తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల | TS EAMCET result 2019 Declared | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

Published Sun, Jun 9 2019 12:17 PM | Last Updated on Sun, Jun 9 2019 3:43 PM

TS EAMCET result 2019 Declared - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ  ఎంసెట్‌ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఇవాళ మధ్యాహ్నం కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్‌లో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్‌ను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన రవిశ్రీ తేజ, సెకండ్‌ ర్యాంక్‌ డి.చంద్రశేఖర్‌ మూడో ర్యాంక్‌ ఆకాశ్‌ రెడ్డి (హైదరాబాద్‌), నాలుగో ర్యాంక్‌ కార్తీకేయ (హైదరాబాద్‌) సాధించారు. ఇక ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కుల కారణంగా ఎంసెట్‌ ఫలితాలు విడుదలలో జాప్యం జరిగింది. కాగా గత నెల 3, 4, 6, 8, 9 తేదీల్లో జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,42,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. 

ఇంజనీరింగ్‌లో తొలి పది ర్యాంకర్లు
1. కురిచేటి రవి శ్రీతేజ (తాడేపల్లిగూడెం)
2. చంద్రశేఖర్‌ (హైదరాబాద్‌)
3. ఆకాశ్‌ రెడ్డి (హైదరాబాద్‌)
4. కార్తికేయ (హైదరాబాద్‌)
5. భాను దత్తా (భీమవరం)
6. సాయి వంశీ (హైదరాబాద్‌)
7. సాయి విజ్ఞాన్‌ (హైదరాబాద్‌)
8. ఐతేంద్ర కశ్యప్‌ (గిద్దలూరు)
9. వేద ప్రణవ్‌ (హైదరాబాద్‌)
10. అప్పకొండ అభిజిత్‌ రెడ్డి (హైదరాబాద్‌)

అగ్రికల్చర్‌, ఫార్మసీలో..
1.కుశ్వంత్‌ (భూపాల్‌పల్లి)
2. దాసరి కిరణ్‌ కుమార్‌ (రాజమండ్రి)
3. వెంకట సాయి తేజ (కాకినాడ)
4. సుంకర సాయి స్వాతి (తిరుపతి)
5. అక్షయ్‌ (హైదరాబాద్‌)
6. మోనిష ప్రియ (తమిళనాడు)
7. బుర్ర శివాని శ్రీవాత్సవ (నిజామాబాద్‌)
8. సిద్ధార్థ భరద్వాజ్‌ (విశాఖపట్నం)
9. పూజ (తిరుపతి)
10. హశిత (హైదరాబాద్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement