌కు మార్గం చూపే.. సాంఘిక శాస్త్రం
పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షలో ఎక్కువస్కోరింగ్కు అవకాశం కల్పించే విభాగం.. సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్). ఎందుకంటే చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం,అర్థ శాస్త్రం ఇలా నాలుగు భాగాలుగా ఉండే సాంఘిక శాస్త్రం నుంచి ఎక్కువ ప్రశ్నలువచ్చే అవకాశం ఉంది. వీటిని ప్రిపేర్ కావడం కూడా సులభమే. తద్వారా ఈ అంశాల్లో 100 శాతం స్కోర్ సాధించవచ్చు.ఈ నేపథ్యంలో సాంఘిక శాస్త్రం ప్రిపరేషన్‌కు సంబంధించి ఎటువంటి వ్యూహాలుఅనుసరించాలి, ముఖ్యమైన అంశాలు, ప్రశ్నల సరళి తదితరాలపై విశ్లేషణ.. భారతదేశ చరిత్ర: భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా చదవాలి. అవి.. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. ఈ మూడు యుగాల్లోని భారతదేశ సంస్కృతిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా పరిపాలించిన రాజులు-వంశాలు, ఆనాటి రాజకీయ-సాంఘిక పరిస్థితులు, మత, సాంస్కృతిక, సాహిత్య అంశాలపై దృష్టిసారించాలి.ప్రాచీన చరిత్ర: ప్రాచీన శిలాయుగం, మధ్య శిలా యుగం, కొత్త రాతి యుగ అంశాలను చదవాలి. ఈ క్రమంలో సింధు నాగరికత, ఆర్య నాగరికతలకు సంబంధించిన విషయాలను క్షుణ్నంగా ప్రిపేర్ కావాలి. క్రీ.పూ. 6వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చిన నూతన మతాలు.. జైనం, బౌద్ధంతోపాటు మహావీరుడు, గౌతమ బౌద్ధుడు-వారి ప్రవచనాలు, సామాజిక మార్పులకు అవి ఏవిధంగా కారణమయ్యాయో విశ్లేషించుకుంటూ చదవాలి. మగధ, మౌర్య సామ్రాజ్యాలు, పారశీక, గ్రీకు దండయాత్రలు, సంగం యుగం నాటి సాహిత్యం, శాతవాహన రాజ్యాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆనాటి రాజులు, సాహిత్యం, రచయితలు, బిరుదులను వివరంగా అధ్యయనం చేయాలి.మధ్యయుగ చరిత్ర: సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొగల్ పాలన సంబంధిత అంశాలను బాగా చదవాలి. ముఖ్యంగా ఆనాటి సాహిత్యం, శిల్ప కళ, వాస్తు అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ఇదేకాలంలో దక్షిణ భారతదేశంలో రాష్ట్రకూటులు, కాకతీయులు, హోయసలులు, పాండ్యులు తదితర రాజ్యాల కాలంనాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను క్షుణ్నంగా చదవాలి. అంతేకాకుండా భక్తి ఉద్యమం, సూఫీ మతం గురించి కూడా తెలుసుకోవాలి. ఆధునిక భారత చరిత్ర: క్రీ.శ.1498లో వాస్కోడిగామా కాలికట్ (కేరళ)లో అడుగుపెట్టిన తర్వాత భారతదేశంలోకి యూరోపియన్ల రాక మొదలైంది. నాటి నుంచి 1947 వరకు నెలకొన్న పరిస్థితులను చదవాలి. ఈ క్రమంలో బ్రిటిష్ పాలన, సిపాయిల తిరుగుబాటు, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో-మహారాష్ట్ర యుద్ధాలు, సాంఘిక సంస్కరణోద్యమం సంబంధిత అంశాలపై దృష్టి సారించాలి. భూగోళ శాస్త్రం: ముందుగా ప్రాథమిక భావనలు.. సౌర కుటుంబం, గ్రహాలు, భూమి, భూ చలనాలు, అక్షాంశాలు-రేఖాంశాలు, గ్రహణాలు, భూస్వరూపాలు, శీతోష్ణస్థితి, పర్వతాలు, భూకంపాలు, సముద్రాలు గురించి తెలుసుకోవాలి. ఈ విభాగంలో భారతదేశ ప్రాంతీయ భౌగోళిక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఈ క్రమంలో భారతదేశ ఉనికి, భౌతిక రూపురేఖలు, శీతోష్ణస్థితి, అడవులు, మృత్తికలు, నదులు, వ్యవసాయం, పంటలు, నీటిపారుదల వ్యవస్థ, ప్రాజెక్ట్‌లు, రవాణా సమాచార సాధనాలు, జనాభా, ఓడరేవులు, పరిశ్రమలు, ఖనిజాలు, దర్శనీయ ప్రదేశాలు వంటి అంశాలను విస్తృతంగా చదవాలి. ఈ అంశాలను అట్లాస్‌తో సమన్వయం చేసుకుంటూ చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పాలిటీ: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికతత్వం, మానవ హక్కులు, సమాచార హక్కుచట్టం, భారత రాజ్యాంగంలోని ముఖ్య ఘట్టాలను బాగా చదవాలి. అంతేకాకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లోని శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ, వాటి మధ్య సంబంధాన్ని విశ్లేషణాత్మకంగా చదవాలి. వీటిని సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. అదేవిధంగా స్థానిక పరిపాలన వ్యవస్థ, పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవస్థ వాటి పనితీరు గురించి అధ్యయనం చేయాలి. అర్థశాస్త్రం: ముందుగా ప్రాథమిక భావనలను అవగాహన చేసుకుంటే మిగిలిన అంశాలను చదవడం సులభంగా ఉంటుంది. ఈ క్రమంలో జాతీయాదాయం, తలసరి ఆదాయం, నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాలు వంటి అంశాల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా ఉత్పత్తి, మారకం, పంపిణీ సమస్యలు, బడ్జెట్, ద్రవ్యం, బ్యాంకింగ్ వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు, వాటి కాలాలు, ఫలితాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఏం చదవాలి? ఈ అంశాలకు సంబంధించి 6 నుంచి 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకాలను చదవాలి. 6 నుంచి 10వ తరగతి వరకు ఉండి ఇంటర్మీడియెట్‌లో పునరావృతమయ్యే అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆయా అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. గత ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్ బిట్స్‌ను ఎక్కువగా సాధన చేయాలి. తద్వారా ఏయే అంశాల నుంచి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారనే విషయంపై అవగాహన ఏర్పడుతుంది. గతంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు రుగ్వేదంలో అత్యంత సాధారణమైన నేరంగా పేర్కొంది-పశువులను దొంగిలించడం పల్లవులు ఎక్కడి నుంచి పరిపాలించారు-కాంచీపురం విష్ణుకుండినుల రాజధాని-దెందులూరు వాస్కోడిగామా ఏ దేశస్థుడు-పోర్చుగల్ జలియన్ వాలాబాగ్ ఏ నగరంలో ఉంది- అమృత్సర్ శ్రీకృష్ణదేవరాయలు ఎవరితో స్నేహసంబంధాలు కొనసాగించాడు-పోర్చుగీసు వారితో నెప్ట్యూన్ వాతావరణం ఏ గ్రహ వాతావరణానికి సమానంగా ఉంటుంది - యురేనస్ -
పాఠ్య పుస్తకాల్లో ‘నల్లగొండ’
మన పాఠ్యపుస్తకాలు.. మన చరిత్ర నాగార్జున్ సాగర్ ప్రాజెక్టు, బేతవోలు చెరువుల వివరాలు కవులు, పోరాట యోధుల జీవిత విశేషాలు 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రంలో ప్రస్తావన చిలుకూరు: సమైక్య పాలనలో మరుగున పడిపోయిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కరువులు, కళాకారులు, పోరాటయోధుల జీవన గాథలు ఇకపై మన విద్యార్థులు పాఠ్యాంశాలుగా చదువుకోనున్నారు. ఈ విద్యాసంవత్సరం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పాఠ్య పుస్తకాల్లో జిల్లాకు చెందిన ప్రముఖ ప్రాజెక్టులు, ప్రాంతాల విశేషాలు, కవులు, కళాకారులు, తెలంగాణ పోరాట యోధుల జీవిత విశేషాలను పాఠ్యాంశాలుగా పొందుపరిచారు. 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో వీటిని చేర్చారు. చిలుకూరు మండలం బేతవోలు చెరువు, పోరాట యోధులు ఆరుట్ల కమలాదేవి, ఉప్పల మల్సూరు, కవులు సుద్దాల హనుమంతు, భాస్కర్‌రెడ్డి తోపాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు, పోచంపల్లి చేనేతను ప్రస్థావనకు తెచ్చారు. వీటి వల్ల భవితరం పౌరులైన విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునే వీలుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. చేనేత కార్మికులకూ స్థానం జిల్లాలో చేనేత వస్త్రాలకు పేరుగాంచిన భూదాన్‌పోచంపల్లి చేనేత కార్మికులు గురించి 7వ తరగతి తెలుగు వాచకంలో వివరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టై అండ్ డై చీరలు ఎలా నేస్తారు, కార్మికుల నైపుణ్యాన్ని వివరించారు. పోరాట యోధుడు మల్సూర్ ప్రస్థావనం.. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఉప్పల మల్సూర్ ప్రస్థావ 6వ తరగతి తెలుగు పుస్తకంలో ఉంది. మల్సూర్ జీవన విధానం, రాజకీయ జీవితం, రైతాంగ పోరాటంలో ఆయన పాత్రను వివరించారు. ‘మిషన్ కాకతీయ’లో బేతవోలు చెరువు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన మిషన్ కాకతీయ చెరువుల అభివృద్థి పథకాన్ని వివరిస్తూ చిలుకూరు మండలం బేతవోలు చెరువు గురించి 7వ తరగతి సాంఘిక శాస్త్రంలో చెప్పారు. ఈ చెరువుకు సంబంధించిన పూర్తి వివరా లు పాఠ్యాంశంలో పొందుపరిచారు. చెరువు పేరు, ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మిం చారు, ఆయకట్టు తదితర వివరాలు ఉన్నాయి. ప్రముఖ కవి భాస్కర్‌రెడ్డి జిల్లాలోని అంకుశాపురం గ్రామానికి చెందిన ప్రముఖ కవి బద్దం భాస్కర్‌రెడ్డి(చెరబండరాజు) గురించి 6వ తరగతి తెలుగులో పుస్తకంలో ప్రస్థావించారు. భాస్కర్‌రెడ్డి ఉపాధ్యాయుడిగా, కవిగా చేసిన సేవలు, రాసిన విప్లవ గేయాలు, కథలు, నవలలను వివరించారు. గమ్యం, ముట్టడి, పల్లవి లాంటి కవితా సంకలనాలు, కత్తిపోటు పాటలు తదితర వివరాలు తెలియజేశారు. ఆరుట్ల కమలాదేవి జీవిత చరిత్ర ఆలేరుకు చెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు ఆరుట్ల కమలాదేవి గురించి 7వ తరగతి తెలుగు పుస్తకంలో ప్రస్తావించారు. ఉద్యమ స్ఫూర్తి, బాల్య జీవితం, బాల్య వివాహాలు, రాజకీయ అవగాహన, ఎమ్మెల్యేగా ఎన్నిక తదితర అంశాలను తెలియజేస్తూ పాఠ్యాంశాన్ని రూపొందించారు. సుద్దాల హనుమంతు గుండాల మండలం సుద్దాలకు చెందిన సుద్దాల హనుమంతు గురించి 6వ తరగతి తెలుగు వాచకంలో పొందుపరిచారు. ఆయన రాసిన చైతన్య గీతాలు, బుర్రకథలు, గొల్లసుద్దులు, పిట్టల దొర తదితర రచనల గురించి వివరించారు. నాగార్జున్‌సాగర్ గురించి... 6వ తరగతి తెలుగు వాచకంలో నాగార్జున సాగర్ గురించి విద్యార్థులకు తెలియజేశారు. లేఖ పాఠ్యాంశంలో నాగార్జున సాగర్ గురించి పూర్తి వివరాలు పొందుపరిచారు. పొడవు, నీటి సామర్థ్యం, ప్రకృతి అందాలు, సాగర్ చుట్టు పక్కల చూడదగిన ప్రదేశాలు, ప్రాజెక్టు నిర్మాణ శైలి తదితర అంశాలను విద్యార్థులకు పాఠ్యాంశంగా అందించారు. విద్యార్థులకు ఎంతగానో ఉపయోగం పాఠ్యపుస్తకాల్లో జిల్లాకు అధిక ప్రాధన్యం ఇవ్వడం సంతోషం. దీని వల్లన జిల్లా యొక్క ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోగలరు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని పలు అంశాలు పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి. - చలసాని శేఖర్, ప్రధానోపాధ్యాయులు, జెడ్పీహెచ్ఎస్ చిలుకూరు. -
పాఠ్య పుస్తకాల్లో మార్పుల ఖరారెప్పుడు?
ఒకటి నుంచి పదో తరగతి వరకున్న తెలుగు పాఠ్య పుస్తకాలు, 6, 7, 8, 9,10 తరగతుల్లో సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకాల సిలబస్‌లో తెలంగాణ తరహా మార్పులు తీసుకొస్తూ రూపొందించిన కొత్త పుస్తకాలు ఇంకా ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు పరిశీలనలోనే ఉన్నాయి. సిలబస్ మార్పుల కమిటీ రెండు నెలల పాటు కసరత్తు చేసి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వివిధ అంశాలను తొలగించింది. తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలను చేర్చింది. ఆ మార్పులతో కూడిన కొత్త పుస్తకాలను నెల రోజుల కిందటే ముఖ్యమంత్రి ఆమోదానికి పంపినా.. ఇంతవరకు మోక్షం లభించలేదు. దీంతో అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. మార్పు చేసిన పుస్తకాలను ముద్రించి జూన్ 12లోగా పాఠశాలలకు అందజేయాల్సి ఉంది. ఇంకా ఆలస్యమైతే సకాలంలో విద్యార్థులకు ఈ పుస్తకాలను అందించలేమోననే ఆందోళన మొదలైంది. సీఎం త్వరగా స్పందించి పుస్తకాల్లో మార్పులను ఖరారు చేయాలని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ప్రధాన మార్పులివీ... - అన్ని తరగతుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్ర పటాలున్న చోట తెలంగాణ చిత్రం పటాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర ఉన్న చోట తెలంగాణ సమగ్ర చరిత్ర ఉండనుంది. భారత దేశ పటంలో ఆంధ్రప్రదేశ్‌ను, తెలంగాణను వేరుగా చేస్తారు. - 6, 7, 8 తరగతుల్లోని సాంఘిక శాస్త్రంలో భారీగా మార్పులు రానున్నాయి. 9వ తరగతిలో రెండు పాఠాలు, టెన్త్‌లో ఒక పాఠంలో మార్పులు చేశారు. - 6, 7, 8 తరగతుల్లో తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, పరిసర రాష్ట్రాలు, వాటితో సంబంధాలపై పాఠాలు ఉండనున్నాయి. నీటి వనరులు, నదులు, ఉపనదులు, చెరువులు, పంటలకు ప్రధాన సాగునీటి ఆధారాలు, ఒకప్పటి చెరువులు, వాటి ప్రాధాన్యం, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయకు చోటు కల్పిస్తున్నట్లు తెలిసింది. - తెలంగాణ ఉద్యమ చ రిత్ర, ఆంధ్రప్రదేశ్ అవ తరణకు ముందు.. ఆ తర్వాతి అంశాలు, ఉద్యమంలో కేసీఆర్, టీఆర్ఎస్ పాత్రపై పాఠ్యాంశాలు, నిజాం పాలన, రజాకార్లు, పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ అవతరణకు చోటు, సాయుధ పోరాట యోధులు, వారి చరిత్ర, ప్రత్యేక తెలంగాణ పోరాటానికి దారి తీసిన పరిస్థితులను పాఠ్యాంశాలుగా చేర్చుతున్నారు. - తెలంగాణ వైతాళికులైన ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ, కొమురం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీ తదితరుల జీవితాలు, తెలంగాణ రాష్ట్రం కోసం వారి కృషిపైనా పాఠ్యాంశాలు ఉండనున్నట్లు తెలిసింది. రామాయణం, భారతం వంటి ఇతిహాసాలపై గతంలో ఉన్న పాఠ్యాంశాలను తొలగిస్తున్నారన్న వదంతులు రాగా... వాటిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం వాటిని అలాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. -
జనాభా.. నిర్ధారించే అంశాలు.. 2011 లెక్కలు
సోషల్ స్టడీస్ - జాగ్రఫీ ఒక దేశ జనాభా పెరుగుదల అభిలషణీయ స్థాయి కంటే తక్కువగా ఉంటే అది దేశ ఆర్థికాభివృద్ధికి సూచికగా భావించవచ్చు. అందుకే ప్రఖ్యాత జనాభా శాస్త్రవేత్త ‘ఏడ్విన్ కానన్’ అన్నట్లు ‘భూమిపైన పుట్టే ప్రతీ బిడ్డ ఒక అభివృద్ధి కారకం’ అవుతుంది. ఆ విధంగా కాకుండా జనాభా అభిలషణీయ స్థాయిని దాటి పెరుగుతూ పోతే అది దేశ ఆర్థికాభివృద్ధిని హరించి వేస్తుంది. జనాభా సిద్ధాంతకర్త ‘మాల్థస్’ చెప్పినట్లు ‘భూమిపై పుట్టే ప్రతీ బిడ్డ ఆర్థికంగా నరకాన్ని పెంపొందించే వాడవుతాడు. జనాభా 50 లక్షలు: క్రీ.పూ. 8000 నాటికి ప్రపంచ జనాభా 50 లక్షలు. అంటే ప్రతీ 1000 చ.కి.మీ.ల భూమిపై 32 మంది మాత్రమే నివసించే వారు. ఈ జనాభా క్రీ.శ. 1850 వరకు 100 కోట్లకు చేరుకుంది. క్రీ.శ. 2000లో 600 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా ప్రస్తుతం సుమారు 720 కోట్లు. ఇది క్రీ.శ. 2050 నాటికి 1000 కోట్లకు చేరవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. మొదటి సారి స్వీడన్లో: ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్రీ.శ. 1748లో స్వీడన్లో జనాభా లెక్కలను సేకరించడం ప్రారంభించారు. అదేవిధంగా కాలానుగుణంగా వివిధ దేశాల్లో జనాభా లెక్కలను ఏదైనా ప్రాధికార సంస్థ ద్వారా సేకరించే పద్ధతి అమల్లో ఉంది. ఆ గణాంకాల ఆధారంగా భవిష్యత్ ప్రణాళికలను, పథకాలను నిర్మాణాత్మకంగా రూపొందించి అభివృద్ధికి బాటలు వేస్తారు. జన గణన ఆధారంగా నిర్ధారించే అంశాలు.. జన సాంద్రత: సగటున ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జనసంఖ్యను జన సాంద్రత అంటారు. జనసాంద్రత పరిమాణం ద్వారా జనాభా ఎక్కడ అధికంగా లేదా తక్కువగా కేంద్రీకృతమైందో తెలుసుకోవచ్చు. ప్రస్తుత ప్రపంచ జన సాంద్రత 41 మంది.అక్షరాస్యత రేటు: దేశంలో ఏదైనా ఒక భాషను చదవగల, రాయగల ప్రజల సంఖ్యను అక్షరాస్యత అంటారు. ఏడు సంవత్సరాల వయసు పైబడిన మొత్తం జనాభాతో అక్షరాస్యుల సంఖ్యను భాగిస్తే అక్షరాస్యత రేటు వస్తుంది. దీని ఆధారంగా దేశ విద్యా, వైజ్ఞానిక అభివృద్ధి స్థాయిని అంచనా వేయవచ్చు. జనన రేటు: ప్రతీ 1000 మంది జనాభాకు పుట్టిన సగటు జననాల సంఖ్య. మరణ రేటు: ప్రతీ 1000 మంది జనాభాకు మరణించిన సగటు జన సంఖ్య. శిశు మరణాల రేటు: పుట్టిన ప్రతీ 1000 మంది పిల్లల్లో ఏడాదిలోపు వయసులోనే మరణించే సగటు పిల్లల సంఖ్య. జనాభా పెరుగుదల (వృద్ధి)రేటు: గతం జనాభా లెక్కల ప్రకారం వచ్చిన మొత్తం జనాభా.. ప్రస్తుత గణాంకాల ద్వారా తెలిసిన మొత్తం జనాభాతో పోల్చితే ఎంత శాతం పెరిగిందో తెలుసుకోవడానికి పెరుగుదల రేటు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా వార్షిక వృద్ధిరేటు 1.7 శాతం. భారతదేశం - జనాభా భారతదేశంలో మొదటిసారిగా క్రీ.శ. 1872లో లార్డ మేయో వైశ్రాయ్‌గా ఉన్న సమయంలో జనాభాను లెక్కించారు. ఈ గణన వివిధ ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో జరిగింది. వైశ్రాయ్ లార్డ రిప్పన్ హయాంలో మాత్రం క్రీ.శ. 1881లో దేశం మొత్తంమీద ఏకకాలంలో జనగణన చేశారు. అప్పటి నుంచి (1881) ప్రతీ పది సంవత్సరాలకోసారి క్రమం తప్పకుండా జన గణన చేస్తున్నారు. 2011లో నిర్వహించిన జనగణన మొత్తం మీద 15వది కాగా స్వతంత్ర భారతదేశంలో 7వది. ప్రపంచ భూభాగంలో కేవలం 2.4 శాతం విస్తీర్ణం కలిగిన భారతదేశం (భూభాగ విస్తీర్ణంలో 7వ పెద్ద దేశం) ప్రపంచ జనాభాలో మాత్రం 17.5 శాతం వాటాను కలిగి ఉంది (జనాభాలో రెండో పెద్ద దేశం). 2011 లెక్కలు: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని భారత రిజిస్ట్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ ఆధ్వర్యంలో జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. 2011 జనాభా లెక్కలు (సెన్సస్) ఆ సంవత్సరం మార్చి 1 వరకు గల జన సంఖ్యను తెలుపుతాయి. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 9, 2011న ప్రారంభమైంది. ఈ సెన్సస్ ప్రకారం.. మొత్తం జనాభా 21,07,26,932. వీరిలో పురుషుల సంఖ్య 62.39 కోట్లు (51.6 శాతం), మహిళల సంఖ్య 58.58 కోట్లు (48.4 శాతం). మొత్తం గ్రామీణ జనాభా 83.36 కోట్లు (68.8 శాతం), పట్టణ జనాభా 37.71కోట్లు (31.2 శాతం). 2001-11 మధ్య జనాభా పెరుగుదల 18.196 కోట్లు (17.7శాతం). జనాభా వార్షిక వృద్ధిరేటు 1.64 శాతం. ఐక్యరాజ్యసమితి అంచనా మేరకు 2045 నాటికీ భారతదేశం, చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుంది. గొప్ప విభాజక సంవత్సరం: దేశంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటు నమోదైన దశాబ్దం 1961-71. ఆ సమయంలో 24 శాతం జనాభా పెరిగింది. 1911-21 దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా (-0.31 శాతం) నమోదైంది. అందుకే 1921 సంవత్సరాన్ని మన దేశ జనాభా పరిణామ క్రమంలో ‘గొప్ప విభాజక సంవత్సరం’గా గుర్తించారు. భారత జనాభా అధికారికంగా 2000, మే 11న 100 కోట్లకు చేరుకుంది. అందుకు గుర్తుగా జనాభా పెరుగుదలను కార్యక్రమాలను సమన్వయం చేయడం కోసం ‘జాతీయ జనాభా కమిషన్’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ‘జాతీయ జనాభా విధానం - 2000’ అమలును పర్యవేక్షిస్తుంది. దీని ప్రకారం 2045 నాటికి జనాభాను స్థిరీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు: ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసిన మొదటి దేశం భారత్. 1952 నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చైనా ‘వన్ ఆర్ నన్’ .. అనే నినాదంతో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మన దేశంలో ‘మేమిద్దరం - మాకిద్దరు’ అనే నినాదం అమల్లో ఉంది. అంతేకాకుండా కేంద్రంలో కుటుంబ నియంత్రణ శాఖను 1966లో ఏర్పాటు చేశారు. జనాభా విస్ఫోటన ప్రమాదాన్ని గమనించిన ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవడానికి మొదటిసారిగా 1976లో జాతీయ జనాభా విధానాన్ని రూపొందించింది. జనాభా పెరుగుదలను నియంత్రించడానికి 8వ పంచవర్ష ప్రణాళికలో లక్ష్యాలను నిర్ణయించారు. అంతేకాకుండా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కుటుంబ నియంత్రణ పథకాల అమలును పర్యవేక్షించే అధికారాన్ని పంచాయితీరాజ్ వ్యవస్థకు బదలాయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం 2003లో ‘రాష్ట్రీయ జన సంఖ్యకోశ్’ పేరుతో దేశంలో జనాభా స్థిరీకరణ కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించింది. దీనికి చైర్మన్‌గా ప్రధానమంత్రి, వైస్ చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉంటారు. భారతదేశ జనాభా - ముఖ్యాంశాలు అత్యధిక జనాభా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అత్యల్ప జనాభా గల రాష్ట్రం సిక్కిం అత్యధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ అత్యల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం లక్ష్వద్వీప్ అత్యధిక జనాభా గల జిల్లా థానే (మహారాష్ర్ట) అత్యల్ప జనాభా గల జిల్లా దిబాంగ్ వ్యాలీ (అరుణాచల్‌ప్రదేశ్) భారతదేశ జనసాంద్రత 382 మంది అధిక జనసాంద్రత గల రాష్ట్రం బీహార్ (1106) అధిక జనసాంద్రత గల కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ (11,320) అధిక జనసాంద్రత గల జిల్లా ఈశాన్య ఢిల్లీ (37,346) అల్ప జనసాంద్రత గల జిల్లా దిబాంగ్ వ్యాలీ (అరుణాచల్‌ప్రదేశ్) జాతీయ అక్షరాస్యత 73 శాతం (పురుషుల అక్షరాస్యత - 81శాతం, స్త్రీలు 64.6 శాతం) అధిక అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ (94 శాతం) అల్ప అక్షరాస్యత గల రాష్ట్రం బీహార్ (61.8శాతం) జాతీయ లింగ నిష్పత్తి 1000 మంది పురుషులు : 943 మంది స్త్రీలు లింగ నిష్పత్తిలో స్త్రీలు అధికంగా ఉన్న రాష్ట్రం కేరళ (1000 : 1084) లింగ నిష్పత్తిలో స్త్రీలు తక్కువగా ఉన్న రాష్ట్రం హర్యానా (1000 : 879) గ్రామీణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ (తక్కువ : గోవా) పట్టణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం గోవా (తక్కువ హిమాచల్ ప్రదేశ్) ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (తక్కువ పంజాబ్) ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ (తక్కువ హర్యానా) గతంలో వచ్చిన ప్రశ్నలు 1. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంతశాతం పెరిగింది? 1) 17.19 2) 16.64 3) 18.12 4) 17.64 (17.7) 2. 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి? 1) ప్రతీ ఒక్కరూ లెక్కిస్తారు 2) మన జనాభా లెక్కలు, మన భవిష్యత్తు 3) నన్ను లెక్కించండి 4) ఏదీకాదు 3. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యతా శాతం? 1) 64 2) 82 3) 53 4) 73 4. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రెండు రాష్ట్రాలు? 1) ఉత్తరప్రదేశ్, బీహార్ 2) ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట 3) ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ 4) ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ 5. 2011 తాత్కాలిక జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం? 1) ఉత్తరప్రదేశ్ 2) బీహార్ 3) కేరళ 4) పశ్చిమ బెంగాల్ 6. దేశంలో ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా నమోదైంది? 1) 1911-21 2) 1921-31 3) 1931-41 4) 1941-51 7. {పపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? 1) మే 11 2) జూలై 11 3) సెప్టెంబర్ 11 4) డిసెంబర్ 11 8. భారత జనాభా గణన చట్టం - 1948 ప్రకారం అక్షరాస్యులంటే? 1) చదవడం, రాయడం వచ్చి ఐదేళ్లు నిండిన వారు 2) 6 ఏళ్ల నుంచి చదవడం, రాయడం వచ్చిన వారు 3) 7 ఏళ్ల నుంచి చదవడం, రాయడం వచ్చినవారు 4) 4 ఏళ్ల నుంచి చదవడం, రాయడం వచ్చినవారు సమాధానాలు 1) 4; 2) 2; 3) 4; 4) 2; 5) 2; 6) 1; 7) 2; 8) 3. ప్రపంచ జనాభా ప్రధానాంశాలు అత్యధిక జనాభా గల దేశం చైనా (సుమారు 140 కోట్లు) అత్యధిక జనాభా గల రెండో దేశం భారత్ (2011 లెక్కల ప్రకారం 121కోట్లు) అతి తక్కువ జనాభా ఉన్న దేశం వాటికన్ సిటీ నిలకడైన జనాభా ఉన్న దేశం దక్షిణ కొరియా జనాభా పెరుగుదల వేగంగా ఉన్న దేశం ఫిలిప్పైన్‌స వేగంగా జనాభా తగ్గుతున్న దేశం జపాన్ అత్యధిక జనసాంద్రత గల దేశం మొనాకో అత్యల్ప జన సాంద్రత గల దేశం పశ్చిమ సహారా -
మెరుగైన స్కోర్‌కు మార్గం చూపే.. సాంఘిక శాస్త్రం
పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ఎక్కువ స్కోరింగ్‌కు అవకాశం కల్పించే విభాగం.. జనరల్ స్టడీస్. వివిధ సబ్జెక్ట్‌ల కలయికగా ఉండే ఈ విభాగంలో సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్) పాత్ర కీలకం. ఎందుకంటే చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, అర్థ శాస్త్రం ఇలా నాలుగు భాగాలుగా ఉండే సాంఘిక శాస్త్రం నుంచి దాదాపు 27 శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటిని ప్రిపేర్ కావడం కూడా సులభమే. తద్వారా ఈ అంశాల్లో 100 శాతం స్కోర్ సాధించవచ్చు. ఈ నేపథ్యంలో సాంఘిక శాస్త్రం ప్రిపరేషన్‌కు సంబంధించి ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, ముఖ్యమైన అంశాలు, ప్రశ్నల సరళి తదితరాలపై విశ్లేషణ.. పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నల విభజనను పరిశీలిస్తే.. విభాగం ప్రశ్నలు మార్కులు చరిత్ర 25 25 భూగోళశాస్త్రం 15 15 పౌర శాస్త్రం 9 9 అర్థ శాస్త్రం 6 6 దీన్ని బట్టి సాంఘిక శాస్త్రం నుంచి 55 ప్రశ్నలు (55 మార్కుల) వస్తున్నాయి. ఇందులో చరిత్రకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది. అంతేకాకుండా స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ కూడా సాంఘిక శాస్త్ర అంశాలతో ముడి పడి ఉండటాన్ని గమనించాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 60 మార్కులు ఈ విభాగం నుంచి సాధించవచ్చు. విభాగాల వారీగా చదవాల్సిన అంశాలు.. చరిత్ర: సిలబస్‌ను భారతదేశ చరిత్ర, భారతదేశ- సంస్కృతి, భారతీ జాతీయోద్యమం అనే మూడు భాగాలుగా వర్గీకరించారు. భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా చదవాలి. అవి..ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. ఈ మూడు యుగాల్లోని భారతదేశ సంస్కృతిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా పరిపాలించిన రాజులు-వంశాలు, ఆనాటి రాజకీయ-సాంఘిక పరిస్థితులు, మత, సాంస్కృతిక, సాహిత్య అంశాలపై దృష్టిసారించాలి. ప్రాచీన చరిత్ర: ప్రాచీన శిలాయుగం, మధ్య శిలా యుగం, కొత్త రాతి యుగ అంశాలను చదవాలి. ఈ క్రమంలో సింధు నాగరికత, ఆర్య నాగరికతలకు సంబంధించిన విషయాలను క్షుణ్నంగా ప్రిపేర్ కావాలి. క్రీ.పూ. 6వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చిన నూతన మతాలు.. జైనం, బౌద్ధంతోపాటు మహావీరుడు, గౌతమ బౌద్ధుడు-వారి ప్రవచనాలు, సామాజిక మార్పులకు అవి ఏవిధంగా కారణమయ్యాయో విశ్లేషించుకుంటూ చదవాలి. మగధ, మౌర్య సామ్రాజ్యాలు, పారశీక, గ్రీకు దండయాత్రలు, సంగం యుగం నాటి సాహిత్యం, ఆంధ్ర శాతవాహన రాజ్యాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆనాటి రాజులు, సాహిత్యం, రచయితలు, బిరుదులను వివరంగా అధ్యయనం చేయాలి. కుషాణులు, గుప్తులు, హర్షవర్ధనుడు, పల్లవులు, చోళులు, చాళుక్య రాజులు.. ఆర్థిక, సాంస్కృతిక రంగాలను ఏవిధంగా ప్రభావితం చేశారో తెలుసుకోవాలి. మధ్యయుగ చరిత్ర: సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొగల్ పాలన సంబంధిత అంశాలను బాగా చదవాలి. ముఖ్యంగా ఆనాటి సాహిత్యం, శిల్ప కళ, వాస్తు అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇదేకాలంలో దక్షిణ భారతదేశంలో రాష్ట్రకూటులు, కాకతీయులు, హోయసలులు, పాండ్యులు, విజయనగర రాజులు, నాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను క్షుణ్నంగా చదవాలి. కాకుండా భక్తి ఉద్యమం, సూఫీ మతం గురించి కూడా తెలుసుకోవాలి. ఆధునిక భారత చరిత్ర: క్రీ.శ.1498లో వాస్కోడిగామా కాలికట్ (కేరళ)లో అడుగుపెట్టిన తర్వాత భారతదేశంలోకి యూరోపియన్ల రాక మొదలైంది. నాటి నుంచి 1947 వరకు నెలకొన్న పరిస్థితులను విస్తృతంగా చదవాలి. ఈ క్రమంలో బ్రిటిష్ పాలన, సిపాయిల తిరుగుబాటు, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్ల-మహారాష్ట్ర యుద్ధాలు, సాంఘిక సంస్కరణోద్యమం సంబంధిత అంశాలపై దృష్టి సారించాలి. భూగోళ శాస్త్రం: ముందుగా ప్రాథమిక భావనలు.. సౌర కుటుంబం, గ్రహాలు, భూమి, భూ చలనాలు, అక్షాంశాలు-రేఖాంశాలు, గ్రహణాలు, భూస్వరూపాలు, శీతోష్ణస్థితి, పర్వతాలు, భూకంపాలు, సముద్రాలు గురించి తెలుసుకోవాలి. ఈ విభాగంలో భారతదేశ ప్రాంతీయ భౌగోళిక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఈక్రమంలో భారతదేశ ఉనికి, భౌతిక రూపురేఖలు, శీతోష్ణస్థితి, అడవులు, మృత్తికలు, నదులు, వ్యవసాయం, పంటలు, నీటిపారుదల వ్యవస్థ, ప్రాజెక్ట్‌లు, రవాణా సమాచార సాధనాలు, జనాభా, ఓడరేవులు, పరిశ్రమలు, ఖనిజాలు, దర్శనీయ ప్రదేశాలు వంటి అంశాలను విస్తృతంగా చదవాలి. ఈ అంశాలను అట్లాస్‌తో సమన్వయం చేసుకుంటూ చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పాలిటీ: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికతత్వం, మానవ హక్కులు, సమాచార హక్కుచట్టం, భారత రాజ్యాంగంలోని ముఖ్య ఘట్టాలను బాగా చదవాలి. అంతేకాకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలలోని శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ, వాటి మధ్య సంబంధాన్ని విశ్లేషణాత్మకంగా చదవాలి. వీటిని సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. అదేవిధంగా స్థానిక పరిపాలన వ్యవస్థ, పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవస్థ వాటి పనితీరు గురించి అధ్యయనం చేయాలి. అర్థశాస్త్రం: ముందుగా ప్రాథమిక భావనలను అవగాహన చేసుకుంటే మిగిలిన అంశాలను చదవడం సులభంగా ఉంటుంది. ఈ క్రమంలో జాతీయాదాయం, తలసరి ఆదాయం, నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాలు వంటి అంశాల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా ఉత్పత్తి, మారకం, పంపిణీ సమస్యలు, బడ్జెట్, ద్రవ్యం, బ్యాంకింగ్ వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు, వాటి కాలాలు, ఫలితాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఏం చదవాలి? ఈ అంశాలకు సంబంధించి 6 నుంచి 10వ తరగతి (పాత సిలబస్) వరకు ఉన్న సాంఘిక శాస్త్ర పుస్తకాలను చదవాలి. సిలబస్ స్థాయి ఇంటర్మీడియెట్ వరకు నిర్దేశించారు. కాబట్టి 6 నుంచి 10వ తరగతి వరకు ఉండి ఇంటర్మీడియెట్‌లో పునరావృతమయ్యే అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆయా అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. గత ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్ బిట్స్‌ను ఎక్కువగా సాధన చేయాలి. తద్వారా ఏయే అంశాల నుంచి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారనే విషయంపై అవగాహన ఏర్పడుతుంది. గతంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు జైన మతం నుంచి ప్రేరణ పొందిన కళ-మధుర రుగ్వేదంలో అత్యంత సాధారణమైన నేరంగా పేర్కొంది-పశువులను దొంగిలించడం పల్లవులు ఎక్కడి నుంచి పరిపాలించారు-కాంచీపురం విష్ణుకుండినుల రాజధాని-దెందులూరు వాస్కోడిగామా ఏ దేశస్థుడు-పోర్చుగల్ జలియన్ వాలాబాగ్ ఏ నగరంలో ఉంది-అమృత్సర్ ఎవరితో స్నేహసంబంధాలు కొనసాగించాడు-పోర్చుగీసు వారితో నెప్ట్యూన్ వాతావరణం ఏ గ్రహ వాతావరణానికి సమానంగా ఉంటుంది-యురేనస్ భూభ్రమణం వేగం సుమారుగా (కి.మీ./గం.)-1610 2011 లెక్కల భారతదేశ జనాభా పెరుగుదల శాతం-17.64 కాకతీయ కాలువ ఏ నీటి ప్రాజెక్ట్‌లో భాగం-శ్రీరామ్ సాగర్ భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి-మూడు మూలధనాన్ని వాడుకోవడానికి చెల్లించే ధర-వడ్డీ పణాళికా సంఘం మొదటి అధ్యక్షుడు-జవహర్లాల్ నెహ్రూ గమనించాల్సినవి భారత జాతీయోద్యమం, సంస్కృతి అంశాలను చదివేటప్పుడు తెలంగాణ ప్రాంత భాగస్వామ్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి.భూగోళ శాస్త్రంలో తెలంగాణ రాష్ట్ర భౌగోళిక వ్యవస్థ, క్షేత్ర అమరిక, జనాభా వంటి అంశాలను చదవాలి.రాష్ట్ర పాలన వ్యవస్థలో వస్తున్న మార్పులను నిశితంగా గమనించాలి. వీటిని సమకాలీన అంశాల (కరెంట్ అఫైర్స్)తో సమన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావాలి.నిజాం కాలంలో తెలంగాణలో ఉన్న ఆర్థిక వ్యవహారాలు, భూ ఒడంబడిక పద్ధతులను తెలుసుకోవాలి.పాలిటీ-ఎకానమీ అంశాలను సమకాలీన అంశాల (కరెంట్ అఫైర్స్) తో సమన్వయం చేసుకుంటూ చదవాలి. -
సోషల్ మాస్టర్
మాది పెద్దపల్లి మండలం కాసులపల్లి. వ్యవసాయ కుటుంబం. వారసత్వంగా మా తాత నుంచి వందలాది ఎకరాల స్థిరాస్తి వచ్చింది. మా ఊళ్లోనే అయిదో తరగతి వరకు చదువుకున్నా. తర్వాత అమ్మమ్మ వాళ్ల ఊరు గర్రెపల్లిలో హైస్కూల్ చదివినా. రోజు నాలుగు కిలోమీటర్లు నడిచి బడికెళ్లినా. సుల్తానాబాద్‌లో ఇంటర్, మంచిర్యాలలో డిగ్రీ, నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీజీ. ఉత్కల్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ. నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ చదువుకున్నా. మేం ఆరుగురం సంతానం. ముగ్గురు అన్నాదమ్ముళ్లం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు. సోదరుల్లో ఒకరు లాయర్... మరొకరు వ్యవసాయం చేస్తున్నారు. గాల్లో ఎగరలేదు.. డిగ్రీ పూర్తయ్యాక ఎయిర్మేన్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు వెళ్లాలని అనిపించలేదు. ప్రైవేటు పాఠశాల పెట్టిన కొత్తలోనే గవర్నమెంట్ టీచర్ జాబ్ కూడా వచ్చింది. అప్పటికే నా దగ్గర వందమంది పిల్లలు చదువుకుంటున్నారు... ఆ ఉద్యోగం ఎందుకులే అనుకున్నా... వెళ్లలేదు. ఇతరత్రా వ్యాపకాలు.. ఉద్యోగాల కంటే చదువు నేర్పటమే నాకు నచ్చింది. పదిమందికి పాఠాలు చెప్పటం.. పిల్లలకు విద్య నేర్పించటమే ఎంతో సంతృప్తినిస్తుంది. అంతకుమించిన ఆనందమేదీ లేదు. అప్పటి కాలం వేరు.. నేను ఉన్నత చదువులు పూర్తిచేసిన కాలంలో చదువుకున్నవారి సంఖ్య తక్కువే. ఈ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. తెలిసీ తెలియని తనంతో ఎందరో జనజీవనం వీడిపోయారు. విచక్షణ, వివేచన ఉంటే.. వాళ్లంతట వాళ్లే ఆలోచించే శక్తి ఉంటే ప్రజలు తమంతట తాముగా బాగుపడుతారు. సమాజం కూడా బాగుపడుతుందని నమ్మినవాణ్ని. అందుకే అందరు చదువుకోవాలి. అందరికీ చదువు రావాలి. చదువు నేర్పితేనే నా వంతుగా సమాజానికి సేవ చేసినట్లు అవుతుంది. నాకు జీవనోపాధి దొరుకుతుంది. అందుకే విద్యారంగంలో అడుగుపెట్టాను. ప్రైవేటు