సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జేఎన్‌టీయూహెచ్‌లో ఫలితాల విడుదలకు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12న ఎంసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు ఇంజనీరింగ్ విభాగంలో 1,41,190 మంది దరఖాస్తు చేసుకోగా, 1,39,100 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 79,061 మంది దరఖాస్తు చేసుకోగా, 73,601 మంది పరీక్ష రాశారు.