అవును.. ఎంసెట్ పేపర్ లీకైంది | telangana government admints leakage of eamcet question paper | Sakshi
Sakshi News home page

అవును.. ఎంసెట్ పేపర్ లీకైంది

Published Tue, Aug 2 2016 11:49 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

అవును.. ఎంసెట్ పేపర్ లీకైంది - Sakshi

అవును.. ఎంసెట్ పేపర్ లీకైంది

తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్-2 పేపర్ లీకైందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పేపర్ లీకేజి విషయంపై కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చింది. దాంతో మళ్లీ పరీక్ష నిర్వహించే విషయంపై ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలపాలని హైకోర్టు కోరింది. అనంతరం ఈ అంశంపై విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

ఏపీ ఎంసెట్‌లో వేలల్లో ర్యాంకులు వచ్చిన కొంతమందికి తెలంగాణ ఎంసెట్‌లో మాత్రం వందల్లో ర్యాంకులు రావడంతో ఎంసెట్-౨ పేపర్ లీకై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేయగా, సీఐడీ విచారణతో మొత్తం గుట్టు రట్టయింది. పేపర్ లీకైనందున పరీక్ష రద్దుచేయాలంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement