ఎంసెట్ కేసులో మరొకరి అరెస్టు.. నగదు స్వాధీనం | another arrested in eamcet leakage case, amount seized | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కేసులో మరొకరి అరెస్టు.. నగదు స్వాధీనం

Published Fri, Jul 29 2016 6:37 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

ఎంసెట్ కేసులో మరొకరి అరెస్టు.. నగదు స్వాధీనం - Sakshi

ఎంసెట్ కేసులో మరొకరి అరెస్టు.. నగదు స్వాధీనం

ఎంసెట్ -2 లీకేజి వ్యవహారంలో మరో వ్యక్తిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. రమేష్ అలియాస్ షేక్ రహీమ్ అనే వ్యక్తిని అరెస్టుచేసిన సీఐడీ వర్గాలు.. అతడి నుంచి రూ. 37.5 లక్షలు స్వాధీనం చేసుకున్నాయి. రమేష్ స్నేహితుడి ఖాతా నుంచి మరో రూ. 15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 14 మంది విద్యార్థుల నుంచి రమేష్ దాదాపు రూ. 1.73 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. అందులో కొంత మొత్తాన్ని విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసిన మరో బ్రోకర్కు ఇచ్చారు. విద్యార్థులను పుణెకు తీసుకెళ్లి శిక్షణ ఇచ్చారు. కాగా, ఎంసెట్-2 లీకేజిలో ఇప్పటివరకు ముగ్గురిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. మరికొందరు బ్రోకర్లు, ఈ కుట్రకు సూత్రధారులపై సీఐడీ దృష్టి సారించింది. ఒకటి రెండు రోజుల్లోనే మరికొందరిని అరెస్టు చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement