సోషల్ స్టడీస్- చరిత్ర టెట్ + డీఎస్సీ పేపర్ - 2
హరప్పా సంస్కృతి - ఆర్య నాగరికత
1. హరప్పా నాగరికత మొదటిసారిగా ఎప్పుడు వెలుగులోకి వచ్చింది?
ఎ) క్రీ.శ. 1921 బి) క్రీ.శ. 1922
సి) క్రీ.శ. 1923 డి) క్రీ.శ. 1924
2. సింధూ నాగరికతకు, మెసపటోమియా నాగరికతకు మధ్య సారూప్యతను తెచ్చిన అంశం? (జూలై- 2011 టెట్)
ఎ) ఆర్థిక వనరులు, వాటి వినియోగం
బి) భాష
సి) సహజ పరిస్థితులు
డి) జీవన విధానం
3. సింధూలోయ నాగరికత ప్రజలకు ఏ దేశంతో వర్తక, సాంస్కృతిక సంబంధాలు ఉండేవి? (జూలై-2011 టెట్)
ఎ) చైనా బి) శ్రీలంక
సి) అఫ్ఘానిస్థాన్ డి) బర్మా
4. హరప్పా సంస్కృతికి చెందిన ధోలవీరా ఏ రాష్ర్టంలో ఉంది? (డీఎస్సీ-2012)
ఎ) రాజస్థాన్ బి) పంజాబ్
సి) గుజరాత్ డి) హర్యానా
5. షోడశ మహాజనపదాల్లో ఒకటైన గాంధార ఏ నదుల ఒడ్డున ఉంది?
(డీఎస్సీ - 2012)
ఎ) గోదావరి, దాని ఉపనదులు
బి) నర్మద
సి) గంగ, దాని ఉపనదులు
డి) సింధూ, దాని ఉపనదులు
6. ఆస్తిక దర్శనం అనే ఆరు హిందూతత్వ సంప్రదాయాల్లో ఒకటి..?(డీఎస్సీ- 2012)
ఎ) ధర్మం బి) న్యాయం
సి) సత్యం డి) అహింస
7. {XMులు, ఆర్యులకు ఏ విషయంలో సామ్యం ఉంది? (డీఎస్సీ-2012)
ఎ) భోజన అలవాట్లు
బి) వస్త్ర ధారణ సి) పరిపాలన
డి) ప్రకృతి శక్తుల ఆరాధన
8. పౌరవ రాజ్యం ఏ నదుల మధ్య ఉండేది?
(మే-2012 టెట్)
ఎ) సట్లేజ్, జీలం బి) చీనాబ్, జీలం
సి) జీలం, బియాస్ డి) బియాస్, రావి
9. కింది వాటిలో సరికానిది?
ఎ) రాజస్థాన్-కాళీభంగన్
బి) గుజరాత్ - లోథాల్
సి) పంజాబ్ - రూపార్
డి) హర్యానా - రంగ్‌పూర్
10. గొప్ప స్నాన వాటిక ఎక్కడ జరిపిన తవ్వకా ల్లో బయటపడింది?
ఎ) హరప్పా బి) మొహెంజోదారో
సి) చన్హుదారో డి) కాళీభంగన్
11. హరప్పా ప్రజలకు ఏ లోహం తెలియదు?
ఎ) ఇనుము బి) రాగి
సి) కంచు డి) వెండి
12. సింధూ నాగరికత ప్రజలు తమ వ్యాపార, వాణిజ్యాలకు ఏ సముద్రంపై ప్రయాణించేవారు?
ఎ) హిందూ మహాసముద్రం
బి) ఎర్ర సముద్రం
సి) అరేబియా సముద్రం
డి) బంగాళాఖాతం
13. హరప్పా నాగరికత కాలంలో ఓడరేవు పట్ట ణంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
ఎ) కాళీభంగన్ బి) మొహెంజోదారో
సి) భన్వాలీ డి) లోథాల్
14. హరప్పా ప్రజలు అమ్మతల్లితోపాటు వేటిని ఆరాధించేవారు?
ఎ) రాళ్లు, చెట్లు
బి) చెట్లు, జంతువులు, సర్పాలు
సి) రాళ్లు, చెట్లు, పక్షులు
డి) చెట్లు, జంతువులు, అగ్ని
15. సింధూ ప్రజల లిపికి ఏఏ దేశాల ప్రాచీన లిపులతో పోలికలున్నట్లుగా తెలుస్తోంది?
ఎ) ఇరాన్, ఇరాక్
బి) ఈజిప్ట్, మెసపటోమియా
సి) రోమన్, గ్రీక్
డి) అరబ్బీ, ఇండో ఆర్యన్
16. సర్ప లేఖనం అంటే..?
ఎ) ఒక వరుసను ఎడమ నుంచి కుడికి
తర్వాతి వరుసను కుడి నుంచి ఎడమ కు రాయడం
బి) ఒక వరుసను కుడి నుంచి ఎడమకు
తర్వాతి వరుసను ఎడమ నుంచి కుడికి
రాయడం
సి) మొదటి వరుసను ఎడమ నుంచి కుడికి
తర్వాతి వరుసలను కుడి నుంచి ఎడమకు రాయడం
డి) మొదటి వరుసను కుడినుంచి
ఎడమకు తర్వాతి వరుసలను ఎడమ
నుంచి కుడికి రాయడం
17. సింధూ నాగరికత శిథిలాలు ఎక్కువగా ఎక్కడ బయటపడ్డాయి?
ఎ) హరప్పా బి) మొహెంజోదారో
సి) ధోలవీరా డి) సూక్తజెండార్
18. ఆర్య నాగరికత ఏ నదుల మధ్య విలసి ల్లినట్లుగా భావిస్తున్నారు?
ఎ) నర్మద, తపతి
బి) సింధూ, దాని ఉపనదులు
సి) గంగా, యమునా
డి) బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు
19. వేదం అంటే..?
ఎ) నీతి నియమావళి
బి) జ్ఞానం
సి) సంస్కృతి
డి) గ్రంథస్తం చేసినది
20. వేద నాగరికతా కాలం?
ఎ) క్రీ.పూ.1500-క్రీ.పూ.1000
బి) క్రీ.పూ.1000-క్రీ.పూ.600
సి) క్రీ.పూ.1000-క్రీ.శ.600
డి) క్రీ.పూ.1500-క్రీ.పూ.600
21. ఆర్యులు భారతదేశంలో స్థిరపడిన విధా నాన్ని తెలిపే గ్రంథం?
ఎ) అబిధమ్మ పీఠిక బి) రుగ్వేదం
సి) యజుర్వేదం డి) సామవేదం
22. హరప్పా నాగరికత విలసిల్లిన కాలం?
ఎ) క్రీ.పూ.3000-క్రీ.పూ.1500
బి) క్రీ.పూ.3500-క్రీ.పూ.2000
సి) క్రీ.పూ.2500-క్రీ.పూ.1000
డి) క్రీ.పూ.2000-క్రీ.పూ.1000
23. సింధూ నగరాల్లో రహదారుల వెడల్పు ఎన్ని మీటర్ల వరకు ఉండేది?
ఎ) 3-10 మీ. బి) 5-15 మీ.
సి) 10-15 మీ. డి) 8-16 మీ.
24. సింధూ ప్రజలకు ఏఏ దేశాలతో వ్యాపార, సాంస్కృతిక సంబంధాలుండేవి?
ఎ) ఇరాన్, ఇరాక్, అఫ్ఘానిస్థాన్
బి) ఇరాన్, ఈజిప్ట్, రోమ్
సి) ఇరాక్, అరేబియా, గ్రీక్
డి) అఫ్ఘానిస్థాన్, ఈజిప్ట్, ఇరాన్
25. హరప్పా ప్రజల పురుష దేవుడు?
ఎ) శివుడు బి) పశుపతి
సి) రుద్రుడు డి) వరణుడు
26. హరప్పా నాగరికత ఏ నదీ తీర ప్రాంతంలో నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది?
ఎ) గంగా బి) యమునా
సి) సరస్వతి డి) సింధూ
27. హరప్పా నాగరికత కాలంలోని ప్రజలను ద్రావిడులని పిలిచినవారు?
ఎ) విదేశీ వర్తకులు
బి) పురాతత్వ శాస్త్రజ్ఞులు
సి) ఆర్యులు డి) చరిత్రకారులు
28. దశరాజ యుద్ధం ఎవరి మధ్య జరిగింది?
ఎ) ఆర్యులకు, ద్రావిడులకు
బి) ద్రావిడులకు, పదిమంది
ఇతర రాజులకు మధ్య
సి) ఆర్య తెగల మధ్య అంతర్యుద్ధం
డి) ద్రావిడ జాతుల మధ్య అంతర్యుద్ధం
29. ఆర్యుల పాలనా నిర్వహణలో రాజుకు సలహాలిస్తూ అతడి అధికారాన్ని అదుపులో ఉంచినవి?
ఎ) సభ, సమితి
బి) గ్రామణి, పురోహిత వర్గం
సి) ఘటికలు, రాజన్ అనుచర వర్గం
డి) గ్రామసభ, బ్రాహ్మణ పురోహితులతో
ఏర్పడిన సలహా సంఘం
30. ఆర్యులు మొదట ఎక్కడ స్థిరపడ్డారు?
ఎ) గంగానదీ పరివాహక ప్రాంతం
బీహార్
బి) పంజాబ్, సింధూనదీ ప్రాంతం
సి) ఉత్తరప్రదేశ్, నేపాల్ సరిహద్దు
డి) నర్మదానదీ ఉత్తర ప్రాంతం,
ఆరావళీ పర్వత దిగువ ప్రాంతం
31. దశరాజ యుద్ధ విజేతలు?
ఎ) ద్రావిడులు బి) ఆర్యులు
సి) 10 ఆర్య తెగల కూటమి
డి) భరతులనే ఆర్య తెగవారు
32. యజ్ఞ యాగాల ఉపయోగాన్ని తెలుపుతూ వర్ణ భేదాన్ని ఖండించినవి?
ఎ) వేదాలు, వేదాంగాలు
బి) రుగ్వేదం, సామవేదం
సి) అరణ్యకాలు, ఉపనిషత్తులు
డి) సంహితలు, ఇతిహాసాలు
33. కర్షాపనం అంటే..?
ఎ) మలివేదకాలం నాటి నాణెం
బి) ఆర్యులు ఆరాధించే ఆయుధం
సి) ఆర్యులు యజ్ఞ, యాగాదుల్లో
ధరించే వస్త్రం
డి) మలివేద కాలంలో ప్రజల నుంచి
వసూలు చేసిన పన్ను
34. మలివేద కాలంలోని విద్యా కేంద్రం?
ఎ) మగధ బి) వారణాసి
సి) అవంతి డి) కోసల
35. మొహెంజోదారో పాకిస్థాన్‌లోని ఏ జిల్లా లో ఉంది?
ఎ) సింధూ బి) హైదరాబాద్
సి) ముల్తాన్ డి) లార్కానా
36. భారతదేశంలోని సింధూ నాగరికత కాలం నాటి నగరం?
ఎ) హరప్పా బి) చన్హుదారో
సి) దైమాబాద్ డి) సూక్తజెండార్
37. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన వారని అభిప్రాయపడినవారు?
ఎ) మార్టిమర్ వీలర్
బి) దాదాభాయ్ నౌరోజీ
సి) బాలగంగాధర్ తిలక్
డి) కె.ఆర్.రావు
38. కింది వాటిలో సరికానిది?
ఎ) రుగ్వేదం-ఆర్యుల సామాజిక విధానం
బి) యజుర్వేదం- యజ్ఞయాగాదులు
సి) సామవేదం- సంగీతం
డి) అధర్వణవేదం- సంస్కృత
వ్యాకరణం, ఛందస్సు
39. అయస్ అంటే..?
ఎ) లోహం బి) గ్రామపెద్ద
సి) ఆర్యదేవత
డి) ద్రావిడుల వ్యవసాయ పనిముట్లు
40. సమాజంలో వర్ణ వ్యవస్థకు బీజాలు ఏ కాలంలో పడ్డాయి?
ఎ) సింధూ నాగరికత అంతమవ్వడానికి
కొంతకాలం ముందు
బి) తొలివేద కాలం ప్రారంభంలో
సి) తొలి వేదకాలం చివరలో
డి) మలివేదకాలం ప్రారంభంలో
41. గృహపతిని ఇలా కూడా పిలిచేవారు?
ఎ) గవిష్టి బి) సంగ్రాహిత్రి
సి) దంపతి డి) రాజన్
42. {పకృతి దేవతారాధకులైన ఆర్యులు ఆరాధించిన దైవం?
ఎ) శివుడు బి) రుద్రుడు
సి) అగ్నిదేవుడు డి) సూర్యుడు
43. పంచమ వేదంగా ప్రఖ్యాతి గాంచింది?
ఎ) మహాభారతం బి) రామాయణం
సి) ఆయుర్వేదం డి) రుగ్వేదం
44. ఏ ప్రాచీన నాగరికతల మధ్య సారూప్యత ఉన్నట్లుగా తెలుస్తోంది?
ఎ) సింధూ, ఈజిప్ట్, మెసపటోమియా
బి) సింధూ, ఆర్య, ఈజిప్ట్, గ్రీక్
సి) సింధూ, మెసపటోమియా, చైనా
డి) ఆర్య, గ్రీక్, చైనా, రోమన్
45. సింధూ ప్రజలు పూజించిన పశుపతి ముద్ర ఎక్కడ జరిగిన తవ్వకాల్లో బయటపడింది?
ఎ) హరప్పా బి) మొహెంజోదారో
సి) రంగ్‌పూర్ డి) లోథాల్
సమాధానాలు
1) బి; 2) ఎ; 3) సి; 4) సి; 5) డి;
6) బి; 7) డి; 8) బి; 9) డి; 10) బి;
11) ఎ; 12) సి; 13) డి; 14) బి; 15) బి;
16) ఎ; 17) ఎ; 18) సి; 19) బి; 20) డి;
21) బి; 22) ఎ; 23) ఎ; 24) ఎ; 25) బి;
26) డి; 27) సి; 28) సి; 29) ఎ; 30) బి;
31) డి; 32) సి; 33) ఎ; 34) బి; 35) డి;
36) సి; 37) సి; 38) డి; 39) ఎ; 40) సి;
41) సి; 42) సి; 43) ఎ; 44) ఎ; 45) బి