బడిలో టీచర్.. మొదట్లో పెద్దపల్లిలోనే ఓ ప్రైవేటు బడిలో టీచర్‌గా పనిచేసినా. రెండేళ్ల తర్వాత నేనే పాఠశాల పెట్టాలని అనుకున్నా. ఓ పూరిపాకలో ఇరవై మంది పిల్లలతో ట్రినిటీ స్కూల్ స్థాపించాను. అదే వరుసలో ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ. అదీ మొదలు ఇప్పుడు ఎల్కేజీ నుంచి పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, బీఈడీ, డీఈడీ, ఎంఈడీ.. దాదాపు ఇరవై కాలేజీలున్నాయి. ఏటేటా మా విద్యాసంస్థల్లో 23వేల మంది విద్యార్థులు చదువు నేర్చుకుంటున్నారు. సమకాలికులతో పోలిస్తే విద్యారంగంలో నేనే ఆలస్యంగా అభివృద్ధిలోకి వచ్చాను. ఇంచుమించు నేను స్కూల్ ప్రారంభించినప్పుడు విజ్ఞాన్ రత్తయ్య స్కూల్ పెట్టాడు. ఇప్పుడు విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీగా ఏర్పడింది. దాంతో పోలిస్తే.. నేను వెనుకే ఉన్నాను కదా. దాదాపు ఇరవై ఏళ్లు నేనే పిల్లలకు సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ పాఠాలు చెప్పాను. ఇప్పటికీ తీరిక దొరికితే మా స్కూళ్లలోనే ఎక్కువ సమయం గడుపుతా. అన్నింటినీ నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తా. ఎమ్మెల్యే అయ్యాక విద్యాసంస్థల బాధ్యతలను నా కుమారుడు ప్రశాంత్‌రెడ్డికి అప్పగించినా. ఇప్పుడు ఆయనే ట్రినిటీ విద్యాసంస్థల ఛైర్మన్. రాజకీయాలంటే.. పుట్టి పెరిగిన ప్రాంతం కావటం, ఒక స్కూల్ కరస్పాండెంట్‌గా దాదాపు ఇరవై అయిదు ఏళ్లుగా ఇక్కడే ఉండటంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంబంధాలు ఏర్పడ్డాయి. చాలాసార్లు వాళ్లను కలవటం, మాట్లాడటం, వీలైనన్ని పద్ధతుల్లో వారిని తీర్చిదిద్దటం జరిగింది. మారుతున్న సమాజంలో ప్రజలకు సేవచేసే రంగాలెన్నో ఉన్నాయి. కానీ.. రాజకీయాల్లో ఉంటే ప్రజలను మరింత చైతన్యవంతులను చేయవచ్చు. అధికారం గుప్పిట్లో ఉంటే ప్రజలకు మరింత సేవ చేసేందుకు అవకాశముంటుంది. మనకున్న ఆలోచనను, విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకున్నా. ఉద్యమంతోనే ఎంట్రీ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉడతాభక్తిగా నావంతు సహాయ సహకారాలు అందించాలని అనుకున్నా. మూడేళ్ల కిందటే రాజకీయాల్లోకి వచ్చినా. టీఆర్ఎస్లో చేరినా. పార్టీలో చేరేటప్పుడే ఏదో ఒక పదవి, ఏదో ఒక అవకాశం వస్తుందని అనుకున్నా. మా బాస్ కేసీఆర్‌పైనే నమ్మకం పెట్టుకున్నా. అదే నిజమైంది. పార్టీ టిక్కెట్టు ఇచ్చి నన్ను పోటీ చేయమన్నారు. కష్టపడ్డాను.. నిర్విరామంగా ప్రజల్లో ఉండటంతోనే విజయం నన్ను వరించింది. విజయం తనంతట తానుగా ఎవరి దరి చేరదని నమ్మే వ్యక్తిని నేను. చిన్నప్పటి నుంచీ కష్టపడటం నేర్చుకున్నా. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. డ్రీమ్ ప్రాజెక్టు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాను. ప్రజలకు ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉంటాయి. అన్నింటినీ నెరవేర్చటం ఎవరివల్లా కాదు. నియోజకవర్గ స్థాయిలో అధికారుల సహకారంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ పక్కాగా ప్రజలకు చేరేందుకు ప్రయత్నిస్తాను. పత్తి పంట వేసి నష్టపోయినా.. వరిపొలం దెబ్బతింది.. అని రైతులు బాధ పడకూడదు. ప్రత్యామ్నాయంగా వ్యవసాయ అనుబంధ రంగాలను వృద్ధి చేయాలి. డెయిరీ, హార్టికల్చర్.. ఏదో ఒక తీరుగా రైతుకు అదనపు ఆదాయ వనరులు ఉండేలా ఒక ప్రాజెక్టు ఉండాలనేది నా డ్రీమ్. -
సోషల్ స్టడీస్- చరిత్ర టెట్ + డీఎస్సీ పేపర్ - 2
హరప్పా సంస్కృతి - ఆర్య నాగరికత 1. హరప్పా నాగరికత మొదటిసారిగా ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఎ) క్రీ.శ. 1921 బి) క్రీ.శ. 1922 సి) క్రీ.శ. 1923 డి) క్రీ.శ. 1924 2. సింధూ నాగరికతకు, మెసపటోమియా నాగరికతకు మధ్య సారూప్యతను తెచ్చిన అంశం? (జూలై- 2011 టెట్) ఎ) ఆర్థిక వనరులు, వాటి వినియోగం బి) భాష సి) సహజ పరిస్థితులు డి) జీవన విధానం 3. సింధూలోయ నాగరికత ప్రజలకు ఏ దేశంతో వర్తక, సాంస్కృతిక సంబంధాలు ఉండేవి? (జూలై-2011 టెట్) ఎ) చైనా బి) శ్రీలంక సి) అఫ్ఘానిస్థాన్ డి) బర్మా 4. హరప్పా సంస్కృతికి చెందిన ధోలవీరా ఏ రాష్ర్టంలో ఉంది? (డీఎస్సీ-2012) ఎ) రాజస్థాన్ బి) పంజాబ్ సి) గుజరాత్ డి) హర్యానా 5. షోడశ మహాజనపదాల్లో ఒకటైన గాంధార ఏ నదుల ఒడ్డున ఉంది? (డీఎస్సీ - 2012) ఎ) గోదావరి, దాని ఉపనదులు బి) నర్మద సి) గంగ, దాని ఉపనదులు డి) సింధూ, దాని ఉపనదులు 6. ఆస్తిక దర్శనం అనే ఆరు హిందూతత్వ సంప్రదాయాల్లో ఒకటి..?(డీఎస్సీ- 2012) ఎ) ధర్మం బి) న్యాయం సి) సత్యం డి) అహింస 7. {XMులు, ఆర్యులకు ఏ విషయంలో సామ్యం ఉంది? (డీఎస్సీ-2012) ఎ) భోజన అలవాట్లు బి) వస్త్ర ధారణ సి) పరిపాలన డి) ప్రకృతి శక్తుల ఆరాధన 8. పౌరవ రాజ్యం ఏ నదుల మధ్య ఉండేది? (మే-2012 టెట్) ఎ) సట్లేజ్, జీలం బి) చీనాబ్, జీలం సి) జీలం, బియాస్ డి) బియాస్, రావి 9. కింది వాటిలో సరికానిది? ఎ) రాజస్థాన్-కాళీభంగన్ బి) గుజరాత్ - లోథాల్ సి) పంజాబ్ - రూపార్ డి) హర్యానా - రంగ్‌పూర్ 10. గొప్ప స్నాన వాటిక ఎక్కడ జరిపిన తవ్వకా ల్లో బయటపడింది? ఎ) హరప్పా బి) మొహెంజోదారో సి) చన్హుదారో డి) కాళీభంగన్ 11. హరప్పా ప్రజలకు ఏ లోహం తెలియదు? ఎ) ఇనుము బి) రాగి సి) కంచు డి) వెండి 12. సింధూ నాగరికత ప్రజలు తమ వ్యాపార, వాణిజ్యాలకు ఏ సముద్రంపై ప్రయాణించేవారు? ఎ) హిందూ మహాసముద్రం బి) ఎర్ర సముద్రం సి) అరేబియా సముద్రం డి) బంగాళాఖాతం 13. హరప్పా నాగరికత కాలంలో ఓడరేవు పట్ట ణంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం? ఎ) కాళీభంగన్ బి) మొహెంజోదారో సి) భన్వాలీ డి) లోథాల్ 14. హరప్పా ప్రజలు అమ్మతల్లితోపాటు వేటిని ఆరాధించేవారు? ఎ) రాళ్లు, చెట్లు బి) చెట్లు, జంతువులు, సర్పాలు సి) రాళ్లు, చెట్లు, పక్షులు డి) చెట్లు, జంతువులు, అగ్ని 15. సింధూ ప్రజల లిపికి ఏఏ దేశాల ప్రాచీన లిపులతో పోలికలున్నట్లుగా తెలుస్తోంది? ఎ) ఇరాన్, ఇరాక్ బి) ఈజిప్ట్, మెసపటోమియా సి) రోమన్, గ్రీక్ డి) అరబ్బీ, ఇండో ఆర్యన్ 16. సర్ప లేఖనం అంటే..? ఎ) ఒక వరుసను ఎడమ నుంచి కుడికి తర్వాతి వరుసను కుడి నుంచి ఎడమ కు రాయడం బి) ఒక వరుసను కుడి నుంచి ఎడమకు తర్వాతి వరుసను ఎడమ నుంచి కుడికి రాయడం సి) మొదటి వరుసను ఎడమ నుంచి కుడికి తర్వాతి వరుసలను కుడి నుంచి ఎడమకు రాయడం డి) మొదటి వరుసను కుడినుంచి ఎడమకు తర్వాతి వరుసలను ఎడమ నుంచి కుడికి రాయడం 17. సింధూ నాగరికత శిథిలాలు ఎక్కువగా ఎక్కడ బయటపడ్డాయి? ఎ) హరప్పా బి) మొహెంజోదారో సి) ధోలవీరా డి) సూక్తజెండార్ 18. ఆర్య నాగరికత ఏ నదుల మధ్య విలసి ల్లినట్లుగా భావిస్తున్నారు? ఎ) నర్మద, తపతి బి) సింధూ, దాని ఉపనదులు సి) గంగా, యమునా డి) బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు 19. వేదం అంటే..? ఎ) నీతి నియమావళి బి) జ్ఞానం సి) సంస్కృతి డి) గ్రంథస్తం చేసినది 20. వేద నాగరికతా కాలం? ఎ) క్రీ.పూ.1500-క్రీ.పూ.1000 బి) క్రీ.పూ.1000-క్రీ.పూ.600 సి) క్రీ.పూ.1000-క్రీ.శ.600 డి) క్రీ.పూ.1500-క్రీ.పూ.600 21. ఆర్యులు భారతదేశంలో స్థిరపడిన విధా నాన్ని తెలిపే గ్రంథం? ఎ) అబిధమ్మ పీఠిక బి) రుగ్వేదం సి) యజుర్వేదం డి) సామవేదం 22. హరప్పా నాగరికత విలసిల్లిన కాలం? ఎ) క్రీ.పూ.3000-క్రీ.పూ.1500 బి) క్రీ.పూ.3500-క్రీ.పూ.2000 సి) క్రీ.పూ.2500-క్రీ.పూ.1000 డి) క్రీ.పూ.2000-క్రీ.పూ.1000 23. సింధూ నగరాల్లో రహదారుల వెడల్పు ఎన్ని మీటర్ల వరకు ఉండేది? ఎ) 3-10 మీ. బి) 5-15 మీ. సి) 10-15 మీ. డి) 8-16 మీ. 24. సింధూ ప్రజలకు ఏఏ దేశాలతో వ్యాపార, సాంస్కృతిక సంబంధాలుండేవి? ఎ) ఇరాన్, ఇరాక్, అఫ్ఘానిస్థాన్ బి) ఇరాన్, ఈజిప్ట్, రోమ్ సి) ఇరాక్, అరేబియా, గ్రీక్ డి) అఫ్ఘానిస్థాన్, ఈజిప్ట్, ఇరాన్ 25. హరప్పా ప్రజల పురుష దేవుడు? ఎ) శివుడు బి) పశుపతి సి) రుద్రుడు డి) వరణుడు 26. హరప్పా నాగరికత ఏ నదీ తీర ప్రాంతంలో నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది? ఎ) గంగా బి) యమునా సి) సరస్వతి డి) సింధూ 27. హరప్పా నాగరికత కాలంలోని ప్రజలను ద్రావిడులని పిలిచినవారు? ఎ) విదేశీ వర్తకులు బి) పురాతత్వ శాస్త్రజ్ఞులు సి) ఆర్యులు డి) చరిత్రకారులు 28. దశరాజ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఎ) ఆర్యులకు, ద్రావిడులకు బి) ద్రావిడులకు, పదిమంది ఇతర రాజులకు మధ్య సి) ఆర్య తెగల మధ్య అంతర్యుద్ధం డి) ద్రావిడ జాతుల మధ్య అంతర్యుద్ధం 29. ఆర్యుల పాలనా నిర్వహణలో రాజుకు సలహాలిస్తూ అతడి అధికారాన్ని అదుపులో ఉంచినవి? ఎ) సభ, సమితి బి) గ్రామణి, పురోహిత వర్గం సి) ఘటికలు, రాజన్ అనుచర వర్గం డి) గ్రామసభ, బ్రాహ్మణ పురోహితులతో ఏర్పడిన సలహా సంఘం 30. ఆర్యులు మొదట ఎక్కడ స్థిరపడ్డారు? ఎ) గంగానదీ పరివాహక ప్రాంతం బీహార్ బి) పంజాబ్, సింధూనదీ ప్రాంతం సి) ఉత్తరప్రదేశ్, నేపాల్ సరిహద్దు డి) నర్మదానదీ ఉత్తర ప్రాంతం, ఆరావళీ పర్వత దిగువ ప్రాంతం 31. దశరాజ యుద్ధ విజేతలు? ఎ) ద్రావిడులు బి) ఆర్యులు సి) 10 ఆర్య తెగల కూటమి డి) భరతులనే ఆర్య తెగవారు 32. యజ్ఞ యాగాల ఉపయోగాన్ని తెలుపుతూ వర్ణ భేదాన్ని ఖండించినవి? ఎ) వేదాలు, వేదాంగాలు బి) రుగ్వేదం, సామవేదం సి) అరణ్యకాలు, ఉపనిషత్తులు డి) సంహితలు, ఇతిహాసాలు 33. కర్షాపనం అంటే..? ఎ) మలివేదకాలం నాటి నాణెం బి) ఆర్యులు ఆరాధించే ఆయుధం సి) ఆర్యులు యజ్ఞ, యాగాదుల్లో ధరించే వస్త్రం డి) మలివేద కాలంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను 34. మలివేద కాలంలోని విద్యా కేంద్రం? ఎ) మగధ బి) వారణాసి సి) అవంతి డి) కోసల 35. మొహెంజోదారో పాకిస్థాన్‌లోని ఏ జిల్లా లో ఉంది? ఎ) సింధూ బి) హైదరాబాద్ సి) ముల్తాన్ డి) లార్కానా 36. భారతదేశంలోని సింధూ నాగరికత కాలం నాటి నగరం? ఎ) హరప్పా బి) చన్హుదారో సి) దైమాబాద్ డి) సూక్తజెండార్ 37. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన వారని అభిప్రాయపడినవారు? ఎ) మార్టిమర్ వీలర్ బి) దాదాభాయ్ నౌరోజీ సి) బాలగంగాధర్ తిలక్ డి) కె.ఆర్.రావు 38. కింది వాటిలో సరికానిది? ఎ) రుగ్వేదం-ఆర్యుల సామాజిక విధానం బి) యజుర్వేదం- యజ్ఞయాగాదులు సి) సామవేదం- సంగీతం డి) అధర్వణవేదం- సంస్కృత వ్యాకరణం, ఛందస్సు 39. అయస్ అంటే..? ఎ) లోహం బి) గ్రామపెద్ద సి) ఆర్యదేవత డి) ద్రావిడుల వ్యవసాయ పనిముట్లు 40. సమాజంలో వర్ణ వ్యవస్థకు బీజాలు ఏ కాలంలో పడ్డాయి? ఎ) సింధూ నాగరికత అంతమవ్వడానికి కొంతకాలం ముందు బి) తొలివేద కాలం ప్రారంభంలో సి) తొలి వేదకాలం చివరలో డి) మలివేదకాలం ప్రారంభంలో 41. గృహపతిని ఇలా కూడా పిలిచేవారు? ఎ) గవిష్టి బి) సంగ్రాహిత్రి సి) దంపతి డి) రాజన్ 42. {పకృతి దేవతారాధకులైన ఆర్యులు ఆరాధించిన దైవం? ఎ) శివుడు బి) రుద్రుడు సి) అగ్నిదేవుడు డి) సూర్యుడు 43. పంచమ వేదంగా ప్రఖ్యాతి గాంచింది? ఎ) మహాభారతం బి) రామాయణం సి) ఆయుర్వేదం డి) రుగ్వేదం 44. ఏ ప్రాచీన నాగరికతల మధ్య సారూప్యత ఉన్నట్లుగా తెలుస్తోంది? ఎ) సింధూ, ఈజిప్ట్, మెసపటోమియా బి) సింధూ, ఆర్య, ఈజిప్ట్, గ్రీక్ సి) సింధూ, మెసపటోమియా, చైనా డి) ఆర్య, గ్రీక్, చైనా, రోమన్ 45. సింధూ ప్రజలు పూజించిన పశుపతి ముద్ర ఎక్కడ జరిగిన తవ్వకాల్లో బయటపడింది? ఎ) హరప్పా బి) మొహెంజోదారో సి) రంగ్‌పూర్ డి) లోథాల్ సమాధానాలు 1) బి; 2) ఎ; 3) సి; 4) సి; 5) డి; 6) బి; 7) డి; 8) బి; 9) డి; 10) బి; 11) ఎ; 12) సి; 13) డి; 14) బి; 15) బి; 16) ఎ; 17) ఎ; 18) సి; 19) బి; 20) డి; 21) బి; 22) ఎ; 23) ఎ; 24) ఎ; 25) బి; 26) డి; 27) సి; 28) సి; 29) ఎ; 30) బి; 31) డి; 32) సి; 33) ఎ; 34) బి; 35) డి; 36) సి; 37) సి; 38) డి; 39) ఎ; 40) సి; 41) సి; 42) సి; 43) ఎ; 44) ఎ; 45) బి -
సోషల్ స్టడీస్ టెట్ + డీఎస్సీ పేపర్ - 2
అర్థశాస్త్రం - మౌలిక భావనలు 1. స్వచ్ఛమైన పబ్లిక్ వస్తువుల/సేవలకు ఉదాహరణ? (జూలై-2011 టెట్) ఎ) గాలి బి) దేశ రక్షణ సి) రోడ్డు డి) రైల్వేలు 2. ఆర్థిక రంగానికి సంబంధించిన మౌలిక ప్రశ్న కానిది? (జూలై -2011 టెట్) ఎ) ఎందుకు ఉత్పత్తి చేయాలి బి) ఎలా ఉత్పత్తి చేయాలి సి) ఎక్కడ ఉత్పత్తి చేయాలి డి) ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి 3. సహకార సంస్థల ముఖ్య సిద్ధాంతం? (జూలై-2011 టెట్) ఎ) లాభార్జన బి) ప్రజా సంక్షేమం సి) అందరి కోసం తాము, తమ కోసం అందరూ పాటుపడడం డి) వాటాలను ప్రోత్సహించడం 4. డాక్టర్ అమర్త్యసేన్ అర్థశాస్త్రాన్ని ఎలా నిర్వచించాడు? (జూలై-2011 టెట్) ఎ) సంపదకు సంబంధించిన శాస్త్రం బి) మానవుడు, అతడి శ్రేయస్సును అధ్యయనం చేసేది సి) ఎంపిక శాస్త్రం డి) విజ్ఞాన శాస్త్ర శ్రేయస్సు 5. {పయోజనాన్ని ఎవరు నిర్ధారిస్తారు? (జూలై -2011 టెట్) ఎ) ఉత్పత్తిదారుడు బి) వినియోగదారుడు సి) అమ్మకపుదారుడు డి) అర్థ శాస్త్రవేత్త 6. ద్వితీయ రంగ ఆర్థిక వ్యవస్థకు ఉదాహ రణ? (జూలై-2011 టెట్) ఎ) అడవులు బి) పశు సంవర్థనం సి) నీటి సరఫరా డి) రియల్ ఎస్టేట్ 7. ఒక వ్యక్తి ఒక ఊరికి చేరేందుకు రైలు, విమానం అనే రెండు మార్గాలు ఉన్నాయి. అతడు తన ప్రయాణానికి విమానాన్ని ఎంచుకుంటే, ఈ ఎంపిక కోరికల ఏ లక్షణాన్ని కలిగి ఉందని చెప్పొచ్చు? (జన వరి-2012 టెట్) ఎ) కోరికలు ప్రత్యామ్నాయాలు బి) కోరికలు అపరిమితం సి) కోరికలు ఒకదానితో ఒకటి పోటీపడతాయి డి) కోరికలు మళ్లీ మళ్లీ పుడతాయి 8. బంగారం అనేది? (జనవరి-2012 టెట్) ఎ) మూలధనం, నశ్వర వస్తువు బి) మూలధనం, ఆర్థిక వస్తువు సి) వినియోగ, పబ్లిక్ వస్తువు డి) ప్రైవేట్, ఉచిత వస్తువు 9. విత్త లభ్యత ఆధారంగా... భాగస్వా మ్యాలు, కంపెనీలు, ఏక యాజమాన్యం, కార్పొరేషన్లు