ఏపీలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎంసెట్‌కు తేదీలు ఖరారైన నేపథ్యంలో...
సాక్షి, హైదరాబాద్: ఏపీలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎంసెట్‌కు తేదీలు ఖరారైన నేపథ్యంలో తెలంగాణ లోనూ ఎంసెట్, ఐసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలపై ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది. ఏపీలో మే 5న ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించగా.. అంతకంటే ముందుగానే రాష్ట్రంలో ఎంసెట్‌ను నిర్వహించాలని కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించేందుకు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు, ఇతర అధికారులు, ఆ తరువాత వర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు.
ఈ సమావేశానంతరం పోటీ పరీక్షల తేదీల్ని నిర్ణయించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదంతో ప్రకటించాలని మండలి భావిస్తోంది. ఒకవేళ వీలైతే మే 2న ఎంసెట్ నిర్వహించే అవకాశం ఉంది.