సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నెల 3, 4, 6 తేదీ ల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను రెండు గంటల ముందునుంచే పరీక్ష కేంద్రంలోకి, గంటన్నర ముందునుంచి పరీక్ష హాల్లోకి అనుమతి ఇస్తారు.
తెలంగాణలోని 83 కేంద్రాల్లో, ఏపీలోని 11 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో ఇంజనీరింగ్ విద్యార్థులు 1,42,218 మంది ఉండగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 74,981 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్ష హాల్లో కి హాల్‌టికెట్, పూర్తి చేసిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులైతే అటెస్ట్ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేపర్లు, సెల్‌ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ నిషేధం.
Comments
Please login to add a commentAdd a comment