వీటిలో మొదటి ప్రాధాన్యతను గుర్తించండి? (జనవరి-2012 టెట్) ఎ) భాగస్వామ్యాలు బి) కంపెనీలు సి) ఏక యాజమాన్యం డి) కార్పొరేషన్లు 10. రూప ప్రయోజనానికి ఉదాహరణ? (మే- 2012 టెట్) ఎ) ముడి పత్తి నుంచి దుస్తుల తయారీ బి) వస్తువులను తయారైన ప్రాంతం నుంచి తరలించడం సి) సరుకును కొనుగోలు చేసి, నిల్వ చేసి తర్వాత అమ్మడం డి) సేవల ద్వారా మానవ కోరికలను తీర్చడం 11. ఆర్థిక వ్యవస్థ నవీకరణను సూచించే రంగం? (మే-2012 టెట్) ఎ) ప్రాథమిక బి) ద్వితీయ సి) తృతీయ డి) వ్యవసాయ 12. {Oపెవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉండాల్సిన సభ్యుల సంఖ్య? (మే-2012 టెట్) ఎ) 3 బి) 5 సి) 4 డి) 2 13. మాధ్యమిక వస్తువులకు ఉదాహరణ? ఎ) యంత్ర పరికరాలు బి) ముడి పత్తి సి) గడియారాలు డి) ఎరువులు 14. {Oపెవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటా మూల ధనం కలిగిన భాగస్వాముల సంఖ్య? (డీఎస్సీ- 2008) ఎ) 100 మంది సభ్యులు బి) పరిమితి లేదు సి) 50 మంది సభ్యులు డి) 50-75 మంది సభ్యులు 15. బాటకము అంటే..? (డీఎస్సీ-2008) ఎ) వ్యవస్థాపనం చేసినందుకు ప్రతిఫలం బి) కార్మికుడి శ్రమకు చెల్లించే ప్రతిఫలం సి) పెట్టుబడికి చెల్లించే ప్రతిఫలం డి) భూమికి చెల్లించే ప్రతిఫలం 16. నదికి అడ్డంగా మోటారు వాహనాల కోసం నిర్మించిన వంతెన ఏ కోవకు చెందింది? ఎ) ఉచిత వస్తువు బి) ప్రైవేట్ వస్తువు సి) సార్వజనిక వస్తువు డి) స్వచ్ఛమైన సార్వజనిక వస్తువు 17. ఉత్పత్తి ప్రాతిపదికన విద్య అనేది? (డీఎస్సీ-2008) ఎ) అంతిమ ఉత్పత్తి బి) మాధ్యమిక ఉత్పత్తి సి) ప్రాథమిక ఉత్పత్తి డి) ప్రత్యక్ష ఉత్పత్తి 18. పబ్లిక్ ఆస్తికి ఒక ఉదాహరణ? (డీఎస్సీ -2012) ఎ) సముద్రనీరు బి) విద్యుచ్ఛక్తి సి) జనరేటర్ డి) వార్తాపత్రిక 19. ఒక వ్యాపారవేత్త తన ఉత్పత్తిని ఒక నెల లోనే పెంచడానికి.. మూలధనాన్ని, కార్మికు ల సంఖ్యను పెంచితే దాన్ని ఏమంటారు? (డీఎస్సీ-2012) ఎ) క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం బి) సరఫరా సూత్రం సి) తరహాననుసరించి ప్రతిఫలాల సిద్ధాంతం డి) చరానుపాత సిద్ధాంతం 20. 20 ఎకరాలకు పంట దిగుబడి 800 బస్తాల వరి అయితే ఎకరాకు దాని ఉత్పాదకత? (డీఎస్సీ-2012) ఎ) 40 బస్తాలు బి) 80 బస్తాలు సి) 100 బస్తాలు డి) 60 బస్తాలు 21. కింది సూత్రాన్ని గమనించి విలువను కనుక్కోండి. లాభం (Pr)= మొత్తం రాబడి(Tr)- మొత్తం వ్యయం(Tc). Tr=Tc అయితే ్కట=? (డీఎస్సీ-2012) ఎ) (+1) బి) (-1) సి) (O) డి) (±1) 22. ఆంతరంగిక వ్యవస్థాపనకు ఉదాహరణ? (డీఎస్సీ-2012) ఎ) బహుళ విభాజిత రూపాలు బి) ప్రొప్రైటర్ విధానం సి) భాగస్వామ్యం డి) సహకార సంఘం 23. జనపనారను సంచిగా తయారు చేయడం వల్ల సంచికి కలిగే ప్రయోజనం? (డీఎస్సీ-2012) ఎ) సేవా ప్రయోజనం బి) స్థల ప్రయోజనం సి) రూప ప్రయోజనం డి) కాల ప్రయోజనం 24. అర్థశాస్త్ర పితామహుడు? ఎ) అమర్త్యసేన్ బి) ఆడమ్ స్మిత్ సి) అరిస్టాటిల్ డి) జాన్ కీన్స 25. కింది వాటిలో సరికానిది? ఎ) అమర్త్యసేన్-సంక్షేమం బి) ఆడమ్ స్మిత్-సంపద సి) మార్షల్-ఎంపిక డి) రాబిన్స-కొరత 26. మానవుడు తన కోర్కెలను సంతృప్తిపర్చు కోవడానికి ధనాన్ని ఏ విధంగా ఉపయోగి స్తాడో తెలిపేది? ఎ) సంపద శాస్త్రం బి) కొరత శాస్త్రం సి) సంక్షేమ శాస్త్రం డి) శ్రేయస్సుకు సంబంధించిన శాస్త్రం 27. అర్థ శాస్త్రాన్ని సూక్ష్మ, స్థూల అర్థ శాస్త్రాలు గా వర్గీకరించినవారు? ఎ) అమర్త్యసేన్ బి) రాగ్నార్ ఫ్రిష్ సి) ఆడమ్ స్మిత్ డి) మార్షల్ 28. అర్థశాస్త్రంలో ప్రతిభ కనబర్చిన వారికి ఏ సంవత్సరం నుంచి నోబెల్ బహుమతి ఇస్తున్నారు? ఎ) 1969 బి) 1972 సి) 1964 డి) 1975 29. వినియోగానికి మూలం? ఎ) అవసరాలు బి) ఉత్పత్తి సి) కోరికలు డి) వినిమయం 30. {పయోజనం అంటే..? ఎ) వినియోగదారుడి అవసరాలను సంతృప్తిపర్చడం బి) వినియోగదారుడి కోరికలను తీర్చే ఆర్థిక ప్రక్రియ సి) వస్తువు ఉత్పత్తికి మూలధనాన్ని సమకూర్చినందుకు వచ్చే లాభం డి) వస్తువుకు గల కోరిక తీర్చగలిగే శక్తి 31. ఇడ్లీ పిండి నుంచి ఇడ్లీలను తయారు చేయ డం, పండ్లను శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచి కొరత ఉన్నప్పుడు విక్రయించడం ఏ ప్రయోజనాలకు ఉదాహరణలు? ఎ) స్థల, సేవా ప్రయోజనాలు బి) రూప, కాల ప్రయోజనాలు సి) స్థల, రూప ప్రయోజనాలు డి) కాల, స్థల ప్రయోజనాలు 32. ఉత్పత్తి అంటే..? ఎ) ప్రయోజనాలను సృష్టించడం బి) మూలధనాన్ని సద్వినియోగం చేసుకోవడం సి) వినియోగదారుడి అవసరాలను, కోరికలను తీర్చడం డి) శ్రమకు ప్రతిఫలాన్ని అందించడానికి దోహదం చేయడం 33. ఉత్పత్తికి ఆధారం..? ఎ) మూలధనం బి) మార్కెట్ సి) వినియోగం డి) డిమాండ్ - పంపిణీ 34. ఉత్పత్తికి, వినియోగానికి మధ్య సంబంధం? ఎ) ప్రమేయ సంబంధం బి) సహకార సంబంధం సి) విలోమ సంబంధం డి) అనులోమ సంబంధం 35. ఉత్పత్తి (Q), భూవి$ (N), శ్రమ (L), మూలధనం (K), వ్యవస్థాపన (O), ప్రమేయ సంబంధం (ఊ) అనుకుంటే ఖ=? ఎ) O+F(N,L,K) బి) O(N,L,K)+F సి) F(N,L,K,O) డి) ై(N,L,K,F) 36. ఉత్పత్తి సాధనం కానిది? ఎ) శ్రమ బి) వినిమయం సి) మూలధనం డి) వ్యవస్థాపన 37. కింది వాటిలో చర మూలధనం కానిది? ఎ) కార్మికుల వేతనాలు బి) యంత్రాలు సి) విద్యుచ్ఛక్తి డి) ఇంధనం 38. వినిమయం అంటే? ఎ) ధర చెల్లించి వస్తువును తీసుకోవడం బి) వస్తువును మార్పిడి చేసుకోవడం సి) బి, ఎ డి) వినియోగానికి అవసరమైన వస్తువును పొందడం 39. పంపిణీ అంటే..? ఎ) ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలం బి) ఉత్పత్తికి కారణాలైన సాధనాలనువినియోగదారులకు అందించి, లాభాలు సాధించడం సి) ఉత్పత్తి ఫలాలుగా ఉత్పత్తులను అందించడం డి) ఉత్పత్తులను సరైన క్రమంలో పంపిణీదారులు, వినియోగదారులకు విక్రయించడం 40. మూలధనానికి ప్రతిఫలం? ఎ) వేతనం బి) భాటకం సి) లాభం డి) వడ్డీ 41. మొబైల్ ఫోన్ ఒక..? ఎ) విలాస వస్తువు బి) అవసరమైన వస్తువు సి) సౌకర్యవంతమైన వస్తువు డి) అత్యవసరమైన వస్తువు 42. తరగతి గదిలో కంప్యూటర్ పాఠాలు అనేవి? ఎ) సౌకర్యం బి) అవసరం సి) విలాసం డి) అత్యవసరం 43. {పతి వ్యక్తి తన కోర్కెలను తీర్చుకోవడానికి తప్పనిసరిగా అవసరమైనది? ఎ) సామర్థ్యం బి) ప్రతిఫలం సి) ప్రత్యామ్నాయం డి) కారకం/సాధనం 44. దుకాణంలోని పుస్తకం ప్రైవేట్ వస్తువు అయితే గ్రంథాలయంలోని పుస్తకం? ఎ) ఉచిత వస్తువు బి) మాధ్యమిక వస్తువు సి) పబ్లిక్ వస్తువు డి) ఎ, సి సమాధానాలు 1) బి; 2) ఎ; 3) సి; 4) డి; 5) ఎ; 6) డి; 7) ఎ; 8) బి; 9) బి; 10) ఎ; 11) సి; 12)డి; 13) బి; 14) సి; 15) డి; 16) సి; 17) సి; 18) ఎ; 19)సి; 20)ఎ; 21) సి; 22) ఎ; 23) సి; 24)బి; 25)సి; 26) ఎ; 27) బి; 28) ఎ; 29)సి; 30)డి; 31) బి; 32) ఎ; 33) సి; 34)డి; 35)సి; 36) బి; 37) బి; 38) సి; 39) ఎ; 40)డి; 41) బి; 42) ఎ; 43) సి; 44) సి;