తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. సచివాలయంలోని డీ బ‍్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 78.24 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 90.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,36,305మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,06,646మంది పాసయ్యారు. మే 25 నుంచి ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే జులై మొదటి వారంలో రెండో విడత కౌన్సిలింగ్ ఉంటుందని, జులై 16 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంటర్నల్స్ స్లైడింగ్ విధానం ద్వారా ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు విద్యార్థులు మారవచ్చని తెలిపారు.