సోషల్ స్టడీస్ టెట్ + డీఎస్సీ పేపర్ - 2
అర్థశాస్త్రం - మౌలిక భావనలు
1. స్వచ్ఛమైన పబ్లిక్ వస్తువుల/సేవలకు ఉదాహరణ? (జూలై-2011 టెట్)
ఎ) గాలి బి) దేశ రక్షణ
సి) రోడ్డు డి) రైల్వేలు
2. ఆర్థిక రంగానికి సంబంధించిన మౌలిక ప్రశ్న కానిది? (జూలై -2011 టెట్)
ఎ) ఎందుకు ఉత్పత్తి చేయాలి
బి) ఎలా ఉత్పత్తి చేయాలి
సి) ఎక్కడ ఉత్పత్తి చేయాలి
డి) ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి
3. సహకార సంస్థల ముఖ్య సిద్ధాంతం?
(జూలై-2011 టెట్)
ఎ) లాభార్జన బి) ప్రజా సంక్షేమం
సి) అందరి కోసం తాము, తమ కోసం
అందరూ పాటుపడడం
డి) వాటాలను ప్రోత్సహించడం
4. డాక్టర్ అమర్త్యసేన్ అర్థశాస్త్రాన్ని ఎలా నిర్వచించాడు? (జూలై-2011 టెట్)
ఎ) సంపదకు సంబంధించిన శాస్త్రం
బి) మానవుడు, అతడి శ్రేయస్సును
అధ్యయనం చేసేది
సి) ఎంపిక శాస్త్రం
డి) విజ్ఞాన శాస్త్ర శ్రేయస్సు
5. {పయోజనాన్ని ఎవరు నిర్ధారిస్తారు?
(జూలై -2011 టెట్)
ఎ) ఉత్పత్తిదారుడు
బి) వినియోగదారుడు
సి) అమ్మకపుదారుడు డి) అర్థ శాస్త్రవేత్త
6. ద్వితీయ రంగ ఆర్థిక వ్యవస్థకు ఉదాహ రణ? (జూలై-2011 టెట్)
ఎ) అడవులు బి) పశు సంవర్థనం
సి) నీటి సరఫరా డి) రియల్ ఎస్టేట్
7. ఒక వ్యక్తి ఒక ఊరికి చేరేందుకు రైలు, విమానం అనే రెండు మార్గాలు ఉన్నాయి. అతడు తన ప్రయాణానికి విమానాన్ని ఎంచుకుంటే, ఈ ఎంపిక కోరికల ఏ లక్షణాన్ని కలిగి ఉందని చెప్పొచ్చు?
(జన వరి-2012 టెట్)
ఎ) కోరికలు ప్రత్యామ్నాయాలు
బి) కోరికలు అపరిమితం
సి) కోరికలు ఒకదానితో ఒకటి
పోటీపడతాయి
డి) కోరికలు మళ్లీ మళ్లీ పుడతాయి
8. బంగారం అనేది? (జనవరి-2012 టెట్)
ఎ) మూలధనం, నశ్వర వస్తువు
బి) మూలధనం, ఆర్థిక వస్తువు
సి) వినియోగ, పబ్లిక్ వస్తువు
డి) ప్రైవేట్, ఉచిత వస్తువు
9. విత్త లభ్యత ఆధారంగా... భాగస్వా మ్యాలు, కంపెనీలు, ఏక యాజమాన్యం, కార్పొరేషన్లు వీటిలో మొదటి ప్రాధాన్యతను గుర్తించండి? (జనవరి-2012 టెట్)
ఎ) భాగస్వామ్యాలు బి) కంపెనీలు
సి) ఏక యాజమాన్యం
డి) కార్పొరేషన్లు
10. రూప ప్రయోజనానికి ఉదాహరణ?
(మే- 2012 టెట్)
ఎ) ముడి పత్తి నుంచి దుస్తుల తయారీ
బి) వస్తువులను తయారైన ప్రాంతం నుంచి తరలించడం
సి) సరుకును కొనుగోలు చేసి, నిల్వ చేసి తర్వాత అమ్మడం
డి) సేవల ద్వారా మానవ కోరికలను తీర్చడం
11. ఆర్థిక వ్యవస్థ నవీకరణను సూచించే రంగం? (మే-2012 టెట్)
ఎ) ప్రాథమిక బి) ద్వితీయ
సి) తృతీయ డి) వ్యవసాయ
12. {Oపెవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉండాల్సిన సభ్యుల సంఖ్య? (మే-2012 టెట్)
ఎ) 3 బి) 5 సి) 4 డి) 2
13. మాధ్యమిక వస్తువులకు ఉదాహరణ?
ఎ) యంత్ర పరికరాలు
బి) ముడి పత్తి
సి) గడియారాలు డి) ఎరువులు
14. {Oపెవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటా మూల ధనం కలిగిన భాగస్వాముల సంఖ్య? (డీఎస్సీ- 2008)
ఎ) 100 మంది సభ్యులు
బి) పరిమితి లేదు
సి) 50 మంది సభ్యులు
డి) 50-75 మంది సభ్యులు
15. బాటకము అంటే..? (డీఎస్సీ-2008)
ఎ) వ్యవస్థాపనం చేసినందుకు ప్రతిఫలం
బి) కార్మికుడి శ్రమకు చెల్లించే ప్రతిఫలం
సి) పెట్టుబడికి చెల్లించే ప్రతిఫలం
డి) భూమికి చెల్లించే ప్రతిఫలం
16. నదికి అడ్డంగా మోటారు వాహనాల కోసం నిర్మించిన వంతెన ఏ కోవకు చెందింది?
ఎ) ఉచిత వస్తువు
బి) ప్రైవేట్ వస్తువు
సి) సార్వజనిక వస్తువు
డి) స్వచ్ఛమైన సార్వజనిక వస్తువు
17. ఉత్పత్తి ప్రాతిపదికన విద్య అనేది? (డీఎస్సీ-2008)
ఎ) అంతిమ ఉత్పత్తి
బి) మాధ్యమిక ఉత్పత్తి
సి) ప్రాథమిక ఉత్పత్తి డి) ప్రత్యక్ష ఉత్పత్తి
18. పబ్లిక్ ఆస్తికి ఒక ఉదాహరణ? (డీఎస్సీ -2012)
ఎ) సముద్రనీరు బి) విద్యుచ్ఛక్తి
సి) జనరేటర్ డి) వార్తాపత్రిక
19. ఒక వ్యాపారవేత్త తన ఉత్పత్తిని ఒక నెల లోనే పెంచడానికి.. మూలధనాన్ని, కార్మికు ల సంఖ్యను పెంచితే దాన్ని ఏమంటారు?
(డీఎస్సీ-2012)
ఎ) క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం
బి) సరఫరా సూత్రం
సి) తరహాననుసరించి ప్రతిఫలాల
సిద్ధాంతం
డి) చరానుపాత సిద్ధాంతం
20. 20 ఎకరాలకు పంట దిగుబడి 800 బస్తాల వరి అయితే ఎకరాకు దాని ఉత్పాదకత?
(డీఎస్సీ-2012)
ఎ) 40 బస్తాలు బి) 80 బస్తాలు
సి) 100 బస్తాలు డి) 60 బస్తాలు
21. కింది సూత్రాన్ని గమనించి విలువను కనుక్కోండి. లాభం (Pr)= మొత్తం రాబడి(Tr)- మొత్తం వ్యయం(Tc). Tr=Tc అయితే ్కట=? (డీఎస్సీ-2012)
ఎ) (+1) బి) (-1)
సి) (O) డి) (±1)
22. ఆంతరంగిక వ్యవస్థాపనకు ఉదాహరణ? (డీఎస్సీ-2012)
ఎ) బహుళ విభాజిత రూపాలు
బి) ప్రొప్రైటర్ విధానం
సి) భాగస్వామ్యం డి) సహకార సంఘం
23. జనపనారను సంచిగా తయారు చేయడం వల్ల సంచికి కలిగే ప్రయోజనం? (డీఎస్సీ-2012)
ఎ) సేవా ప్రయోజనం
బి) స్థల ప్రయోజనం
సి) రూప ప్రయోజనం
డి) కాల ప్రయోజనం
24. అర్థశాస్త్ర పితామహుడు?
ఎ) అమర్త్యసేన్ బి) ఆడమ్ స్మిత్
సి) అరిస్టాటిల్ డి) జాన్ కీన్‌స
25. కింది వాటిలో సరికానిది?
ఎ) అమర్త్యసేన్-సంక్షేమం
బి) ఆడమ్ స్మిత్-సంపద
సి) మార్షల్-ఎంపిక
డి) రాబిన్‌స-కొరత
26. మానవుడు తన కోర్కెలను సంతృప్తిపర్చు కోవడానికి ధనాన్ని ఏ విధంగా ఉపయోగి స్తాడో తెలిపేది?
ఎ) సంపద శాస్త్రం బి) కొరత శాస్త్రం
సి) సంక్షేమ శాస్త్రం
డి) శ్రేయస్సుకు సంబంధించిన శాస్త్రం
27. అర్థ శాస్త్రాన్ని సూక్ష్మ, స్థూల అర్థ శాస్త్రాలు గా వర్గీకరించినవారు?
ఎ) అమర్త్యసేన్ బి) రాగ్నార్ ఫ్రిష్
సి) ఆడమ్ స్మిత్ డి) మార్షల్
28. అర్థశాస్త్రంలో ప్రతిభ కనబర్చిన వారికి ఏ సంవత్సరం నుంచి నోబెల్ బహుమతి ఇస్తున్నారు?
ఎ) 1969 బి) 1972
సి) 1964 డి) 1975
29. వినియోగానికి మూలం?
ఎ) అవసరాలు బి) ఉత్పత్తి
సి) కోరికలు డి) వినిమయం
30. {పయోజనం అంటే..?
