హైదరాబాద్: తెలంగాణలోని ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి టీ-ఎంసెట్ పరీక్ష కేంద్రాలను ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేంద్రాల ఏర్పాటుపై ఏపీ అధికారులు టీ-ఎంసెట్ కన్వీనర్ రమణారావుతో చర్చించారు. ఏపీ ఎంసెట్-2016 కేంద్రాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లే... టీ-ఎంసెట్ కేంద్రాలను ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతిల్లో ఏర్పాటుచేయాలని కన్వీనర్‌ను కోరారు.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి తీసుకొని ఏపీలో టీ-ఎంసెట్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కన్వీనర్ సానుకూలం వ్యక్తం చేసినట్లు ఏపీ అధికారవర్గాలు వివరించాయి. గతేడాది హైదరాబాద్‌లో ఏపీ ఎంసెట్ కేంద్రాలు ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహించినా... తెలంగాణ మాత్రం టీ-ఎంసెట్ కేంద్రాలను ఆ రాష్ట్రానికే పరిమితం చేసింది.