మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్ మీడియెట్ వార్షిక పరీక్షలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 26,001 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో కొన్ని సమస్యాత్మక కళాశాలలను ఎంపిక చేసి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. 22 ప్రభుత్వ కళాశాలలకు ప్రభుత్వమే కెమెరాలను అందించింది.
నిమిషం నిబంధన
ఇంటర్ పరీక్షల్లో ‘నిమిషం’ నిబంధన పకడ్బందీగా అమలు చేయనున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8గంటలకే చేరుకోవాలి. 8.30 గంటలకు తమకు కేటాయించిన సీటులో కూర్చుని, 8.45 నుంచి 9గంటల వరకు పరీక్షకు సంబంధించి ప్రక్రియ మొదలు చేయాల్సి ఉంటుంది. ఇక చివరగా 9గంటల్లోపు విద్యార్థులు పరీక్ష కేంద్రంలో ఉండాలి. ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రంలోని విద్యార్థులను అనుమతించరు.
ఏర్పాట్లు పూర్తి
పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో భద్రపరిచారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పరీక్ష కేంద్రాలకు పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు ప్రత్యేక భద్రత మధ్య కేంద్రాల వద్దకు తీసుకెళ్తారు. అంతేకాకుండా పరీక్షల్లో కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఫ్లయింగ్ స్వా్కడ్‌లుగా 2 టీంలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక జూనియర్ లెక్చరర్, ఒక రెవెన్యూ అధికారి, పోలీస్ శాఖనుంచి సీఐ స్థాయి అధికారులు జిల్లా వ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాలను ప్రతి రోజు తనిఖీ చేస్తారు.
వీరితో పాటు సిట్టింగ్ స్వా్కడ్‌లుగా 3 టీంలను ఏర్పాటు చేశారు. వీరిలో ఇద్దరి చొప్పుడు జూనియర్ లెక్చరర్లు తనిఖీలు చేస్తారు. పరీక్షల సమయంలో చుట్టుపక్కన జిరాక్స్ సెంటర్లు తెరవకుండా అధికారులు చర్యలు తీసుకోవడం, పరీక్ష కేంద్రం చుట్టుపక్కల ఎవరూ రాకుండా 144 సెక్షన్ విధించనున్నారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ అధికారులు, విద్యుత్ అంతరాయం లేకుండా పూర్తిచర్యలు తీసుకుంటున్నారు విద్యార్థుల కోసం అదనంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ముందుకు వచ్చారు.
సీసీ కెమెరాలు తప్పనిసరి
గత విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ పరీక్షల్లో ప్రభుత్వం సీసీ కెమెరాల వినియోగం ఖచ్చితం చేసింది. ముఖ్యంగా ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో పరీక్షను పారద్శకంగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకుంది. ప్రశ్నపత్రాల సీల్‌కవరు తెరవడం మొదలు, పరీక్ష అనంతరం జవాబు పత్రానుల సీల్ చేసేంత వరకు కూడా అన్ని ప్రక్రియలు సీసీ కెమెరాల నిఘాలోనే జరగాల్సి ఉంది. దీనివల్ల ప్రైవేటు కళాశాలల్లో మాస్ కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.æ కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికి అవి ప్రస్తుతం పనిచేయడంలేదని తెలిసింది. వాటిని సకాలంలో రీపేరు చేయించాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా చాలా పరీక్ష కేంద్రాల్లో వసతుల కొరత ఉంది. దీంతో అధికారులు సదుపాయాల కల్పన కోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.
బేంచీలు ఇరత ఫర్నీచర్‌లు కొరత ఉన్న చోట అద్దెకు తీసుకువచ్చి ఏర్పాటు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు సూచనలు
- పరీక్షకు వెళ్లే ముందు హాల్‌టికెట్, పరీక్ష ప్యాడ్, ఐడీకార్డు, బ్లూ, బ్లాక్ పెన్నులు అందుబాటులో ఉంచుకోవాలి.
- ఫిజిక్సు, మాథ్స్ పరీక్ష సమయంలో స్కేల్‌లు, పెన్సిళ్లు, ఎరైజర్, గణితానికి సంబంధించిన పరికరాలు తీసుకెళ్లవచ్చు.
- పరీక్ష ప్రారంభమయ్యే సమయం 9గంటలకు అయినా 8.30 గంటలకే పరీక్ష కేంద్రంలో ఉండాల్సి ఉంటుంది. 9గంటలు దాటితే అనుమతించరు.
- పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్‌లు, క్యాలిక్యులేటర్, ఇంతర ఎలక్ట్రానిక్ యంత్ర పరికరాలు ఎటువంటి పరిస్థితిలో దగ్గర ఉంచుకోకూడదు. ఉంటే మాల్ ప్రాక్టిస్ కింద బుక్ అయ్యే అవకాశం ఉంది.
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వెంక్యానాయక్ అన్నారు. మంగళవారం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 8.45లోపు చేరుకోవాల్సి ఉంటుందన్నారు.
సుదూర ప్రాంతాలనుంచి వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు సకాలంలో బస్సులు నడిపే విధంగా సూచించామని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, ప్రశ్నాపత్రాలు తెరవడం, సీల్ చేయడం వంటి అన్ని అంశాలు కూడా సీసీ కెమోరాల ముందే చేయాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా హాల్‌టికెట్లు ప్రైవేటు కళాశాలల్లో పొందని విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్ పొందే విధంగా అవకాశం కల్పించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment