
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ రెండో విడత అడ్మిషన్ల షెడ్యూల్‌ను కన్వీనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. బీఈ, బీటెక్, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ఫీజు చెల్లింపులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ వివరాలను షెడ్యూల్‌లో పొందుపరిచారు. వివరాలకు tseamcet.nic. inను సంప్రదించవచ్చు. కాగా, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 67,946 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి దశ కౌన్సెలింగ్‌లో 52,621 సీట్లను విద్యార్థులకు కేటాయించినట్లు నవీన్ మిట్టల్ తెలిపారు. అందులో 38,705 మంది విద్యార్థులు తమ సీట్లను కన్ఫామ్ చేసుకున్నారని వెల్లడించారు.
షెడ్యూల్ వివరాలు..
- ఫీజు చెల్లింపులు: జూలై 6 నుంచి 8 వరకు
- వెరిఫికేషన్: జూలై 7 నుంచి 8 వరకు
- వెబ్‌ఆప్షన్లు: జూలై 7 నుంచి 10 వరకు
- సీట్లు కేటాయింపు: జూలై 12న
- ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: జూలై 12 నుంచి 14 వరకు
- కాలేజీలో రిపోర్టు చేయాల్సింది:జూలై 13 నుంచి 15 వరకు
- తరగతులు ప్రారంభం: జూలై 16 నుంచి
Comments
Please login to add a commentAdd a comment