ఎ) వినియోగదారుడి అవసరాలను
సంతృప్తిపర్చడం
బి) వినియోగదారుడి కోరికలను తీర్చే
ఆర్థిక ప్రక్రియ
సి) వస్తువు ఉత్పత్తికి మూలధనాన్ని
సమకూర్చినందుకు వచ్చే లాభం
డి) వస్తువుకు గల కోరిక తీర్చగలిగే శక్తి
31. ఇడ్లీ పిండి నుంచి ఇడ్లీలను తయారు చేయ డం, పండ్లను శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచి కొరత ఉన్నప్పుడు విక్రయించడం ఏ ప్రయోజనాలకు ఉదాహరణలు?
ఎ) స్థల, సేవా ప్రయోజనాలు
బి) రూప, కాల ప్రయోజనాలు
సి) స్థల, రూప ప్రయోజనాలు
డి) కాల, స్థల ప్రయోజనాలు
32. ఉత్పత్తి అంటే..?
ఎ) ప్రయోజనాలను సృష్టించడం
బి) మూలధనాన్ని సద్వినియోగం
చేసుకోవడం
సి) వినియోగదారుడి అవసరాలను,
కోరికలను తీర్చడం
డి) శ్రమకు ప్రతిఫలాన్ని అందించడానికి
దోహదం చేయడం
33. ఉత్పత్తికి ఆధారం..?
ఎ) మూలధనం బి) మార్కెట్
సి) వినియోగం
డి) డిమాండ్ - పంపిణీ
34. ఉత్పత్తికి, వినియోగానికి మధ్య సంబంధం?
ఎ) ప్రమేయ సంబంధం
బి) సహకార సంబంధం
సి) విలోమ సంబంధం
డి) అనులోమ సంబంధం
35. ఉత్పత్తి (Q), భూవి$ (N), శ్రమ (L), మూలధనం (K), వ్యవస్థాపన (O), ప్రమేయ సంబంధం (ఊ) అనుకుంటే ఖ=?
ఎ) O+F(N,L,K)
బి) O(N,L,K)+F
సి) F(N,L,K,O)
డి) ై(N,L,K,F)
36. ఉత్పత్తి సాధనం కానిది?
ఎ) శ్రమ బి) వినిమయం
సి) మూలధనం డి) వ్యవస్థాపన
37. కింది వాటిలో చర మూలధనం కానిది?
ఎ) కార్మికుల వేతనాలు
బి) యంత్రాలు
సి) విద్యుచ్ఛక్తి డి) ఇంధనం
38. వినిమయం అంటే?
ఎ) ధర చెల్లించి వస్తువును తీసుకోవడం
బి) వస్తువును మార్పిడి చేసుకోవడం
సి) బి, ఎ
డి) వినియోగానికి అవసరమైన వస్తువును
పొందడం
39. పంపిణీ అంటే..?
ఎ) ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలం
బి) ఉత్పత్తికి కారణాలైన సాధనాలనువినియోగదారులకు అందించి, లాభాలు సాధించడం
సి) ఉత్పత్తి ఫలాలుగా ఉత్పత్తులను అందించడం
డి) ఉత్పత్తులను సరైన క్రమంలో
పంపిణీదారులు, వినియోగదారులకు
విక్రయించడం
40. మూలధనానికి ప్రతిఫలం?
ఎ) వేతనం బి) భాటకం
సి) లాభం డి) వడ్డీ
41. మొబైల్ ఫోన్ ఒక..?
ఎ) విలాస వస్తువు
బి) అవసరమైన వస్తువు
సి) సౌకర్యవంతమైన వస్తువు
డి) అత్యవసరమైన వస్తువు
42. తరగతి గదిలో కంప్యూటర్ పాఠాలు అనేవి?
ఎ) సౌకర్యం బి) అవసరం
సి) విలాసం డి) అత్యవసరం
43. {పతి వ్యక్తి తన కోర్కెలను తీర్చుకోవడానికి తప్పనిసరిగా అవసరమైనది?
ఎ) సామర్థ్యం
బి) ప్రతిఫలం
సి) ప్రత్యామ్నాయం
డి) కారకం/సాధనం
44. దుకాణంలోని పుస్తకం ప్రైవేట్ వస్తువు అయితే గ్రంథాలయంలోని పుస్తకం?
ఎ) ఉచిత వస్తువు
బి) మాధ్యమిక వస్తువు
సి) పబ్లిక్ వస్తువు డి) ఎ, సి
సమాధానాలు
1) బి; 2) ఎ; 3) సి; 4) డి; 5) ఎ;
6) డి; 7) ఎ; 8) బి; 9) బి; 10) ఎ;
11) సి; 12)డి; 13) బి; 14) సి; 15) డి;
16) సి; 17) సి; 18) ఎ; 19)సి;
20)ఎ; 21) సి; 22) ఎ; 23) సి; 24)బి;
25)సి; 26) ఎ; 27) బి; 28) ఎ; 29)సి;
30)డి; 31) బి; 32) ఎ; 33) సి; 34)డి; 35)సి;
36) బి; 37) బి; 38) సి; 39) ఎ; 40)డి;
41) బి; 42) ఎ; 43) సి; 44) సి;