మే 16న ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ తో పోల్చితే..
హైదరాబాద్: మే 16న ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ తో పోల్చితే.. పరీక్ష జరిగిన మరుసటి రోజే సాక్షి ప్రచురించిన ఎంసెట్ మెడికల్ కీ 100% కచ్చితత్వంతో, ఇంజనీరింగ్ కీ 98.12% కచ్చితత్వంతో ఉంది. విభజన తర్వాత టీ సర్కార్ తొలిసారిగా విడిగా ఈ నెల 14న ఎంసెట్‌ను నిర్వహించింది.
ఇంజనీరింగ్ పరీక్షకు 1,28,174 మంది, మెడికల్‌కు 64,678 మంది హాజరయ్యారు. అభ్యర్థులకు ఉపయోగపడేలా సబ్జెక్టు నిపుణుల బృందం సహాయంతో సాక్షి మే 15న ఎంసెట్ కీ ప్రచురించింది. అంతేకాకుండా పరీక్ష జరిగిన రోజే కీతోపాటు కొశ్చన్ పేపర్స్‌ను సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్‌లో అందుబాటులో ఉంచింది.